సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ టైర్ల తయారీ కంపెనీ అపోలోటైర్స్ ఈ-కామర్స్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. భారత మార్కెట్లో ఆన్‌లైన్ టైర్ల అమ్మకాల కోసం ఇ-కామర్స్ పోర్టల్‌ను ప్రారంభించింది. దీంతో దేశీయ కస్టమర్లు ఇక నుంచి కార్లు, ద్విచక్ర వాహన టైర్లను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. ‘బై ఆన్‌లైన్.. ఫిట్ ఆఫ్‌లైన్’ మోడల్‌లో ఈ విధానం పనిచేస్తుంది. అంటే ఆన్‌లైన్‌లో టైర్లు కొనుగోలు చేసి వాటిని బిగించేందుకు అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలి. దగ్గర్లోని అపోలో టైర్స్ డీలర్ లొకేషన్‌కు చేరుకొని టైర్లను వాహనానికి బిగిస్తాడని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. తొలుత ఢిల్లీ, ఎన్‌సిఆర్, బెంగళూరు, ముంబై, కొచ్చిలలో ప్రారంభించిన ఈ సేవలను త్వరలో దేశంలోని ఇతర నగరాలకు విస్తరించనుంది.
Comments
Please login to add a commentAdd a comment