జబువా: మధ్యప్రదేశ్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. 40 మందిపైగా గాయపడ్డారు. ధార్ జిల్లాలోని మచలియా ఘాట్ రోడ్డులో ఓ ప్రైవేటు బస్సు లోయలో పడిపోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఇండోర్ నుంచి రాజస్థాన్ లోని గాలియకోట్ కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
లోయలో పడిన బస్సు: 10 మంది మృతి
Published Tue, Feb 17 2015 7:21 AM | Last Updated on Mon, Oct 8 2018 3:17 PM
Advertisement
Advertisement