
యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. డ్యాన్స్ వీడియోలు, వెబ్‌సిరీస్‌లతో గుర్తింపు పొందిన షణ్ముఖ్.. బిగ్‌బాస్ సీజన్-5లో పాల్గొని మరింత పాపులర్ అయ్యాడు. తనదైన ఆట తీరుతో రన్నరఫ్‌గా నిలిచి మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అనేకమంది అభిమానులకు కూడా సంపాదించుకున్నాడు. బిగ్‌బాస్ ముగిశాక దీప్తి సునయనతో బ్రేకప్ తర్వాత కొంతకాలం సోషల్ మీడియాకు దూరంగా షణ్నూ ఈమధ్య తిరిగి యాక్టివ్ అయ్యాడు.
రీసెంట్‌గా 'ఏజెంట్ ఆనంద్ సంతోష్' సిరీస్‌తో ఫ్యాన్స్‌ని పలకిరించాడు. తాజాగా షణ్నూ తన అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పాడు. దసరా పండుగ వేళ లగ్జరీ బ్రాండ్ బీఎండబ్ల్యూ కారును కొన్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలను షణ్నూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. ఇదంతా డ్రీమ్‌లా ఉంది. నా ఫ్యామిలీ తర్వాత నన్ను ఈ పొజీషన్‌లో చూడాలనుకున్నది మీరే.. నాట్ ఫ్రెండ్స్ ఓన్లీ మీరే.
ఐలవ్‌యూ 3000. ఇది మన కార్. బయట ఎప్పుడు కనిపించినా చెప్పండి. లిఫ్ట్ పక్కా ఇస్తా అంటూ షణ్నూ పోస్ట్ చేయడంతో అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇక ఈ కారు ధర సుమారు రూ. 45 లక్షలట. ఇక షణ్నూ పోస్ట్ చూసి అభిమానులు కంగ్రాంట్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment