Is Jr NTR Aadi Movie To Be Re Release In November 3rd Week - Sakshi
Sakshi News home page

Jr NTR: జూ. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. ‘ఆది’ రీరిలీజ్‌! ఎప్పుడంటే..

Published Mon, Sep 26 2022 9:15 AM | Last Updated on Mon, Sep 26 2022 10:41 AM

Is Jr NTR Aadi Movie to Be Re Release In November 3rd Week - Sakshi

ప్రస్తుతం టాలీవుడ్‌లో రీరిలీజ్‌ ట్రెండ్‌ నడుస్తోంది. గతంలో బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌ అందుకున్న స్టార్‌ హీరోల చిత్రాలను ప్రస్తుతం థియేటర్లో ప్రదర్శిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఆయా హీరోల స్పెషల్‌ డేస్‌ను పురస్కరించుకున్న భారీ విజయం సొంతం చేసుకున్న ఆనాటి ఎవర్‌గ్రీన్‌ చిత్రాలను మళ్లీ రిలీజ్‌ చేసి ఫ్యాన్స్‌ చేత ఈళలు వేయిస్తున్నారు. ఇప్పటికే సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు పోకిరి, పవన్‌ కల్యాణ్‌ జాల్సా, రీసెంట్‌గా బాలకృష్ణ చెన్నకేశవరెడ్డి చిత్రాలను రీరిలీజ్‌ చేయగా వాటికి ఊహించని స్థాయిలో రెస్పాన్స్‌ వచ్చాయి.

చదవండి: క్రేజీ అప్‌డేట్‌.. ఆ రోజు నుంచే ‘పుష్ప-2’ రెగ్యులర్‌ షూటింగ్‌!

కలెక్షన్స్‌ పరంగా పోకిరి, జాల్సా చిత్రాలు అదుర్స్‌ అనిపించాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి జూనియర్‌ ఎన్టీఆర్‌ బ్లాక్‌బస్టర్‌ చిత్రం కూడా రాబోతోంది. తారక్‌ కెరీర్‌ల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం, ఆయనకు స్టార్‌డమ్‌ తెచ్చిపెట్టిన ఫ్యాక్షన్‌ డ్రామా మూవీ ‘ఆది’. వివి వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎంతటి భారీ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాయలసీమ ఫ్యాక్షన్‌ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం రీరిలీజ్‌కు నవంబర్‌లో భారీ ఎత్తున సన్నాహాలు జరుగుతున్నట్లు ఫిలిం దూనియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

చదవండి: అలనాటి హీరోయిన్‌ గౌతమి కూతురిని చూశారా? త్వరలో హీరోయిన్‌గా ఎంట్రీ!

జూనియర్‌ ఎన్టీఆర్‌ ఇండస్ట్రీకి వచ్చి 22న ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో నవంబర్‌లో  ఈ సినిమాను మళ్లీ థియేటర్లో ప్రదర్శించాలని అనుకుంటున్నట్లు ‘ఆది’ చిత్ర బృందం పేర్కొన్నట్లు సమాచారం. కాగా బాలకృష్ణ చెన్నకేశవరెడ్డి రీరిలీజ్‌ సందర్భంగా నిర్మాత బెల్లంకొండ సురేశ్‌ నవంబర్‌ 3వ వారంలో ఆది రీరిలీజ్‌ ఉండోచ్చని చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలిసి నందమూరి ఫ్యాన్స్‌ సంబరాలు చేసుకుంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే నవంబర్‌ వరకు వేచి చూడాల్సిందే. కాగా ఈ సినిమాలో తారక్‌ జోడిగా కీర్తి చావ్లా నటించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement