Samayanike Video Song Out From Aadi Saikumar 'Tees Maar Khan Movie' - Sakshi
Sakshi News home page

Tees Maar Khan: బీచ్‌లో ఆది, పాయల్‌ రొమాన్స్‌.. ఆకట్టుకుంటున్న రొమాంటిక్‌ సాంగ్‌

Published Tue, Jul 26 2022 10:15 AM | Last Updated on Tue, Jul 26 2022 11:02 AM

Samayanike Video Song Out From Aadi SaikumarTees Maar Khan Movie - Sakshi

ఆది సాయికుమార్, పాయల్‌ రాజ్‌పుత్‌ జంటగా సునీల్, పూర్ణ కీలక పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘తీస్‌ మార్‌ ఖాన్‌’. కళ్యాణ్‌ జి. గోగణ దర్శకత్వంలో వ్యాపారవేత్త      డా. నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా  ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ సినిమా పోస్టర్స్, గ్లింప్స్, టీజర్‌లు, ఫస్ట్ సింగిల్‌కు మంచి స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం నుంచి రెండో పాటను విడుదల చేశారు. 

 ‘సమయానికే’ అంటూ సాగే ఈ మెలోడీ ట్యూన్‌కు రాకేందు మౌళి సాహిత్యం    అందించగా శ్రుతి ఆలపించారు. సాయి కార్తీక్‌ అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చారు.  ఈ వీడియో సాంగ్‌లో ఆది సాయి కుమార్‌, పాయల్ రాజ్‌పుత్‌లు యూత్ ఆడియెన్స్ కట్టిపడేశారు. ఆది సాయి కుమార్ పవర్ ఫుల్ పాత్రలో నటించిన ఈ సినిమాను హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.  స్టూడెంట్, రౌడీ, పోలీస్ గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఆది సాయికుమార్ నటించడం ఈ సినిమాకు మేజర్ అసెట్. ఆగస్ట్‌ 19న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement