
నేషనల్ క్రష్ రష్మిక రాకెట్ లా దూసుకుపోతోంది.వన్ బై వన్ క్రేజీ ప్రాజెక్ట్స్ లో భాగం అవుతోంది.మొన్నటికి మొన్న రణభీర్ చిత్రంలో ఆఫర్ అందుకుంది.సందీప్ వంగా హిందీ చిత్రంలో యానిమల్ లో ముందుగా పరిణీతి చోప్రాను అనుకున్నారు.మళ్లీ ఏమైందో ఏమో అ అవకాశాన్ని రష్మిక అందుకుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హిమాలయాల్లో జరుగుతోంది.
కోలివుడ్‌లో ఇప్పటికే ఒక సినిమా చేసిన రష్మిక.. ఈ సారి ఏకంగా దళపతి విజయ్ సరసన నటించే అవకాశం దక్కించుకుంది. ద్విభాషా చిత్రంగా రూపొందే ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో దిల్ రాజు నిర్మిస్తున్నాడు.
(చదవండి: హీరో కంట్లో పడ్డాను, నో చెప్పినందుకు అంత పని చేశారు, హృదయం ముక్కలైంది)
బాలీవుడ్, కోలివుడ్ మాత్రమే కాదు.. టాలీవుడ్ లో తెరకెక్కబోయే మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ లోనూ రష్మిక పేరు వినిపిస్తోంది. ఈసారి కొరటాల నేషన్ క్రష్ రష్మిక డేట్స్ డుగుతున్నాడట.ముందుగా ఆలియాను హీరోయిన్ గా అనుకున్నారు.కాని రణభీర్ తో మ్యారేజ్ తర్వాత ఆలియా తన డేట్స్ అడ్జెస్ట్ చేయడం కష్టం అని చెప్పడంతో లాస్ట్ మినుట్ లో ఆ ఆఫర్ రష్మికకు వెళ్లిందని టాలీవుడ్ లో జోరుగా ప్రచారం సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment