మహీంద్ర వర్సిటీ, అపోలో హెల్త్‌కేర్‌ అకాడెమీ జట్టు | Mahindra University & Apollo Healthcare Academy Launch Allied Health Sciences Courses | Sakshi
Sakshi News home page

మహీంద్ర వర్సిటీ, అపోలో హెల్త్‌కేర్‌ అకాడెమీ జట్టు

Sep 30 2025 8:44 AM | Updated on Sep 30 2025 11:52 AM

collaboration between Mahindra University Apollo Healthcare Academy

అలైడ్‌ హెల్త్‌ సైన్సెస్‌లో బ్యాచిలర్స్‌ కోర్సు ప్రారంభించే దిశగా హైదరాబాద్‌లోని మహీంద్రా యూనివర్సిటీ, అపోలో హెల్త్‌కేర్‌ అకాడెమీ అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. డిమాండ్‌ అధికంగా ఉన్న అనస్థీషియా, ఆపరేషన్‌ థియేటర్‌ టెక్నాలజీ, మెడికల్‌ ల్యాబరేటరీ టెక్నాలజీ, కార్డియోవాస్కులర్‌ టెక్నాలజీ మొదలైన స్పెషలైజేషన్స్‌పై ఈ కోర్సు ప్రధానంగా దృష్టి పెడుతుంది.

బోధనకు సంబంధించి మహీంద్రా వర్సిటీకి చెందిన ఆధునిక మౌలిక సదుపాయాలు, క్లినికల్‌ నైపుణ్యాల్లో అపోలో హెల్త్‌కేర్‌ అకాడెమీ అనుభవంతో విద్యార్థులు ప్రయోజనం పొందవచ్చని ఇరు సంస్థలు తెలిపాయి. ఆఖరు సంవత్సరంలో ఇంటర్న్‌షిప్‌తో పాటు అపోలో హాస్పిటల్స్, భాగస్వామ్య నెట్‌వర్క్‌లలో ప్లేస్‌మెంట్‌పరంగా  కూడా మద్దతు లభిస్తుంది.

ఇదీ చదవండి: ‘ఆదిలోనే హంసపాదు’ కాకూడదంటే.. ఓ లుక్కేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement