సరికొత్త పాత్రలో ఓంపురి | Om Puri's next on Indian farmer suicides | Sakshi
Sakshi News home page

సరికొత్త పాత్రలో ఓంపురి

Published Thu, Jan 8 2015 1:55 PM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM

Om Puri's next on Indian farmer suicides

న్యూఢిల్లీ: దేశంలో రైతుల ఆత్మహత్యల నేపథ్యంగా తీయబోయే 'ప్రాజెక్ట్ మరఠ్వాడ'లో ప్రముఖ నటుడు ఓంపురి కీలకపాత్ర పోషించనున్నారు. ప్రభుత్వ సహాయాన్ని ఆశించి తన గ్రామం నుంచి ఎంతో ఆశగా ముంబై చేరిన రైతుకు... అక్కడి అవినీతి అధికారుల నుంచి ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటాడన్నది ఈ సినిమా కథాంశం. ఈ సరికొత్త పాత్ర 'ప్రాజెక్ట్ మరఠ్వాడ'పై ఓంపురి మాట్లాడుతూ... ఈ చిత్రం ప్రభుత్వాలు రైతులకు ఏ మాత్రం చేయూత అందించకున్నా... వారు మాత్రం మన కోసం ఎంతో శ్రమిస్తారు. 

 

మరఠ్వాడకి చెందిన రైతు తుకారాం(ఓంపురి) ఎదుర్కొన్న సమస్యల్ని తెరపై చూడవచ్చు.  "నిత్యం పెద్ద సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కీలకపాత్రలో ఓంపురి కనిపిస్తారు. నాపై నమ్మకం ఉంచిన నటీనటులు, నిర్మాత సత్యవ్రత్ త్రిపాఠికి కృతజ్క్షతలు" అని చిత్ర దర్శకుడు భావిన్ వాడియా తెలిపారు. ఈ నెల 20 తేదీ నుంచి ఈ చిత్ర షూటింగ్ ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement