
కరాచీ: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో ఆదివారం సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది చనిపోగా మరో 11 మంది గాయాలపాలయ్యారు. క్వెట్టా నుంచి ఇస్లామాబాద్‌కు 30 మంది ప్రయాణికులతో బయలుదేరిన బస్సు..జోబ్‌లోని లోయలో పడిపోయింది. భారీ వర్షం కురుస్తుండటంతో మలుపు వద్ద బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ఘోరం సంభవించిందని అధికారులు తెలిపారు.
కాగా, రోడ్ల నిర్వహణ సరిగా లేకపోవడం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ మూలంగా పాకిస్తాన్‌లో ప్రమాదాలు సాధారణమయ్యాయి. గత నెలలో కూడా ఓ బస్సు ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. బలూచిస్తాన్‌లో బస్సు లోయలో పడిన దుర్ఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు.
చదవండి👇
జీవ గడియారం... ఆరోగ్యానికీ సూచికే
ఇదెక్కడి గోసరా నాయనా! దోమల ఆకర్ష ఆకర్ష.. వైరస్‌లు ఒంటి వాసననూ మార్చేస్తాయా?
Comments
Please login to add a commentAdd a comment