ఏ అమ్మ కొడుకునైనా కొడతా.. ఆసక్తిగా ట్రైలర్‌ | Aadi Saikumar Tees Maar Khan Trailer Released | Sakshi
Sakshi News home page

Aadi Saikumar: ఆసక్తిగా ఆది సాయికుమార్‌ 'తీస్‌ మార్‌ ఖాన్‌' ట్రైలర్‌

Published Mon, Aug 8 2022 9:00 PM | Last Updated on Mon, Aug 8 2022 9:03 PM

Aadi Saikumar Tees Maar Khan Trailer Released - Sakshi

Aadi Saikumar Tees Maar Khan Trailer Released: ఆది సాయికుమార్, పాయల్‌ రాజ్‌పుత్‌ జంటగా కల్యాణ్‌ జి. గోగణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘తీస్‌ మార్‌ ఖాన్‌’. సునీల్, పూర్ణ, కబీర్‌ సింగ్, అనూప్‌ సింగ్‌ ఠాకూర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా  నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్స్‌, గ్లింప్స్‌, టీజర్‌, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్‌ లభించింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. 

'మా అమ్మని తప్పుగా చూశారు. మా అమ్మ జోలికి వస్తే ఏ అమ్మ కొడుకునైనా కొడతా' అంటూ ప్రారంభమైన ట్రైలర్‌ ఆకట్టుకునేలా ఉంది. ట్రైలర్‌లోని సన్నివేశాలు చూస్తుంటే పూర్తి స్థాయిలో మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఆది లుక్స్‌, డైలాగ్‌ డెలీవరీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ సినిమాలో ఆది.. స్టూడెంట్‌, రౌడీ, పోలీస్‌ వంటి మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్నట్లు తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement