‘రఫ్’ కుర్రాడి రొమాన్స్ | Aadi and Rakul Preet Singh movie Title Rough | Sakshi
Sakshi News home page

‘రఫ్’ కుర్రాడి రొమాన్స్

Published Sat, Jun 7 2014 11:05 PM | Last Updated on Sat, Sep 2 2017 8:27 AM

‘రఫ్’ కుర్రాడి రొమాన్స్

‘రఫ్’ కుర్రాడి రొమాన్స్

ఇప్పటివరకు చేసిన చిత్రాల ద్వారా లవర్‌బోయ్‌లా కనిపించిన ఆది, ఈసారి రఫ్‌గా కనిపించనున్నారు. ఆది, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా ‘రఫ్’ పేరుతో రూపొందుతోన్న ఈ చిత్రంలో శ్రీహరి ప్రత్యేక పాత్ర పోషించారు. ఎమ్. సుదర్శనరావు సమర్పణలో శ్రీదేవి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సీహెచ్. సుబ్బారెడ్డి దర్శకత్వంలో అభిలాష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ - ‘‘ఓ కొత్త కోణంలో ఆది కనిపించబోతున్న సినిమా ఇది. ఇటీవల స్విట్జర్లాండ్‌లో రెండు పాటలు చిత్రీకరించాం’’ అని చెప్పారు. ‘‘బుల్లెట్‌లాంటి కుర్రాడి కథ ఇది. టైటిల్ ‘రఫ్’ అయినప్పటికీ కుటుంబ సమేతంగా చూసే విధంగా ఉంటుంది. ఒక పాట మినహా ఈ సినిమా పూర్తయ్యింది. ఈ నెలలోనే పాటలను, వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: మరుధూరి రాజా, సంగీతం: మణిశర్మ, కెమెరా: సెంథిల్‌కుమార్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement