టీఆర్ఎస్లో రచ్చకెక్కిన విభేదాలు
ఆదిలాబాద్ : తెలంగాణ అటవీశాఖ మంత్రి జోగురామన్నకు ఆదిలాబాద్ మున్సిపల్ ఛైర్మన్ వర్గీయుల మధ్య నెలకొన్న విభేదాలు గురువారం తారస్థాయికి చేరాయి. పట్టణంలో జరిగే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఎవరికి వారే పోటాపోటీగా చేసుకుంటున్నారు. ఛైర్మన్ మనీషాకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా మంత్రి జోగు రామన్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నారు. మంత్రి వ్యవహార శైలిపై మున్సిపల్ ఛైర్మన్ మనీషా వర్గీయులు కారాలు మెరియాలు నూరతున్నారు. దీంతో టీఆర్ఎస్ నాయకత్వం వద్ద పంచాయితీ తేల్చుకోవాలని ఇరు వర్గాలు వ్యూహారచన చేస్తున్నట్లు సమాచారం.