యూట్యూబ్ స్టార్స్ షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునయనల క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. డ్యాన్స్ వీడియోలతో పాపులర్ అయిన ఈ ఇద్దరూ ఆ తర్వాత బిగ్‌బాస్ కంటెస్టెంట్లుగా మరింత పాపులర్ అయ్యారు. కానీ అనూహ్యంగా షణ్నూ బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చాక వీరు బ్రేకప్ చెప్పేసుకోవడం సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. దీంతో మళ్లీ వీరిద్దరూ కలిస్తే బాగుండు అని ఫ్యాన్స్ తెగ కోరుకుంటున్నారు.
తాజాగా షణ్నూ-దీప్తిలు ఒకే వేదికపై కనిపించడం ఆసక్తిగా మారింది. వైజాగ్‌లో నిర్వహించిన ఓ ఈవెంట్‌లో వీరిద్దరూ సందడి చేశారు. పక్కనే కూర్చున్న దీప్తిని చూస్తూ షణ్నూ సిగ్గుపడిపోయిన క్లిప్పింగ్స్ కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా స్టేజ్‌పైన షణ్నూ దీప్తి గురించి మాట్లాడుతూ.. ''మొదట్లో నేను, దీప్తి సునయన కవర్ సాంగ్స్ చేసేటప్పుడు చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి.
ఆమెకు వచ్చినన్ని ట్రోల్స్ ఎవరికీ రాలేదేమో. కానీ అవి చూసి దీప్తి ఎప్పుడూ వెనకడుగు వేయలేదు.నేను దీప్తీని చూసి చాలా నేర్చుకున్నాను. అలాగే అమ్మాయిలు దీప్తీని చూసి నేర్చుకోవాలి. మీరు కూడా ఒక ఇన్‌స్పిరేషన్ కావాలి” అంటూ షణ్నూ చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో వీరిద్దరూ మళ్లీ కలిసిపోయారా? త్వరలోనే ఆ గుడ్‌న్యూస్ షేర్ చేసుకుంటారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment