
చిన్ననాటి కల ఇన్నాళ్లకు నెరవేరిందంటోంది హీరోయిన్ మృణాళిని రవి. కొత్తింటి కల సాకారం చేసుకున్నట్లు వెల్లడించింది.

ఈ మేరకు ఫ్యామిలీతో కలిసి గృహప్రవేశం చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.

చిన్నప్పుడు నాన్న ఇల్లు కట్టి దానికి తన తల్లి పేరు పెట్టాడు. అప్పుడది చూసి నేను కూడా పెద్దయ్యాక ఇలాగే ఓ ఇల్లు కొట్టి దానికి మా అమ్మ పేరు (మోళి) పెట్టాలనుకున్నాను.

ఎప్పటికైనా సరే ఈ కల నెరవేర్చుకోవాలనుకున్నాను. మీ అందరి ప్రేమాభిమానాలు, ఆశీస్సుల వల్లే ఇది సాధ్యమైంది.

నన్ను ఇంతదూరం తీసుకొచ్చిన మీ అందరికీ ఎల్లప్పటికీ రుణపడి ఉంటాను అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది.

మృణాళిని రవి తెలుగులో గద్దలకొండ గణేశ్, ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు, మామా మశ్చీంద్ర, లవ్ గురు వంటి చిత్రాల్లో నటించింది.





