భోపాల్ : చెక్కు అందజేసే విషయంలో గొడవపడిన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమాంగ్ సింగర్ అదే రాష్ట్ర బీజేపీ నాయకుడు ప్రదీప్ గడియా చెంప చెల్లుమనిపించారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. వివరాలు.. ధార్ జిల్లాలోని టాండా గ్రామానికి చెందిన 8 ఏళ్ల అమ్మాయి కరెంట్ షాక్‌కు గురై గత శుక్రవారం మృతి చెందింది.
విషయం తెలుసుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమాంగ్ సింగర్ ఆ గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపి ఐదు వేల రూపాయల ఆర్థికసాయం అందజేశారు. అలాగే ఈ సమాచారాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం వరకూ తీసుకెళ్లారు.
అనంతరం విద్యుత్ అధికారులు ఎంక్వేరీ చేసి బాలిక కుటుంబానికి లక్ష రూపాయల నష్టపరిహారం ప్రకటించారు. కాగా విషయం తెలుసుకున్న బీజేపీ నాయకుడు ప్రదీప్ గడియా ఎంపీ సావిత్రి ఠాకూర్ కలిసి టాండా గ్రామానికి వచ్చారు. తమ ప్రభుత్వం వల్లే బాధిత కుటుంబానికి తక్షణం లక్ష రూపాయాల ఆర్థిక సాయం అందిందని, ఆ చెక్కును తనే అందజేస్తానన్నారు.
కాగా తన కృషి వల్లే ఈ నష్ట పరిహారం అందిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే పేర్కొన్నారు. దీంతో ఇరువురి మధ్య మాటా మాట పెరిగి గొడవకు దారి తీసింది. సహనం కోల్పోయిన ఎమ్మెల్యే ఉమాంగ్ సింగర్, ప్రదీప్ గడియా చెంప చెళ్లుమనిపించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షనలు జరిగాయి. పోలీసుల అప్రమత్తం కావడంతో గొడవ సద్దుమనిగింది. ఇప్పుడా వీడియో వైరల్ అయింది. కాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే తనపై దాడికి పాల్పడ్డారని, అతని అనుచరురు చంపేస్తామని బెదిరిస్తున్నారని ప్రదీప్ ఘడియా స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment