
యూట్యూబ్ స్టార్ దీప్తి సునయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. డ్యాన్స్ వీడియోలతో పాపులర్ అయిన దీప్తి సునయన కవర్ సాంగ్స్, ప్రైవేట్ ఆల్భమ్స్‌తో మరింత గుర్తింపు సంపాదించుకుంది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న దీప్తి సునయన బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చాక షన్నూతో బ్రేకప్ చెప్పేసిన సంగతి తెలిసిందే. దీంతో మళ్లీ వీరిద్దరూ కలిస్తే బాగుండు అని ఫ్యాన్స్ తెగ కోరుకుంటున్నారు.
కానీ దీప్తి-షన్నూలు ఆ విషయంలో వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ఇదిలా ఉండగా దీప్తి సునయన తాజాగా కొత్త ఇల్లు కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో పలువురు నెటిజన్లు ఆమెకు కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment