Dhar
-
గృహిణి అదృశ్యం.. అనుమానంతో చెట్టుకు కట్టేసి..
-
గృహిణి అదృశ్యం.. చెట్టుకు కట్టేసి
భోపాల్ : ఓ గృహిణి అదృశ్యమవ్వడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఇందుకు కారకులన్న అనుమానంతో ముగ్గురిని చెట్టుకు కట్టేసి చితక్కొట్టారు గ్రామస్తులు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. ధార్ ప్రాంతానికి చెందిన ఓ గృహిణి కొన్ని రోజుల నుంచి కనిపించకుండా పోయింది. ఓ యువకుడే ఇందుకు కారణం అని భావించిన గ్రామస్తులు అతనితో పాటు మరో ఇద్దరు కుటుంబ సభ్యులను కూడా చెట్టుకు కట్టేసి కొట్టారు. ఈ ఇద్దరు కుటుంబ సభ్యుల్లో ఒకరు మైనర్ కావడం గమనార్హం. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఏఎన్ఐ ప్రచురించడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఏఎన్ఐ పోస్ట్ చేసిన ఫోటోలో ఒక వ్యక్తిని, మహిళను చెట్టుకు కట్టేసి ఉండగా.. వారి చుట్టూ జనం గుమిగూడి ఉన్నారు. ఈ సంఘటన ధార్ అర్జున్ కాలనీలో సంభవించినట్లు ఏఎన్ఐ వెల్లడించింది. ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే ఓ ఐదుగురు అనుమానితులను అరెస్ట్ చేశామని.. తర్వలోనే మిగతావారిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : గృహిణి అదృశ్యం.. అనుమానంతో చెట్టుకు కట్టేసి.. -
బీజేపీ నాయకుడి చెంప చెల్లుమనిపించిన...
-
బీజేపీ నాయకుడి చెంప చెళ్లు..
భోపాల్ : చెక్కు అందజేసే విషయంలో గొడవపడిన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమాంగ్ సింగర్ అదే రాష్ట్ర బీజేపీ నాయకుడు ప్రదీప్ గడియా చెంప చెల్లుమనిపించారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. వివరాలు.. ధార్ జిల్లాలోని టాండా గ్రామానికి చెందిన 8 ఏళ్ల అమ్మాయి కరెంట్ షాక్‌కు గురై గత శుక్రవారం మృతి చెందింది. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమాంగ్ సింగర్ ఆ గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపి ఐదు వేల రూపాయల ఆర్థికసాయం అందజేశారు. అలాగే ఈ సమాచారాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం వరకూ తీసుకెళ్లారు. అనంతరం విద్యుత్ అధికారులు ఎంక్వేరీ చేసి బాలిక కుటుంబానికి లక్ష రూపాయల నష్టపరిహారం ప్రకటించారు. కాగా విషయం తెలుసుకున్న బీజేపీ నాయకుడు ప్రదీప్ గడియా ఎంపీ సావిత్రి ఠాకూర్ కలిసి టాండా గ్రామానికి వచ్చారు. తమ ప్రభుత్వం వల్లే బాధిత కుటుంబానికి తక్షణం లక్ష రూపాయాల ఆర్థిక సాయం అందిందని, ఆ చెక్కును తనే అందజేస్తానన్నారు. కాగా తన కృషి వల్లే ఈ నష్ట పరిహారం అందిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే పేర్కొన్నారు. దీంతో ఇరువురి మధ్య మాటా మాట పెరిగి గొడవకు దారి తీసింది. సహనం కోల్పోయిన ఎమ్మెల్యే ఉమాంగ్ సింగర్, ప్రదీప్ గడియా చెంప చెళ్లుమనిపించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షనలు జరిగాయి. పోలీసుల అప్రమత్తం కావడంతో గొడవ సద్దుమనిగింది. ఇప్పుడా వీడియో వైరల్ అయింది. కాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే తనపై దాడికి పాల్పడ్డారని, అతని అనుచరురు చంపేస్తామని బెదిరిస్తున్నారని ప్రదీప్ ఘడియా స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
మధ్య ప్రదేశ్ లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్
మధ్యప్రదేశ్ః నిర్భయ చట్టం అమల్లోకి వచ్చినా కామాంధుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. తాజాగా మధ్యప్రదేశ్ లో మరో దారుణం వెలుగు చూసింది. పదమూడేళ్ళ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. రెండు రోజుల్లో రెండు గ్రూపులు బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు. తోడుకోసం రమ్మని ఒకరు, లిఫ్ట్ ఇస్తామని మరొకరు నమ్మించి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. మధ్యప్రదేశ్ ధార్ కోట్ వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన కేసు వివరాలను పరిశీలిస్తే... నిందితులు బాధితురాలికి తెలిసున్నవారుగా తెలుస్తోందని, ఇప్పటికే ఒకరిని అదుపులోకి తీసుకున్నామని... అతడి ఆధారంగా మిగిలినవారి ఆచూకీ తెలిసే అవకాశం ఉన్నట్లు ధార్ కోట్ పోలీసులు చెప్తున్నారు. మార్చి 7వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా దేవాలయానికి వెళ్ళిన బాలికను తమకు తోడుగా రమ్మంటూ నమ్మించి, ఒప్పించి ఇద్దరు యువకులు పారిశ్రామిక ప్రాంతంలోకి తీసుకెళ్ళారని, అనంతరం తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించినట్లు పోలీసులు చెప్తున్నారు. ఆకాష్ అలియాస్ గోలు, అతిని స్నేహితుడితో సహా ఆమెను మానభంగం చేయడంతోపాటు ఆరోజు అక్కడే బలవంతంగా ఉంచేసినట్లు కూడ బాధితురాలు తెలిపింది. అయితే మర్నాడు మార్చి 8వ తేదీన వారినుంచి తప్పించుకొని నగరంలోనే ఉన్న తన తాతగారింటికి వెళ్ళానని, అయితే వారికి జరిగిన విషయం చెప్పలేదని ఆమె తెలిపింది. అక్కడినుంచీ తిరిగి ఇంటికి బయల్దేరిన తనను తనకు తెలిసిన మరో ఇద్దరు యువకులు లిఫ్ట్ ఇస్తామని నమ్మించి సంజయ్ కాలనీకి తీసుకువెళ్ళారని, అక్కడ ఆరుగురు యువకులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు చెప్పిన వివరాలను బట్టి తెలుస్తోంది. అయితే బాధితురాలి తల్లిదండ్రులు ఆమె మార్చి 7న ఇంటినుంచి వెళ్ళి తిరిగి రాలేదంటూ ధార్ కోట్ వాలి పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. రెండురోజుల అనంతరం తనంతట తానుగా పోలీస్ స్టేషన్ కు వచ్చిన బాలిక... తనపై జరిగిన ఆఘాయిత్యాలను పోలీసులకు వివరించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆమెను వైద్య పరీక్షలకు పంపించామని, నిందితులు సంతోష్ (24), సుభాష్ సింగ్ (20) ఆకాష్ అలియాస్ గోలు (19), భరత్ (18) తోపాటు మరో ముగ్గురిపై వివిధ సెక్షల్లలో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ధార్ కోట్ వాలి పోలీస్ స్టేషన్ ఎస్ ఐ అంజనా ధుర్వే తెలిపారు. -
ఆరెస్సెస్ కార్యాలయంపై హిందూ శ్రేణుల దాడి!
ధార్: మధ్యప్రదేశ్ ధార్‌లోని త్రిమూర్తినగర్‌లో ఉన్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) కార్యాలయంపై హిందూ కార్యకర్తలు శుక్రవారం దాడి చేశారు. కార్యాలయంపై రాళ్లు రువ్వి.. కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. బసంత పంచమీ సందర్భంగా ఇక్కడి భోజ్‌శాల కమల్ మౌలా మసీదు విషయమై వివాదం తలెత్తింది. ఈ ప్రాంగణంలో ఏకకాలంలో పూజలు చేసేందుకు హిందువులు, ప్రార్థనలు చేసేందుకు ముస్లింలు రావడంతో శుక్రవారం ఇక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో భోజ్‌శాలలోకి ప్రవేశించవద్దని ఆరెస్సెస్ నాయకత్వంతోపాటు, ధర్మ జాగరణ్ మంచ్, భోజ్ ఉత్సవ సమితి హిందువులకు పిలుపునిచ్చింది. దీనిపై హిందూ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఆరెస్సెస్ నాయకులు భోజ్‌శాలను అమ్మేశారంటూ మండిపడ్డారు. స్థానిక ఆరెస్సెస్ నాయకుడు విజయ్‌సింగ్ రాథోడ్ ఇంటి వద్ద భారీగా మూగి ఆందోళన చేసేందుకు వారు ప్రయత్నించారు. తన రాజకీయ భవిష్యత్తు కోసం విజయ్‌సింగ్ రాథోడ్ బీజేపీ ప్రభుత్వంతో కుమ్మక్కయి.. ఈ వ్యవహారంలో ఉద్యమాన్ని నీరుగార్చారని ఆరోపిస్తూ వారు నిరసన తెలియజేశారు. దీంతో పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో భోజ్‌శాలలోకి ప్రవేశించేందుకు హిందువులకు అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో స్థానిక ఆరెస్సెస్ నాయకత్వం తీరుపై మండిపడుతూ హిందూ కార్యకర్తలు ఆ సంస్థ కార్యాలయంపై దాడి దిగారు. -
జిహాదీ జాన్ ఎప్పటికైనా తిరిగొస్తాడు..!
భారతీయ మూలాలు కలిగిన బ్రిటిష్ పౌరుడు.. కొత్త 'జిహాదీ జాన్' గా పిలుస్తున్న సిద్ధార్థ ధర్ చనిపోయినట్లు తాను నమ్మడం లేదని తాజాగా అతడి సోదరి కోనికా ధర్ తాజాగా బ్రిటిష్ పార్లమెంట్ లో ప్రకటించింది. ఎప్పటికైనా అతడు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడన్న నమ్మకం తమకు ఉందంటోంది. ఐసిస్ ఉగ్రవాదుల్లో జిహాదీ జాన్ గా అవతరించిన సిద్ధార్థ్ అలియాస్ అబు రుమేసహ్ వైమానిక దాడుల్లో చనిపోయినట్లు ఇటీవల ఐఎస్ అధికారిక మేగజైన్ దబిక్ నిర్థారించినప్పటికీ ఆ విషయాన్నిఆమె అంగీకరించడం లేదు. తన సోదరుడు అంత దయలేని వ్యక్తి కాదని, హత్యకు గురై ఉండడంటూ ఆమె భావోద్వేగ ప్రకటన చేసింది. సిద్ధార్థ అలియాస్ అబు రుమేసహ... భార్య, నలుగురు పిల్లలతో సహా 2014లో బ్రిటన్ నుంచి పారిపోయి సిరియాకు వెళ్ళి ఐసిస్ లో చేరాడు. పుట్టుకతో హిందువు అయిన అబు.. వ్యాపారం నిమిత్తం బ్రిటన్ వచ్చి, ఇస్లాం మతాన్ని స్వీకరించాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ లో అల్ ముహజిరౌన్ అనే రాడికల్ గ్రూప్ లో చేరాడు. అక్కడినుంచి సిరియా వెళ్ళి ఐసిసితో చేతులు కలిపిన అతడు అనేక దారుణాలకు పాల్పడ్డట్లుగా విడుదలైన వీడియోను అప్పట్లో అతడి సోదరి కోనికా, తల్లి శోభితా ప్రత్యక్షంగా చూశారు. అయితే అతడి గొంతు మాత్రం గుర్తుపట్టేలా లేదని, తమను షాక్ కు గురి చేస్తోందని చెప్పారు. అయితే తాజాగా ఇప్పుడు కోనికా మరోసారి ఆ వీడియోలో వ్యక్తి తన సోదరుడు కాదని, అతడు ఎప్పటికైనా తిరిగి ఇంటి వస్తాడని ఆశాభావం వ్యక్తం చేసింది. సిద్ధార్థ ఓ ఉదారవాద హిందూ కుటుంబంలో పెరిగాడని.. అతడిది అటువంటి తీవ్రవాద చర్యలకు పాల్పడే మనస్తత్వం కాదని కోనికా చెప్తోంది. అతడు ఎక్కడున్నాడో ఎలాగైనా తెలుసుకునే ప్రయత్నం చేస్తానని, తన సోదరుడు ఉగ్రవాది కాదని నిరూపిస్తానని అంటోంది. కాగా అతడు హత్యకు గురి కాలేదని ఎలా నిరూపించగలవంటూ ఆమెను కామన్స్ హోం ఎఫైర్స్ కమిటీ ప్రశ్నించగా... తన అన్నను గత సెప్టెంబర్ లో చూశానని, ఆ తర్వాత కొన్నాళ్ళకు అతడు సిరియా వెళ్ళిపోయాడని, అప్పట్నుంచీ అతడితో మాట్లాడేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించామని, కానీ రెండుసార్లు మాత్రం అతడు సమాధానం ఇచ్చాడని చెప్తోంది. అయితే మొదటిసారి అతన్ని టీవీలో చూసినప్పుడు మాత్రం అబూ ఎవరు? అని గుర్తించలేకపోయానంది. అతడిని ఐసిస్ కు సంబంధించిన వ్యక్తులు ప్రేరేపించి ఉండొచ్చని, తన మాటలు సాధారణ ప్రజలు నమ్మకపోయినా.. అతడు తన సోదరుడని వక్కాణిస్తోంది. సిరియాలో వారు నివసించే అవకాశం లేదు కనుక తన సోదరుడి కుటుంబం బంధించబడి ఉంటుందని.... అతడి ఇంగ్లీషు భాషను బట్టి బ్రిటిష్ ప్రధాని అతడే తన సోదరుడనడం సరికాదని ఆమె ఆందోళన వ్యక్తం చేస్తోంది. -
లోయలో పడిన బస్సు: 10 మంది మృతి
జబువా: మధ్యప్రదేశ్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. 40 మందిపైగా గాయపడ్డారు. ధార్ జిల్లాలోని మచలియా ఘాట్ రోడ్డులో ఓ ప్రైవేటు బస్సు లోయలో పడిపోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఇండోర్ నుంచి రాజస్థాన్ లోని గాలియకోట్ కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.