బస్సు వెనుక చక్రాలు ఒక్కసారిగా ఊడిపోవ‌డంతో.. | - | Sakshi
Sakshi News home page

బస్సు వెనుక చక్రాలు ఒక్కసారిగా ఊడిపోవ‌డంతో..

Published Mon, Dec 25 2023 1:34 AM | Last Updated on Mon, Dec 25 2023 10:36 AM

- - Sakshi

మహబూబాబాద్‌: హుజూరాబాద్‌ నుంచి హనుమకొండ వైపునకు వెళ్తున్న హుజూరాబాద్‌ డిపోనకు చెందిన ఓ ఆర్టీసీ బస్సు వెనుక చక్రాలు ఒక్కసారిగా ఊడిపోయాయి. ఓవర్‌ లోడ్‌తో వెళ్తుండగా ఎల్కతుర్తి సమీపంలో జరిగిన ఈ ఘటనలో డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించి బస్సును నిలిపివేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. కాగా, బస్సులో సుమారు 80 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలైనట్లు తెలిసింది. కాగా, ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ స్పందించారు. ఓవర్‌ లోడ్‌ కారణంగా ఘటన జరగలేదని, దీనిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇవి కూడా చ‌ద‌వండి: అందమైన విద్యార్థినులు క‌నిపించారంటే.. అతడు కీచకుడే! అర్ధరాత్రి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement