
ఒడిశా: ఒడిశాలో శుక్రవారం ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని కలహండి జిల్లా భవానీపట్నం వద్ద నది వంతెన పైనుంచి బస్సు అదుపు తప్పి కిందపడింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో 34 మందికి గాయాలయ్యాయి. బస్సు దాదాపు 55 మంది ప్రయాణికులతో భువనేశ్వర్ నుంచి భవానీపట్నం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అధికారులు, పోలీసులు, స్థానికులు ప్రమాద స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment