
అక్కినేని యువ కథానాయకుడు నాగచైతన్య ఒకేసారి రెండు సినిమాలు చేసేస్తున్నాడు. ఇప్పటికే చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సవ్యసాచి షూటింగ్ దాదాపుగా పూర్తికాగా, మారుతి దర్శకత్వంలో శైలజా రెడ్డి అల్లుడు షూటింగ్ జరుగుతోంది. ముందుగా అనుకున్న ప్రకారం సవ్యసాచి ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. అయితే షూటింగ్ ఆలస్యం కావటంతో కాస్త వాయిదా పడింది. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను ఆగస్టు రెండో వారంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.
సినిమాకు గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉండటంతో ఆలస్యమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఓ సంస్థ గ్రాఫిక్స్ వర్క్ కొంత మేర పూర్తి చేసినా ఆ వర్క్ సంతృప్తికరంగా ఉండకపోవటంతో మరో సంస్థతో తిరిగి చేయిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాలపై చిత్రయూనిట్ అధికారికంగా స్పందించకపోయినా... విడుదల మాత్రం ఆలస్యమవుతుందన్న విషయం తెలుస్తోంది. నాగచైతన్య సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మాధవన్ నెగెటివ్ రోల్ లో కనిపించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment