
Shanmukh Jaswanth New House Warming Celebrations: యూట్యూబ్ స్టార్ షణ్ముక్ జస్వంత్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ ఫాలోయింగ్‌తోనే బిగ్‌బాస్ సీజన్-5లో ఎంట్రీ ఇచ్చాడు. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగినా రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా షణ్ముక్ హైదరాబాద్‌లో ఓ కొత్త ఇల్లు కొనుకున్నాడు.దీనికి సంబంధించి గృహప్రవేశాన్ని సైతం పూర్తి చేశాడు. నటి, చాయ్ బిస్కెట్ ఫేం శ్రీ విద్యతో కలిసి కొత్త ఇంట్లోకి అడుగుపెట్టాడు.
చదవండి: నటి, ఎమ్మెల్యే రోజా హోంటూర్.. అచ్చంగా ఇంద్రభవనమే
దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు. దీంతో షణ్నూకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త ఇంటితో పాటు కొత్త లక్ష్యాలతో జీవితంలో ముందుకు పయనించాలంటూ షణ్నూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఇటీవలె దీప్తి సునయనతో బ్రేకప్ అనంతరం కెరీర్‌పై ఫుల్ ఫోకస్‌తో ముందుకు వెళుతున్న షణ్నూ త్వరలోనే ఓ వెబ్‌సిరీస్‌తో ముందుకు వస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సిరీస్ త్వరలోనే రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment