Bus Falls
-
బస్సు వెనుక చక్రాలు ఒక్కసారిగా ఊడిపోవడంతో..
మహబూబాబాద్: హుజూరాబాద్ నుంచి హనుమకొండ వైపునకు వెళ్తున్న హుజూరాబాద్ డిపోనకు చెందిన ఓ ఆర్టీసీ బస్సు వెనుక చక్రాలు ఒక్కసారిగా ఊడిపోయాయి. ఓవర్ లోడ్‌తో వెళ్తుండగా ఎల్కతుర్తి సమీపంలో జరిగిన ఈ ఘటనలో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును నిలిపివేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. కాగా, బస్సులో సుమారు 80 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలైనట్లు తెలిసింది. కాగా, ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. ఓవర్ లోడ్ కారణంగా ఘటన జరగలేదని, దీనిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇవి కూడా చదవండి: అందమైన విద్యార్థినులు కనిపించారంటే.. అతడు కీచకుడే! అర్ధరాత్రి.. -
ఘోర బస్సు ప్రమాదం.. ఇద్దరు మృతి.. 20 మందికి గాయాలు
డెహ్రడూన్: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఇద్దరు మరణించారు.. వివరాలు.. ఉత్తరాఖండ్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌కు చెందిన బస్సు ముస్సోరీ నుంచి డెహ్రాడూన్‌కు ప్రయాణిస్తుంది. దాదాపు 22 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు షేర్ ఘడి సమీపంలో అదుపుతప్పి లోయలో పడిపోయింది. సుమారు 100 అడుగుల లోతులో పడిపోయినట్లు సమాచారం. ఈ ఘటనలో బస్ డ్రైవర్‌తో సహా 22 మంది గాయపడ్డారు. గాయాలయ్యాయి. సమాచారం వెంటనే సహాయక బృందాలు ఘటన స్థలానికి చేరుకొన్నాయి. ఇండో టిబెటన్ బార్డర్ పోలీసుల (ITBP) సహాయంతో గాయపడిన వారిని రెస్క్యూ చేసి ఆస్పత్రికి తరలించామని ముస్సోరీ పోలీసులు వెల్లడించారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ ఇద్దరు అమ్మాయిలు మరణించారు. మరొకొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. Uttarakhand | Many feared injured after a roadways bus lost control and fell off the gorge on Mussoorie-Dehradun route. Rescue operation underway. Police, fire service team & ambulance on the spot. More Details awaited. pic.twitter.com/LZWvg3riML — ANI UP/Uttarakhand (@ANINewsUP) April 2, 2023 -
పాకిస్తాన్లో ఘోరం.. లోయలో పడిన బస్సు..19 మంది మృతి
కరాచీ: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో ఆదివారం సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది చనిపోగా మరో 11 మంది గాయాలపాలయ్యారు. క్వెట్టా నుంచి ఇస్లామాబాద్‌కు 30 మంది ప్రయాణికులతో బయలుదేరిన బస్సు..జోబ్‌లోని లోయలో పడిపోయింది. భారీ వర్షం కురుస్తుండటంతో మలుపు వద్ద బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ఘోరం సంభవించిందని అధికారులు తెలిపారు. కాగా, రోడ్ల నిర్వహణ సరిగా లేకపోవడం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ మూలంగా పాకిస్తాన్లో ప్రమాదాలు సాధారణమయ్యాయి. గత నెలలో కూడా ఓ బస్సు ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. బలూచిస్తాన్‌లో బస్సు లోయలో పడిన దుర్ఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. చదవండి👇 జీవ గడియారం... ఆరోగ్యానికీ సూచికే ఇదెక్కడి గోసరా నాయనా! దోమల ఆకర్ష ఆకర్ష.. వైరస్లు ఒంటి వాసననూ మార్చేస్తాయా? -
ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి
హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చంబా జిల్లాలోని తీసా సబ్ డివిజన్ వద్ద బుధవారం ప్రైవేటు బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. చంబా నుంచి తీసాకు వెళ్తున్న బస్సు చంబా-ఖజ్జియార్ రహదారిపై ప్రమాదానికి గురైంది. మూల మలుపు వద్ద బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో అదుపు తప్పిందని తెలుస్తోంది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మరో ఇద్దరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా చనిపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 16 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బస్సు లోయలో పడిందన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చంబాలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ ప్రమాదంపై హిమాచల్ ముఖ్యమంత్రి జయరాం ఠాగూర్ స్పందించారు. ఈ దుర్ఘటనకు గల కారణాలపై పూర్తి దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా చాంబా జిల్లాలో తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. గత ఏడాది మార్చి నెలలోనూ హిమాచల్ ప్రదేశ్ రోడ్డు రవాణ సంస్థకు చెందిన బస్సు లోయలో పడి ఐదుగురు ప్రయాణికులు మరణించారు. -
ఒడిశాలో ఘోర బస్సు ప్రమాదం
ఒడిశా: ఒడిశాలో శుక్రవారం ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని కలహండి జిల్లా భవానీపట్నం వద్ద నది వంతెన పైనుంచి బస్సు అదుపు తప్పి కిందపడింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో 34 మందికి గాయాలయ్యాయి. బస్సు దాదాపు 55 మంది ప్రయాణికులతో భువనేశ్వర్ నుంచి భవానీపట్నం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అధికారులు, పోలీసులు, స్థానికులు ప్రమాద స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. -
ఉత్తర్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం
సితాపుర్(యూపీ): ఉత్తర్ ప్రదేశ్‌లోని సితాపుర్లో శుక్రవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు అదుపు తప్పి శారదా కెనాల్లోకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో 9 మంది మృతిచెందగా, 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. -
లోయలోకి దూసుకెళ్లిన బస్సు: 17 మంది మృతి
-
లోయలో పడిన బస్సు: 10 మంది మృతి
జబువా: మధ్యప్రదేశ్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. 40 మందిపైగా గాయపడ్డారు. ధార్ జిల్లాలోని మచలియా ఘాట్ రోడ్డులో ఓ ప్రైవేటు బస్సు లోయలో పడిపోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఇండోర్ నుంచి రాజస్థాన్ లోని గాలియకోట్ కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.