బిగ్‌బాస్‌ బ్యూటీతో యంగ్‌ హీరో.. | Young Hero Aadi acts in kolly wood movie soon | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ బ్యూటీతో యంగ్‌ హీరో..

Published Wed, Sep 27 2017 6:19 PM | Last Updated on Thu, Jul 18 2019 1:41 PM

Young Hero Aadi acts in kolly wood movie  soon - Sakshi

సాక్షి, చెన్నై: తెలుగులో లవ్‌ల్లీ, ప్రేమకావాలి సినిమాలతో మంచి క్రేజ్‌ తెచ్చుకున్న యువ హీరో ఆది. త్వరలో హీరోయిన్‌ ఓవియాతో కలిసి కొలివుడ్‌కు  పరిచయం అవుతున్నారు. బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌ షో తర్వాత మంచి పాపులారిటీ పెంచుకున్న నటి ఓవియా. ఈ భామకు చిత్రాల అవకాశాలు వరుస కడుతున్నాయి. అందులో ఒకటి కాటేరి. యామిరుక్క భయమే వంటి హారర్‌ కామేడీ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు డీకే తాజాగా ఈ కాటేరికి దర్శకత్వం బాధ్యతలను చేపడుతున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్‌ పతాకంపై జ్ఞానవేల్‌ రాజా నిర్మించనున్నారు.

ఈ చిత్రం గురించి రాజా మాట్లాడుతూ.. కాటేరి ఎడ్వేంచర్‌ కామెడీ చిత్రంగా ఉంటుందన్నారు. ఇందులో హారర్‌ థ్రిల్లర్‌ సన్నివేశాలు చోటు చేసుకుంటాయని ఆయన అన్నారు. ఈ చిత్రం ద్వారా తెలుగు యువ నటుడు ఆదిని హీరోగా పరిచయం చేస్తున్నామని చెప్పారు. ఈ చిత్రంలో నలుగురు హీరోయిన్లు ఉంటారనీ, అందులో ఒకరిగా ఓవియాను ఎంపిక చేసినట్లు ఆయన తెలపారు. మరో ముగ్గురిని ఎరన్నది త్వరలో వెల్లడిస్తామన్నారు. అదే విధంగా త్వరలోనే చిత్ర షూటింగ్‌ ప్రారంభం అవుతుందని డీకే తెలపారు. కాగా, ఈయన ఇంతకు ముందు జీవా, కాజల్‌ అగర్వాల్‌ జంటగా నటించిన కవలైవేండామ్‌ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించక పోవడంతో తొలి చిత్రం యామిరుక్క భయమే చిత్ర నేపధ్యం​ అయినా హారర్‌నే తన తాజా చిత్రానికి నమ్ముకున్నారని చెప్పవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement