Annapurna banner
-
గుడ్ న్యూస్ చెప్పిన అరియానా.. యంగ్ హీరోతో..
బిగ్‌బాస్ షోలో ముక్కుసూటిదనంతో దూసుకెళ్తూ.. టాస్క్‌ల రారాణిగా గుర్తింపు పొందిన అరియానా గ్లోరీ లక్కీ చాన్స్ కొట్టేసినట్టు తెలుస్తోంది. బోల్డ్‌గా ఉంటూ అభిమానులను సొంతం చేసుకున్న ఈ యాంకర్ ఇప్పుడు హీరోయిన్గా మారనుందని తెలుస్తోంది. యాంకర్‌గా రామ్ గోపాల్ వర్మ్‌ను ఇంటర్వ్యూ చేయడంతో అందరి దృష్టి ఆకర్షించిన ఈ భామ ఇప్పుడు వెండితెరపై మెరవనున్నట్టు సమాచారం. బిగ్‌బాస్ షోలో అరియానా టాప్ 4లో ఉండడంతో ఆమెకు ఫాలోవర్ల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఇప్పుడుఈ అమ్మడుకి తెలుగులో ఓ అవకాశం వచ్చిందని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టు ద్వారా తెలుస్తోంది. యువ నటుడు రాజ్ తరుణ్‌తో కలిసి ఓ సినిమా చేస్తుందని ఫొటోను బట్టి భావించవచ్చు. సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు ఫేమ్ దర్శకుడు శ్రీనివాస్ గవిరెడ్డి ఈ సినిమా తెరకెక్కించనున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన వివరాలు తెలపకుండా ‘‘బిగ్‌బాస్ తర్వాత నా జీవితంలో ఓ మంచి రోజు. అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ గవిరెడ్డి గారికి థ్యాంక్స్. రాజ్ తరుణ్ నువ్వు అమేజింగ్’’ అని ఫొటో పెట్టి పోస్టు చేసింది. రాజ్‌తరుణ్, దర్శకుడు శ్రీనివాస్‌తో కలిసి దిగిన ఫొటోను పంచుకుంది. దీంతోపాటు అన్నపూర్ణ బ్యానర్‌ని హ్యాష్ ట్యాగ్ చేసింది. అన్నపూర్ణ బ్యానర్లో రాజ్‌తరుణ్ హీరోగా వస్తున్న సినిమాలో అరియానా నటిస్తున్నట్లు అర్దమవుతుంది. పూజా కార్యక్రమం కూడా పూర్తయినట్టు ఫొటోను చూస్తుంటే తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. చదవండి: వైరల్: ఈ బిగ్‌బాస్ హీరోను గుర్తుపట్టారా? View this post on Instagram A post shared by Anchor Ariyana (@ariyanaglory) -
నాగచైతన్యతో త్వరలో సినిమా
‘కార్తికేయ’ దర్శకుడు చందు గొరగనమూడి (పాలకోడేరు రూరల్): అన్నపూర్ణా బ్యానర్లో నాగచైతన్య, తమన్న హీరోహీరోరుున్లగా త్వరలో ఓ చిత్రానికి దర్శకత్వం వహించనున్నానని ‘కార్తికేయ’ చిత్ర దర్శకుడు చందు మొండేటి తెలిపారు. గొరగనమూడి సర్పంచ్ చెల్లబోరుున పాపారావు నివాసానికి సోమవారం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. మంచి కథ, కథనం ఉంటే చిన్న సినిమాలరుునా విజయం సాధిస్తాయని.. ఇందుకు కార్తికేయ చిత్రమే నిదర్శనమని అన్నారు. తన స్వస్థలం కొవ్వూరు తాలూకా వేములూరు అని చెన్నైలో ఇంజినీరింగ్ పూర్తి చేసి 2008లో చిత్రసీమలో ప్రవేశించానన్నారు. హీరో నిఖిల్, స్వామీరారా దర్శకుడు సుధీర్‌వర్మ తనకు మంచి స్నేహితులని చెప్పారు. సుధీర్ వర్మ, తాను యువత సినిమాకు అసిస్టెంట్ డెరైక్టర్సగా పనిచేశామన్నారు. నిఖిల్ ‘కలావర్ కింగ్’ సినిమాకు మాటలు రాశానన్నారు. వీటితో పాటు పలు యూడ్స్కు దర్శకత్వం వహించానని చందు చెప్పారు. తన దర్శకత్వంలో వచ్చిన తొలిసినిమా కార్తికేయ అని దీనిని చూసిన దర్శకుడు రాజమౌళి, వీవీ వినాయక్, సుకుమార్ అభినందించారన్నారు. నాగచైతన్య హీరోగా తెరకెక్కనున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ జూలైలో ప్రారంభవుతుందని చెప్పారు. సోషల్ మీడియా సినిమాల ప్రమోట్‌కు బాగా ఉపయోగపడుతుందని చెప్పారు. స్నేహితులు పాపారావు, ఆయన కుటుంబ సభ్యులు, విస్సాకోడేరు ఉప సర్పంచ్ బోల్ల శ్రీనును కలవడం ఆనందంగా ఉందన్నారు. బోల్ల శ్రీను, బొమ్మిడి ప్రసాద్, నాగరాజు, కుదుషా పాల్గొన్నారు.