
నాగార్జునగారూ... రెండు కథలున్నాయి
‘‘మలయాళ ‘ప్రేమమ్’ చిత్రాన్ని హైదరాబాద్‌లో ఫస్ట్ షో చూశా. బాగా నచ్చింది. అప్పుడీ చిత్రాన్ని నాగచైతన్యతో రీమేక్ చేసే ఆలోచన లేదు. మేమిద్దరం వేరే సినిమా చర్చల్లో ఉన్నాం. చైతూ ఓకే అంటే ‘ప్రేమమ్’ను రీమేక్ చేస్తామని వచ్చిన పదిమంది నిర్మాతల్లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కూడా ఉంది. దాంతో రీమేక్ ఓకే చేశాం అని దర్శకుడు చందూ మొండేటి అన్నారు. నాగచైతన్య, శ్రుతీహాసన్, అనుపమా పరమేశ్వరన్, మడోన్నా స్టెబాస్టియన్ ముఖ్య పాత్రల్లో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ‘ప్రేమమ్’ గత శుక్రవారం విడుదలైంది.
దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఫస్ట్ కాపీ కంటే ముందు వచ్చే ఫస్ట్ కట్‌ను నాగార్జునగారు, త్రివిక్రమ్‌గారు చూశారు. నాగ్ సార్‌కు బాగా నచ్చడంతో కంగ్రాట్స్ చెప్పారు. ఆయన కాన్ఫిడెన్స్ మాలో నమ్మకం పెంచింది. మడోన్నా పాత్రకు సమంతను తీసుకోవాలనుకున్నాం. కానీ, శ్రుతీహాసన్ వంటి హీరోయిన్ ఉండగా మరో స్టార్ వద్దనుకున్నాం. నాగార్జునగారికి రెండు కథలు రెడీ చేశా. ఐ డ్రీమ్ ప్రొడక్షన్‌లో, ‘దిల్’ రాజుగారి బ్యానర్లో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి.