‘కార్తికేయ’ దర్శకుడు చందు
గొరగనమూడి (పాలకోడేరు రూరల్): అన్నపూర్ణా బ్యానర్‌లో నాగచైతన్య, తమన్న హీరోహీరోరుున్లగా త్వరలో ఓ చిత్రానికి దర్శకత్వం వహించనున్నానని ‘కార్తికేయ’ చిత్ర దర్శకుడు చందు మొండేటి తెలిపారు. గొరగనమూడి సర్పంచ్ చెల్లబోరుున పాపారావు నివాసానికి సోమవారం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. మంచి కథ, కథనం ఉంటే చిన్న సినిమాలరుునా విజయం సాధిస్తాయని.. ఇందుకు కార్తికేయ చిత్రమే నిదర్శనమని అన్నారు. తన స్వస్థలం కొవ్వూరు తాలూకా వేములూరు అని చెన్నైలో ఇంజినీరింగ్ పూర్తి చేసి 2008లో చిత్రసీమలో ప్రవేశించానన్నారు.
హీరో నిఖిల్, స్వామీరారా దర్శకుడు సుధీర్‌వర్మ తనకు మంచి స్నేహితులని చెప్పారు. సుధీర్ వర్మ, తాను యువత సినిమాకు అసిస్టెంట్ డెరైక్టర్‌సగా పనిచేశామన్నారు. నిఖిల్ ‘కలావర్ కింగ్’ సినిమాకు మాటలు రాశానన్నారు. వీటితో పాటు పలు యూడ్స్‌కు దర్శకత్వం వహించానని చందు చెప్పారు. తన దర్శకత్వంలో వచ్చిన తొలిసినిమా కార్తికేయ అని దీనిని చూసిన దర్శకుడు రాజమౌళి, వీవీ వినాయక్, సుకుమార్ అభినందించారన్నారు. నాగచైతన్య హీరోగా తెరకెక్కనున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ జూలైలో ప్రారంభవుతుందని చెప్పారు. సోషల్ మీడియా సినిమాల ప్రమోట్‌కు బాగా ఉపయోగపడుతుందని చెప్పారు. స్నేహితులు పాపారావు, ఆయన కుటుంబ సభ్యులు, విస్సాకోడేరు ఉప సర్పంచ్ బోల్ల శ్రీనును కలవడం ఆనందంగా ఉందన్నారు. బోల్ల శ్రీను, బొమ్మిడి ప్రసాద్, నాగరాజు, కుదుషా పాల్గొన్నారు.
నాగచైతన్యతో త్వరలో సినిమా
Published Tue, May 5 2015 3:06 AM | Last Updated on Sun, Sep 3 2017 1:25 AM
Advertisement
Advertisement