Nivetha Pethuraj Bloody Mary Movie Making Video Released Goes Viral - Sakshi
Sakshi News home page

Nivetha Pethuraj's Bloody Mary Movie: క్రైం థ్రిల్లర్‌గా 'బ్లడీ మేరీ'.. మేకింగ్ వీడియో వైరల్‌

Published Fri, Apr 8 2022 3:24 PM | Last Updated on Fri, Apr 8 2022 4:32 PM

Nivetha Pethuraj Bloody Mary Movie Making Video Released - Sakshi

కార్తీకేయ, సవ్యసాచి ఫేమ్‌ చందు మొండేటి దర్శకత్వంలో పూర్తి తరహా క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కింది 'బ్లడీ మేరీ'. ఈ సినిమాలో నివేదా పేతురాజ్‌ అంధురాలిగా అలరించనుంది. ఈ సందర్భంగా 'బ్లడీ మేరీ' మేకింగ్‌ వీడియోను రిలీజ్‌ చేసింది చిత్రబృందం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

Nivetha Pethuraj Bloody Mary Movie Making Video Released: యంగ్‌ హీరో శ్రీ విష్ణు నటించిన 'మెంటల్‌ మదిలో' చిత్రంతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది నివేదా పేతురాజ్. తర్వాత ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ 'అల వైకుంఠపురము' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. 'పాగల్‌' వంటి తదితర మూవీస్‌లో కీలక పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో నటిగా బాగానే  క్రేజ్‌ సంపాదించుకుంది. తాజాగా ఈ భామ నటించిన చిత్రం 'బ్లడీ మేరీ'. 

కార్తీకేయ, సవ్యసాచి ఫేమ్‌ చందు మొండేటి దర్శకత్వంలో పూర్తి తరహా క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కింది 'బ్లడీ మేరీ'. ఈ సినిమాలో నివేదా పేతురాజ్‌ అంధురాలిగా అలరించనుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా వేదికగా ఏప్రిల్‌ 15 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా 'బ్లడీ మేరీ' మేకింగ్‌ వీడియోను రిలీజ్‌ చేసింది చిత్రబృందం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. పీపుల్‌ ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కిరిటీ దామరాజ్, బ్రహ్మాజీ, అజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాలభైరవ సంగీతమందించగా.. కార్తీక్‌ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement