Is Rashmika Mandanna Female Lead In Jr NTR and Koratala Siva NTR 30? - Sakshi
Sakshi News home page

Rashmika Mandanna in NTR30: జూనియర్‌ ఎన్టీఆర్‌-కొరటాల చిత్రంలో రష్మిక?

Published Thu, Sep 15 2022 6:16 PM | Last Updated on Thu, Sep 15 2022 7:37 PM

Is Rashmika Mandanna Female Lead In Jr NTR and Koratala Siva NTR 30 - Sakshi

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌-కొరటాల శివ కాంబినేషన్లో ఎన్టీఆర్‌30(NTR30) మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సొంతం చేసుకుంది. దీంతో ఈ హిట్‌ కాంబినేషన్‌ మరోసారి రిపీట్‌ కానుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించినప్పుటి నుంచి ఎన్టీఆర్‌ 30కి సంబంధించి రోజుకో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌, స్క్రిప్ట్‌ వర్క్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యూలర్‌ షూటింగ్‌ను జరపుకోనుంది.  

చదవండి: అషురెడ్డి బర్త్‌డే.. కాస్ట్లీ కారు బహుమతిగా ఇచ్చిన ఆమె తండ్రి

ఈ క్రమంలో ఇందులో హీరోయిన్‌ ఎవరనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పలువురు స్టార్‌ హీరోయిన్ల పేరు తెరపైకి వస్తున్నాయి. మొదట బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ పేరు వినిపించగా.. ఆ తర్వాత సమంత ఫైనల్‌ అయ్యిందన్నారు. రెమ్యునరేషన్‌ విషయంలో సమంత ఈ ప్రాజెక్ట్‌కు నో చెప్పగా.. అసలు ఈ ఈ ప్రాజెక్ట్‌ ప్రస్తావనే తన దగ్గరికి రాలేదని జాన్వీ స్పష్టం చేసింది. దీంతో ఈ సినిమాలో హీరోయిన్‌ ఎవరనేది ప్రస్తుతం ఆసక్తిని సంతరించుకున్న అంశం. ఈ క్రమంలో తాజాగా మరో హీరోయిన్‌ పేరు తెరపైకి వచ్చింది. డైరెక్టర్‌ కొరటాల నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నాను ఈ సినిమాలో హీరోయిన్‌గా పరిశీస్తున్నట్లు తెలుస్తోంది.

చదవండి: వందల ఎకరాలు, రాజభవనం.. కృష్ణంరాజు ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా!

‘పుష్ప’ మూవీతో ఒక్కసారిగా పాన్‌ ఇండియా క్రేజ్‌ను సొంతం చేసుకుంది రష్మిక. దీంతో భాషతో సంబంధం లేకుండ సౌత్‌, నార్త్‌లో వరసు పెట్టి సినిమాలు చేస్తోంది. ఆమె క్రేజ్‌దృష్ట్యా రష్మికను ఈ సినిమాలో హీరోయిన్‌గా తీసుకోవాలని చిత్రం బృందం భావిస్తోందట. ఇప్పటికే ఆమెను కలిసి కొరటాల కథ చెప్పాడని, దీనికి ఆమె ఒకే కూడా చెప్పిందంటున్నాయి సినీవర్గాలు. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగక తప్పదు. కాగా నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి రానుందని సమాచారం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement