collaboration
-
బడిని గుడి చేసిన గురుదేవుళ్లు..
బతకలేక బడిపంతులు అనే నానుడి పోయింది.. బతకనేర్చిన బడిపంతులు అనే అపవాదును మోయాల్సి వచ్చింది.. కానీ ఇప్పుడు.. బతుకు నేర్పుతున్న బడిపంతులుగా ఆ బాధ్యతను సమాజం పూజించే స్థాయికి తీసుకెళ్లారు కొందరు ప్రభుత్వోపాధ్యాయులు!కాన్వెంట్లు, ఇంటర్నేషనల్ కరిక్యులమ్‌తో కార్పొరేట్ స్కూళ్లు.. పల్లెలు, టౌన్లు, సిటీలు అనే తేడా లేకుండా అన్నిచోట్లా తమ వాటా పెంచుకుంటూ పోతున్నాయి. ఉద్యోగ భద్రత కోసమే సర్కారు బడి, భవిష్యత్తుపై భరోసాకు మాత్రం ప్రైవేట్ స్కూలే సరి అనేది ప్రాక్టిస్లోకొచ్చింది. ప్రోగ్రెస్ రిపోర్ట్‌లో తెలుసుకోవడం కన్నా కంఠస్థమే ఫస్ట్ వస్తోంది. నైతికవిలువల కన్నా ద్రవ్య విలువకే ఇంపార్టెన్స్ అందుతోంది. ఇంత మార్పులో కూడా తన ముద్రను ప్రస్ఫుటంగా చూపించుకుంటోంది ప్రభుత్వ పాఠశాల. గత వైభవాన్ని ప్రేరణగా మలచుకుంటోంది.రామాయణ, భారత, భాగవతాల కథలతో రామకృష్ణులను, కౌరవపాండవ పాత్రలను కళ్లముందు నిలబెట్టే గురువులు, ఇంగ్లిష్ అంటే ఇష్టమున్నా కన్ఫ్యూజ్ చేసే టెన్సెస్తో భయపెట్టే ఆ భాషను సింపుల్‌గా బుర్రకెక్కించి.. అయ్యో ఇది ఎంత వీజీ అనుకునేలా చేసే టీచర్లు, అమ్మో లెక్కలా.. గొట్టు అనుకునే పిల్లల లాజిక్ సెన్స్‌కు రెక్కలు తొడిగి.. లెక్కల మీద మోజును పెంచే మాష్టార్లు, సైన్స్ అంటే పళ్లు తోముకోవడం, సైన్స్ అంటే ఏడ్వడం, నవ్వడం, ఆకలవడం, పరుగెత్తడం, గెంతడం, అలసిపోవడటం, ఉత్సాహపడటం, నిద్రపోవడమే.. ఒక్కమాటలో ‘సైన్స్ అంటే బతుకురా’ అంటూ తేల్చేసి ఆ కొండను పిండి చేయించే సార్లు, ఊరి సర్పంచ్ ఎవరు, వార్డ్ కౌన్సిలర్ ఏం చేస్తాడు?, గాంధీ తాతా చాటిందేంటి?, చాచా నెహ్రూ చెప్పిందేంటి.. ఇట్లా మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవడమే సాంఘిక శాస్త్రం అంటూ లౌకిక జ్ఞానం మీద శ్రద్ధ పెంచిన నాటి బోధకులు.. నేటి ప్రభుత్వోపాధ్యాయులకు స్ఫూర్తిప్రదాతలవుతున్నారు. నిజమే! తెలివిడితనాన్నే ప్రోగ్రెస్‌గా పరిగణిస్తున్న గురువులతో ప్రభుత్వ పాఠశాలలు పాఠాలు చెబుతున్నాయి. ఆ జాబితాలో ఇదిగో ఈ టీచర్లున్నారు. వాళ్లు అందుకుంటున్న గౌరవాభిమానాలు తెలుసుకోవాలంటే ఈ ఉదాహరణలను చదవాల్సిందే!సొంత డబ్బుతో ప్రొజెక్టర్‌ను అమర్చిన టీచర్..రామగిరి దిలీప్ కుమార్ సెకండరీ గ్రేడ్ టీచర్. ఆసిఫాబాద్ జిల్లాలోని కోపుగూడ ప్రభుత్వ పాఠశాలలో బోధన వృత్తిని ప్రారంభించారు. తర్వాత మంచిర్యాల జిల్లా, కొమ్ముగూడేనికి బదిలీ అయ్యారు. తర్వాత పదమూడేళ్లు మంచిర్యాల జిల్లా, లక్సెట్టిపేట, క్లబ్ రోడ్‌లోని ప్రాథమిక పాఠశాలలో పనిచేశారు. ప్రతిచోట తనదైన ప్రత్యేకత చాటుకున్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల్లోని విద్యార్థులకు ఆర్థిక సాయం నుంచి స్కూల్లో సౌకర్యాల పెంపునకు కృషి, సొంత డబ్బుతో ప్రొజెక్టర్లను తెచ్చి డిజిటల్ బోధన వరకు చదువు మీద విద్యార్థుల్లో ఆసక్తి పెంచడానికి ఆయన చేయని ప్రయత్నం లేదు. స్కూల్‌కు ఒక గంట ముందే వెళ్లి, ఒక గంట ఆలస్యంగా వస్తుంటారు.4, 5 తరగతి విద్యార్థులకు ప్రత్యేక క్లాస్‌లు చెబుతూ గురుకుల, నవోదయ ప్రవేశ పరీక్షల్లో సీట్లు వచ్చేలా చేస్తున్నారు. దీంతో ఆ టీచర్‌పై తల్లిదండ్రులకు నమ్మకం పెరిగింది. ఆ నమ్మకమే అతను ఎక్కడికి బదిలీ అయితే అక్కడ విద్యార్థుల సంఖ్య పెరిగేలా చేస్తోంది. 11 మందే విద్యార్థులున్న స్కూళ్లను 250 మంది విద్యార్థుల స్ట్రెంత్‌కి చేరుస్తోంది. గత జూలైలో ఆయన లక్సెట్టిపేట నుంచి ముల్కల్లగూడకు బదిలీ అయ్యారు. ‘సారు వెంటే మేమ’ంటూ 105 మంది విద్యార్థులు అంతకుముందు స్కూల్లోంచి టీసీ తీసుకుని ముల్కల్లగూడ స్కూల్లో చేరారు. దూరభారాన్ని లెక్కచేయక ఆటోలో వెళ్తున్నారు."ఫీజులు కట్టలేని ఎంతోమంది విద్యార్థులు సర్కారు బడిని ఎంచుకుంటున్నారు. వారికి సరైన బోధన అందిస్తే, బాధ్యతగల పౌరులుగా ఎదుగుతారు. వాళ్లను పట్టించుకోకపోతే దేశానికి భవిష్యత్ లేకుండా చేసినవాళ్లమవుతాం. టీచింగ్ అనేది ఉన్నతమైన వృత్తి. నిబద్ధతతో ఉంటూ నేను చేయగలిగినంత చేయాలనేదే నా తాపత్రయం!" – రామగిరి దిలీప్ కుమార్.బదిలీ రద్దుకై పిల్లలు ధర్నాకు దిగేంత ప్రభావం చూపిన సార్లు.."కాతలే గంగారాం.. ఆదిలాబాద్ జిల్లా, ఇంద్రవెల్లిలోని గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. ఆ బడిలో ఆయనది తొమ్మిదేళ్ల సర్వీస్. అంకితభావంతో పనిచేసి పిల్లలు, పెద్దల మనసులను గెలుచుకున్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెడతారు. వాళ్లకు ప్రత్యేకంగా మరోసారి క్లాసులు తీసుకుంటారు. ఆ కర్తవ్యదీక్ష పిల్లలకు ఆయన మీద గౌరవాభిమానాలను పెంచింది. అందువల్లేమో మొన్న జూలైలో.. తమ సర్కి బదిలీ అవుతోందని తెలిసి.. ఆ స్కూల్ పిల్లలంతా రోడ్డు మీద ధర్నాకు దిగారు సర్ బదిలీ రద్దు చేయాలని కోరుతూ! ఊరి పెద్దలు, తల్లిదండ్రులు చెప్పినా వినలేదు. అంతెందుకు స్వయానా గంగారాం సర్ వచ్చి చెప్పినా ససేమిరా అన్నారు. దాంతో పోలీసులు కలగజేసుకుని నచ్చజెప్పితే ధర్నా విరమించుకున్నారు. ఒక్కో విద్యార్థి ఒక్కో విషయంలో చురుకుదనాన్ని, ఆసక్తిని, ఉత్సుకతను చూపిస్తూంటారు. ఎవరూ ఎవరికి తీసిపోరు. ఎవరికి ఏ విషయంలో ప్రోత్సాహం అవసరమో గ్రహించి అందించాలి. కోపం, కరుకుదనంతో కాకుండా వాత్సల్యంతో వాళ్లను దారిలో పెట్టాలి. పిల్లలు ఉన్నతంగా ఎదగాలనేది మా ప్రయత్నం!" – కాతలే గంగారాం.మంచిర్యాల జిల్లా, పొనకల్లో ప్రధానోపాధ్యాయుడైన జాజల శ్రీనివాస్ మీద కూడా ఆయన విద్యార్థులకు గౌరవాభిమానాలు మెండు. పొనకల్ స్కూల్‌తో ఆయనది 12 ఏళ్ల అనుబంధం. గత జూ¯Œ లో శ్రీనివాస్ సర్కి అక్కపల్లిగూడకు బదిలీ అయింది. వెంటనే పొనకల్ స్కూల్లోని 141 మంది పిల్లలు అక్కపల్లిగూడ బడిలో చేరిపోయారు. అప్పటి వరకు 11 మందే ఉన్న ఆ స్కూల్లో శ్రీనివాస్ రాకతో విద్యార్థుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ప్రతి విద్యార్థి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపడం, 4, 5వ తరగతి విద్యార్థులకు గురుకుల, నవోదయ ప్రవేశం దొరికేలా బోధించడంతో శ్రీనివాస్ సర్ ఉన్న చోటే చేరాలని పట్టుబట్టి మరీ ఆ స్కూల్లో చేరారు పిల్లలు.వీథుల్లో ఫ్లెక్సీలు, బ్లాక్ బోర్డ్స్‌తో పాఠాలు చెబుతున్న స్టార్లు..ముద్దాడ బాలరాజు.. నల్లగొండ జిల్లా, వావికొల్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నారు. ఆ స్కూల్లో విద్యార్థుల సంఖ్యను పెంచటంతోపాటు పేద విద్యార్థులకు చేయుత అందించేందుకు వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. పిల్లలకు ఉచితంగా టై, బెల్ట్, షూస్‌ని పంపిణీ చేస్తూ, నాణ్యమైన విద్యను అందించడానికి కావల్సిన సౌకర్యాలను కల్పిస్తూ వావికోల్ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ మనసుల్లో నిలిచిపోయారు. అందుకే ఆయనకు ఇటీవల కొత్తతండాకు బదిలీ కావడంతో తమ స్కూల్‌ని వదలి వెళ్లద్దంటూ పిల్లలు కన్నీటి పర్యంతమయ్యారు.జీనుగపల్లి సుధాకర్, రామగిరి సందీప్‌లకు వీరబోయనపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలతో పదకొండేళ్ల అనుబంధం. ఆ ఇద్దరూ సొంత డబ్బును వెచ్చించడంతో పాటు దాతల సహకారంతో ఆ స్కూల్లోని విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా విద్యావాలంటీర్లను నియమించారు. డిజిటల్ బోధనాసౌకర్యాలను ఏర్పాటు చేశారు. వీటివల్ల 50 మంది విద్యార్థులతో ఉన్న ఆ బడి 150 మందికి చేరుకుంది. అయితే ఇటీవల ఈ ఇద్దరు కూడా వరుసగా వావికోల్కు, నల్లగొండకు ట్రాన్స్ఫర్ కావడంతో ‘మాష్టార్లూ.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దంటూ’ కన్నీళ్లు పెట్టుకున్నారు పిల్లలు. ఆ ఇద్దరు టీచర్లు అందించిన సేవలను విద్యార్థుల తల్లిదండ్రులే కాదు గ్రామస్థులూ కొనియాడారు.కట్టెబోయిన సైదులు.. శిల్గాపురం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. ఆకవరపు శివప్రసాద్ కూడా అదే స్కూల్లో టీచర్. సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టక ముందే.. ఆ ఇద్దరూ సొంత ఖర్చులతో ఇంగ్లిష్ పాఠ్యపుస్తకాలు కొని, తమ స్కూల్లో ఇంగ్లిష్‌లో బోధన మొదలుపెట్టారు. దాంతో ఆ స్కూల్లో విద్యార్థుల సంఖ్య పెరగడమే కాక ఆ ఊర్లో ఏ విద్యార్థీ ప్రైవేట్ స్కూల్ మెట్లెక్కని శుభపరిణామం చోటుచేసుకుంది. పేద విద్యార్థులు విద్యకు దూరం కావద్దని కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఆ టీచర్లిద్దరూ పూర్వ విద్యార్థుల సహకారంతో వీథుల్లో ఫ్లెక్సీలు, బ్లాక్ బోర్డ్స్‌ను ఏర్పాటు చేసి పాఠాలు చెప్పారు. ఆ గురుద్వయం కృషి వల్ల అయిదేళ్లుగా ఆ స్కూల్ గురుకుల పాఠశాల పోటీ పరీక్షల్లో వంద శాతం ఫలితాలను సాధిస్తోంది. ఈ కీర్తి శిల్గాపురం చుట్టుపక్కల ఊళ్లకూ వ్యాపించి అక్కడి పిల్లలూ ఈ స్కూల్లో చేరుతున్నారు. అయితే ఇటీవల ఈ ఇద్దరికీ వరుసగా పెద్దమునిగల్, రామడుగులకు బదిలీ అయింది. ఊరు ఊరంతా ఆ ఇద్దరికీ కన్నీటి వీడ్కోలు పలికింది. వాయిద్యాలతో సాగనంపి.. ఆ టీచర్ల మీద తమకున్న గౌరవాన్ని చాటుకుంది.గురిజ మహేశ్.. పదమూడేళ్లుగా టీచర్ వృత్తిలో కొనసాగుతున్నారు. ఆయన ఏ బడిలో ఉన్నా దాని మౌలిక వసతుల కల్పనకై శ్రమిస్తారు. అడ్మిషన్లు పెంచడానికి కృషి చేస్తారు. విద్యార్థుల గైర్హాజరుపై ప్రత్యేక దృష్టిపెడ్తారు. పిల్లలు బడి ఎగ్గొట్టి బావులు, పొలాల చుట్టూ తిరుగుతుంటే వెళ్లి వాళ్లను తన బైక్ మీద ఎక్కించుకుని స్కూల్‌కి తీసుకొస్తారు. చదువు ప్రాముఖ్యత గురించి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తారు. ప్రస్తుతం ఆయన దామెర ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు. ఈ బడికి ఆయన 2023లో డిప్యుటేషన్‌పై వచ్చారు. ఇటీవల జరిగిన బదీలీల్లోనూ ఆయన అదే బడిలో కొనసాగుతున్నారు. వృత్తిని ప్రేమిస్తూ, దేశ భవిష్యత్‌ను తీర్చిదిద్దుతూ.. బోధన గౌరవాన్ని ఇనుమడింప చేస్తున్న గురువులు అందరికీ వందనాలు! - సాక్షి నెట్వర్క్ -
ఏం ఐడియా.. మనం కూడా ఇలా చేయగలమా!
ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ, ఫాలోవర్స్ ప్రశ్నలకు అప్పుడప్పుడూ స్పందిస్తుంటారన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వీడియో చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో గమనించినట్లయితే.. ఒక టీచర్, క్లాస్ రూమ్‌లో కొన్ని వస్తువులను చిందర వందరగా వేయడమే కాకుండా, చైర్స్‌ను కూడా ఎక్కడపడితే అక్కడ వేస్తుంది. ఆ తరువాత పిల్లలను అక్కడికి తీసుకు వస్తుంది. పిల్లలందరూ అక్కడున్న వస్తువులను యధాస్థానాల్లో చేర్చేస్తారు. ఈ వీడియో చూడటానికి చాలా ఆసక్తికరంగా ఉంది. ఇదీ చదవండి: చైనాను దాటేసిన భారత్.. త్వరలో అమెరికా! - ఆనంద్ మహీంద్రా ట్వీట్ ఈ వీడియా షేర్ చేస్తూ ఏం ఐడియా.. చిన్నప్పుడే పరిశుభ్రత, చక్కదనం వంటి వాటి గురించి అలవాటు చేస్తున్నారు, మనం కూడా మన ఫ్రీ, ఎలిమెంటరీ స్కూల్స్‌లో చేయగలమా.. అంటూ ట్వీట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది, వేల సంఖ్యలో లైక్స్ పొందిన ఈ వీడియో మీద కొందరు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. What an idea… This is how to embed cleanliness & tidiness & collaboration in our basic nature. Can we make this practice a standard part of pre and elementary schools?? pic.twitter.com/APeVw4AKWL — anand mahindra (@anandmahindra) January 7, 2024 -
క్రిప్టోల కట్టడికి అంతర్జాతీయ సహకారం కావాలి
న్యూఢిల్లీ: క్రిప్టో అసెట్స్‌ను నియంత్రించేందుకు అన్ని దేశాలు సమిష్టిగా కలిసి పనిచేయాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరీ తెలిపారు. వాటిని నియంత్రించాలన్నా లేక నిషేధించాలన్నా అంతర్జాతీయ స్థాయిలో గణనీయంగా సహకారం అవసరమవుతుందని ఆయన పేర్కొన్నారు. వాటిపై పన్నుల విధింపు, ప్రమాణాల మీద పలు దేశాలు, సంస్థలు అధ్యయనం చేస్తున్నందున అన్నీ సమిష్టిగా కలిసి రావడమనేది ఎప్పటికి జరుగుతుందని నిర్దిష్టంగా చెప్పలేమని లోక్‌సభకు మంత్రి తెలియజేశారు. మరో ప్రశ్నకు సమాధానమిస్తూ.. 2014 మార్చి 31 నాటికి కేంద్ర ప్రభుత్వ రుణభారం రూ. 58.6 లక్షల కోట్లుగా (స్థూల దేశీయోత్పత్తిలో 52.2 శాతం) ఉండగా 2023 మార్చి 31 నాటికి ఇది రూ. 155.6 లక్షల కోట్లకు (స్థూల దేశీయోత్పత్తిలో 57.1 (శాతం) చేరిందని చౌదరి తెలిపారు. -
గ్రామీణ పేదలకు ఇంటర్నెట్: మైక్రోసాఫ్ట్, ఎయిర్‌జల్దీ మధ్య ఎంవోయూ
హైదరాబాద్: ఇంటర్నెట్ కనెక్టివిటీ సొల్యూషన్లు అందించే ఎయిర్ జల్దీ, మైక్రోసాఫ్ట్‌తో చేతులు కలిపింది. మూడేళ్ల ఎంవోయూపై ఈ రెండు సంస్థలు సంతకాలు చేశాయి. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యానికి దూరమైన పేద ప్రజలకు వేగవంతమైన ఇంటర్నెట్ను ఇవి అందించనున్నాయి. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లోకి కొత్తగా ఎయిర్ జల్దీ విస్తరించనుంది. ఈ రాష్ట్రాల్లో 20వేల కిలోమీటర్ల మేర తన నెట్‌వర్క్‌ను విస్తరించుకోవడం ద్వారా ఐదు లక్షల మంది లబ్ధిదారులకు సేవలను అందించనుంది. అలాగే, ప్రస్తుతం కార్యకలాపాలు సాగిస్తున్న తొమ్మిది రాష్ట్రాల్లో నెట్‌వర్క్‌ను బలోపేతం చేయనున్నట్టు ఎయిర్ జల్దీ తెలిపింది. -
ఎలక్ట్రిక్ వాహనం వాడే ప్రతిఒక్కరికి ఇది ఒక శుభవార్త..!
-
హోండా, మారుతీ భాగస్వామ్యం: ఎందుకంటే?
న్యూఢిల్లీ: వాహన తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా తాజాగా స్క్రాపింగ్, రీసైక్లింగ్ కంపెనీ మారుతీ సుజుకీ టొయొట్సుతో చేతులు కలిపింది. హోండా కార్ల యజమానులు తమ వాహనాలను సులభంగా స్క్రాపింగ్, పాత వాహనాల డీరిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ పొందవచ్చు. ఇందుకోసం హోండా డీలర్షిప్ కేంద్రాలను వినియోగదార్లు సంప్రదించాల్సి ఉంటుంది. గడువు తీరిన వాహనాల స్క్రాపింగ్ సేవలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి మారుతీ సుజుకీ టొయొట్సు ఆమోదం పొందింది. చదవండి : షాకింగ్: 5.4 మిలియన్ల ట్విటర్ యూజర్ల డేటా లీక్! మస్క్ స్పందన ఏంటి? ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లకు బంపర్ ఆఫర్ -
వాళ్లే టార్గెట్.. పేనియర్‌బైతో యాక్సిస్ బ్యాంక్ జట్టు
మారుమూల ప్రాంతాల్లోనూ రిటైలర్లు, ఇతర కస్టమర్లకు కరెంటు, పొదుపు ఖాతాలను తెరిచే దిశగా ప్రైవేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్, డిజిటల్ సర్వీస్ నెట్వర్క్ పేనియర్‌బై జట్టు కట్టాయి. ఆధార్ ఆధారిత ఈ–కేవైసీ విధానంతో స్థానిక దుకాణాల ద్వారా కూడా సులువుగా ఖాతాల ను తెరిచేందుకు ఈ ఒప్పందం తోడ్పడగలదని యాక్సిస్ బ్యాంక్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ మునీష్ షర్డా తెలిపారు. గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లోని వారు ఆర్థిక సర్వీసుల కోసం ప్రత్యేకంగా బ్యాంకు శాఖలకు వెళ్లాల్సిన అవసరం ఉండని రీతిలో ఈ విధానాన్ని తీర్చిదిద్దినట్లు వివరించారు. ఖాతాను తెరిచేందుకు పలు పత్రాలు సమర్పించడం, సుదీర్ఘ ప్రక్రియలాంటి బాదరబందీ ఉండదని పేనియర్‌బై వ్యవస్థాపకులు ఆనంద్ కుమార్ బజాజ్ తెలిపారు. తమతో జట్టు కట్టిన స్థానిక చిన్న, మధ్య తరహా సంస్థలకు ఇకపై యాక్సిస్ బ్యాంక్ సేవలు కూడా అందుబాటులోకి వస్తాయని, వారు తమ వ్యాపార లావాదేవీలను సమర్ధమంతంగా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. చదవండి: జనవరిలో మహీంద్రా తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ.. మరో రికార్డ్ క్రియేట్ చేస్తుందా! -
హీరో ప్లస్ యమహా.. త్వరలో ఈ సైకిల్ డ్రైవ్
న్యూఢిల్లీ: వాహన విడిభాగాల తయారీలో ఉన్న హీరో మోటార్స్ తాజాగా జపాన్‌కు చెందిన యమహా మోటార్‌తో సంయుక్త భాగస్వామ్య కంపెనీ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఈ–సైకిల్ డ్రైవ్ మోటార్స్ ఉత్పత్తి కేంద్రాన్ని ఇరు సంస్థలు కలిసి పంజాబ్‌లో నెలకొల్పుతాయి. 2022 నవంబర్ నుంచి ఈ ప్లాంటులో ఉత్పత్తి మొదలు కానుంది. వీటిని అంతర్జాతీయ మార్కెట్‌కు సరఫరా చేస్తారు. ఏటా 10 లక్షల యూనిట్ల తయారీ సామర్థ్యంతో ఈ ఫెసిలిటీ రానుంది. ఈ–సైకిల్ రంగంలో పనిచేసేందుకు ఇరు సంస్థలు ఇప్పటికే 2019 సెప్టెంబర్‌లో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. -
5జీ నెట్వర్క్: ఎయిర్టెల్ సంచలన నిర్ణయం..!
న్యూ ఢిల్లీ: భారత్‌లో 5జీ టెక్నాలజీ అందుబాటులోకి తీసుకురావడానికి పలు కంపెనీలు ఏర్పాట్లను ముమ్మరం చేశాయి. అందులో భాగంగా భారత్‌కు చెందిన దిగ్గజ మొబైల్ నెట్వర్క్ కంపెనీలు 5జీ టెక్నాలజీపై దృష్టిసారించిన విషయం తెలిసిందే. 5జీ టెక్నాలజీను మరింత వేగంగా విస్తరించడం కోసం ప్రముఖ మొబైల్ నెట్వర్క్ దిగ్గజం భారతి ఎయిర్టెల్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్‌ను విస్తరించడం కోసం దిగ్గజ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీస్(టీసీఎస్)తో జతకట్టనుంది. 5జీ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడంలో ఇరు కంపెనీలు సంయుక్తంగా కలిసి పనిచేస్తాయని భారతి ఎయిర్టెల్ సోమవారం రోజున ఓ ప్రకటనలో తెలిపింది. టాటా గ్రూప్ ‘ఓ-రాన్- ఆధారిత రేడియో & ఎన్ఎస్ఎ / ఎస్ఎ కోర్’ ను అభివృద్ధి చేసింది. దీనిలో పూర్తిగా స్వదేశీ టెక్నాలజీని ఉపయోగించారు. ఈ టెక్నాలజీను ఉపయోగించి ఎయిర్టెల్ 5జీ నెట్‌వర్క్‌ను మరింత వేగంగా అభివృద్ధి పరచనుంది. టీసీఎస్, ఎయిర్టెల్ భాగస్వామ్యంతో భారత్‌లో సాంకేతిక రంగాల్లో గణనీయమైన మార్పు తప్పకుండా వస్తుందని, అంతేకాకుండా భారత్‌లో వివిధ ఆవిష్కరణలకు మరింత ఊతం ఇస్తుందని భారతి ఎయిర్టెల్ ఎండీ, సీఈవో గోపాల్ విట్టల్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం దేశంలోని టెలికాం సంస్థలకు 5జీ టెక్నాలజీ ట్రయల్స్ కోసం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ట్రయిల్స్ లో భాగంగా ఎయిర్టెల్ 5జీ నెట్‌వర్క్‌ను గుర్గావ్లోని సైబర్ హబ్ ప్రాంతంలో 3500 మెగా హెర్ట్జ్ మిడిల్ బ్యాండ్ స్పెక్ట్రంలో పరీక్షించింది. ఈ పరీక్షలో ఎయిర్టెల్ 1 జీబీపీఎస్ స్పీడ్‌ను అందుకుంది. చదవండి: ఎయిర్టెల్ బంపర్ ఆఫర్.! -
రాష్ట్రంలో పెట్టుబడులపై అమెజాన్‌తో చర్చలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెట్టుబడులపై బహుళజాతి సంస్థ అమెజాన్ ఆసక్తి కనబరుస్తోంది. ఈ మేరకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) ప్రతినిధులు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డితో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్కిల్ డెవలప్మెంట్లో భాగస్వామ్యం కావడంతో పాటు, డిజిటల్ గవర్నెన్స్, రాష్ట్రంలోని చిన్న వ్యాపార సంస్థలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించడం వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అమెజాన్ ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా మంత్రి వారితో మాట్లాడుతూ... ► టెక్నాలజీలో ఏపీని అగ్రస్థానంలో నిలబెట్టడమే ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం అమెజాన్‌తో పాటు ఐఎస్బీ వంటి సంస్థల సహకారం తీసుకుంటాం. ► సహేలి కార్యక్రమం ద్వారా మహిళా సాధికారితే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సాధారణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా మలచాలన్నది సీఎం స్వప్నం. ► స్థానికంగా తయారయ్యే వస్తువులకు మార్కెటింగ్, శిక్షణ, ప్రోత్సాహం, అమ్మకం వంటి అన్ని అంశాల్లో ప్రభుత్వం అండగా ఉంటుంది. ► రాష్ట్రవ్యాప్తంగా త్వరలో రానున్న 30 నైపుణ్య కాలేజీలలో.. ఒకచోట అమెజాన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కు అవకాశమిచ్చే అవకాశాన్ని పరిశీలిస్తాం. ► విద్య, వైద్యం, వ్యవసాయం, విద్యుత్ రంగాల్లో విప్లవాత్మక మార్పులలో అమెజాన్ తో కలిసి ముందుకు వెళ్లేందుకుగల అవకాశాలపై దృష్టిసారిస్తాం. ► ప్రస్తుతం మొదటి దశ చర్చలు పూర్తయ్యాయని, త్వ రలోనే పెట్టుబడులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు అమెజాన్ ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ రాహుల్ శర్మ, తెలిపారు. ఈ వర్చువల్ సమావేశానికి ఐటీ శాఖ కార్యదర్శి భానుప్రకాశ్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సుందర్, అమెజాన్ స్టేట్స్ అండ్ లోకల్ గవర్నమెంట్ విభాగాధిపతి అజయ్ కౌల్ హాజరయ్యారు. -
ఐదు స్టార్టప్‌లతో మారుతి జత
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ ఆటోదిగ్గజం మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్ఐ) నూతన ఆవిష్కరణలకోసం కీలక నిర్ణయం తీసుకుంది. తన మొబిలిటీ అండ్ ఆటోమొబైల్ ఇన్నోవేషన్ ల్యాబ్ (మెయిల్) ప్రోగ్రాం కింద ఐదు స్టార్టప్‌లను ఎంపిక చేసినట్లు సోమవారం తెలిపింది. ప్రధానంగా కృత్రిమ మేధస్సు పై పనిచేస్తున్న సెన్స్ గిజ్, క్సేన్, ఐడెంటిఫై, ఎన్మోవిల్, డాకెట్‌రన్ అనే ఐదు స్టార్టప్‌లతో జతకట్టింది. ఈ ఒప్పందాల ద్వారా ఆటోమొబైల్ రంగంలో వినూత్న, అత్యాధునిక సొల్యూషన్స్‌తో ముందుకు వస్తున్న స్టార్టప్‌లను గుర్తించి, ఒకచోటకు తీసుకొచ్చినట్టు తెలిపింది. మారుతి సుజుకి వాటాదారుల ప్రయోజనాలను నిలుపుకుంటూ, భారతీయ కస్టమర్ల అవసరాలకు అవసరాల కంటే ముందుగానే అభివృద్ధి చెందుతున్న కొత్త టెక్నాలజీ సేవలను అందిచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఎంఎస్ఐ ఎండి, సీఈవో కెనిచి ఆయుకావా వెల్లడించారు. ఈ స్టార్టప్‌లతో భాగస్వామ్యం కావడం ద్వారా ఆటోమొబైల్ సొల్యూషన్ కొత్త యుగంలోకి ప్రవేశించామన్నారు. స్టార్టప్‌లతో పాటు పనిచేయడం ద్వారా పరిష్కారాల స్కేలబిలిటీని పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇవి కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయన్నారు. ప్రస్తుతానికి మారుతి సుజుకిలోని డొమైన్ నిపుణుల మార్గనిర్దేశనంపాటు, భవిష్యత్తులో దేశీయ, అంతర్జాతీయ స్టార్టప్ మార్కెట్ నిపుణుల ద్వారా మొత్తం ఐదు స్టార్టప్‌లకు మూడు నెలల సుదీర్ఘ యాక్సలరేషన్ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. -
రేమాండ్స్, రిలయన్స్ జత - ఎకోవేర దుస్తులు
ప్రముఖ వస్త్ర తయారీదారు, ఫ్యాషన్ రీటైలర్ రేమండ్ గ్రూప్, ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ భాగస్వామ్యంతో ఎకోవేరా వస్త్రాలను విడుదల చేసింది. గ్రీన్ ఫైబర్ ప్రమోషన్లో భాగంగా రిలయన్స్ సొంతమైన పర్యావరణ అనుకూలమైన ఆర్ ఎలాన్ టెక్నాలజీ సహాయంతో ఈ ఎకోవేరా దుస్తులను ప్రారంభించింది. ఆర్ఐఎల్ భాగస్వామ్యంతో సహజ సిద్ధమైన, మ్యాన్‌మేడ్ ఫైబర్‌తో నాణ్యమైన దుస్తులను తయారు చేసినట్టు రేమాండ్స్ తెలిపింది. జీవ ఇంధనాలు, ఇంధన-సామర్థ్య ప్రక్రియతో వాడి పారేసిన పెట్ బాటిల్స్ రీ సైకిలింగ్ ద్వారా రూపొందించిన ఆర్ఎలాన్ గ్రీన్గోల్డ్తో ఈ ఎకోవేరా దుస్తులను తయారు చేశామని వెల్లడించింది. సుమారు 700 నగరాల్లో 1,500 దుకాణాల్లో త్వరలోనే ఇవి లభ్యం కానున్నాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అత్యాధునిక నాణ్యతా ప్రమాణాలతో ప్రపంచంలోనే అత్యధిక పర్యావరణ అనుకూలమైన దుస్తులను లాంచ్ చేశామని రేమండ్స్ టెక్స్టైల్స్ అధ్యక్షుడు సుధాన్షు పోఖ్రియాల్ తెలిపారు. భూమాతను, ప్రకృతిని కాపాడే తమ లక్ష్యసాధనలో ఇది మరో అడుగని వ్యాఖ్యానించారు. ఇందుకు ఒక మిలియన్ వ్యర్ధ పెట్ బాటిల్స్‌ను రీసైకిల్ చేయాలని భావిస్తున్నామన్నారు. -
బేబీ రూపశ్రీకి మంత్రి కేటీఆర్ చేయూత
సాక్షి, హైదరాబాద్: కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న మహబూబ్‌నగర్‌కు చెందిన నిరుపేద బాలిక బేబీ రూపశ్రీ శస్త్రచికిత్సకుఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు చేయూతనందించారు. కాలేయ మార్పిడి శస్త్రచికిత్సకు రూ. 30 లక్షలు ఖర్చు అవుతుండగా, ప్రభుత్వం నుంచి రూ. 15 లక్షలు ఆయన మంజూరు చేయించారు. మిగిలిన మొత్తాన్ని ‘ది నెస్ట్ అసోసియేషన్’ వివిధ దాతల నుంచి విరాళాల రూపంలో సేకరించింది. బాలికకు సోమవారం గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స చేసినట్లు ది నెస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్‌బాబు తెలిపారు. -
ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్..నవతరం అధ్యయన సాధనం
‘బోర్డ్‌పై టీచర్ ఒక ప్రాబ్లమ్ కాన్సెప్ట్‌ను వివరించడం.. విద్యార్థులు తమ పుస్తకాల్లో నోట్ చేసుకోవడం’.. క్లాస్ రూం అనగానే సాధారణంగా గుర్తొచ్చే ఊహాచిత్రం. ఇందుకు భిన్నంగా ఇటీవల కాలంలో సరికొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి. విద్యార్థులకు ఒక అంశంపై అత్యంత మెరుగైన నైపుణ్యాన్ని అందించేందుకు ఎన్నో మార్గాలు, సాధనాలు అందుబాటులోకి వస్తున్నాయి. వీటిలో సరికొత్త అధ్యయన సాధనంగా విద్యార్థుల ఆదరణ పొందుతోంది.. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్. విద్యార్థులనుభాగస్వాములను చేస్తూ.. ఒక అంశంపై రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అందించే ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్‌పై ఈ వారం ఫోకస్.. క్రియేటివిటీ.. కమ్యూనికేషన్, కొలాబరేషన్, క్రిటికల్ థింకింగ్.. ఒక విద్యార్థి కెరీర్లో రాణించడానికి అత్యంత అవసరమైన నాలుగు ప్రధాన లక్షణాలు. ఈ నాలుగు లక్షణాలు అలవడేలా.. ప్రాక్టికల్ నైపుణ్యాల్ని అందించే సాధనమే.. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్! ఏదైనా ఒక పాఠంలోని అంశానికి సంబంధించి సమస్యను గుర్తించడం.. టీచర్ పర్యవేక్షణలో ఆ సమస్యకు మూలాలు.. పరిష్కార మార్గాలు కనుగొనడం.. ఆ దిశగా పరిశోధన చేయడం.. వెరసి సదరు అంశంపై ప్రాక్టికల్ నాలెడ్జ్ సొంతం చేసుకోవడం.. స్థూలంగా ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ముఖ్య ఉద్దేశం ఇది. ఎన్నో ఏళ్ల క్రితమే ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్‌కు అంకురార్పణ జరిగినా.. ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యం పొందుతోంది. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్.. ప్రాక్టికల్ స్వరూపం ఇప్పటివరకు మనకు తెలిసిన యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్‌కు అడ్వాన్స్డ్ స్వరూపమే.. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్‌లో పాఠ్య పుస్తకంలోని నిర్దిష్ట అంశానికి సంబంధించిన ప్రాక్టికల్ యాక్టివిటీస్ ద్వారా అవగాహన లభిస్తుంది. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ విధానంలో.. తరగతిలోని విద్యార్థుల ముందు ఒక సమస్యను ఉంచి.. ఆ సమస్య పరిష్కారానికి వాస్తవ సామాజిక పరిస్థితుల కోణంలో మార్గాలు అన్వేషించేలా ప్రోత్సహిస్తారు. అందుకే ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అంటే.. ఒక చిన్నపాటి పరిశోధన చేయడం! ఒక సమస్యను గుర్తించాక.. ఆ సమస్యకు పరిష్కార మార్గాలను అన్వేషించడం.. అన్నింటిలోకి అత్యంత అనుకూలమైన మార్గాన్ని ఎంచుకోవడం.. తర్వాత దశలో ఆ సమస్యకు సంబంధించి.. అప్పటికే తాము పాఠ్య పుస్తకంలో నేర్చుకున్న అంశాల పరిజ్ఞానాన్ని అన్వయించడం.. వాటిని సామాజిక పరిస్థితులతో బేరీజు వేసుకుంటూ పరిష్కారం కనుగొనడం.. మొత్తంగా ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ స్వరూపం ఇలా ఉంటుంది. ఈ క్రమంలో విద్యార్థులు తమ సృజనాత్మక నైపుణ్యాలకు మెరుగులు పెట్టుకునే అవకాశం లభిస్తుంది. డెసిషన్ మేకింగ్ స్కిల్స్ కూడా అలవడతాయి. ఫలితంగా భవిష్యత్తులో ఎంచుకున్న రంగంలో మరింత ఉన్నతంగా రాణించడానికి మార్గం సులభం అవుతుంది. నిరంతర ప్రాజెక్ట్ వర్క్ ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో.. నిర్దిష్ట కాల పరిమితిలో పూర్తి చేసే విధంగా ప్రాజెక్ట్ వర్క్ తప్పనిసరి. ఈ ప్రాజెక్ట్ వర్క్ అంశం ఎంపిక అనేది విద్యార్థి ఆసక్తి, అభిరుచి, బ్రాంచ్ లేదా స్పెషలైజేషన్‌పై ఆధారపడి ఉంటుంది. దీనివల్ల సదరు విద్యార్థికి ఒక అంశంలో మాత్రమే క్షేత్రస్థాయి నైపుణ్యాలు అలవడతాయి. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అనేది తరగతి గదిలో నిరంతరం జరిగే ప్రక్రియ. ఫలితంగా విద్యార్థులు అన్ని అంశాలపై పూర్తి స్థాయిలో నైపుణ్యాలు పెంపొందించుకుంటారు. సిలబస్‌లో నేర్చుకున్న అంశాల ఆధారంగా వాస్తవ సమస్యలను పరిష్కరించే విధంగా ప్రాక్టికల్ నాలెడ్జ్ సొంతమవుతుంది. అన్నింటిపైనా అవగాహన ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్‌లోని మరో ప్రధాన ప్రయోజనం.. విద్యార్థులకు తమ కోర్ సబ్జెక్ట్‌లు మొదలు.. సామాజిక పరిస్థితులపైనా అవగాహన లభించడం. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ విధానంలో ఒక అంశానికి సంబంధించి సమస్యను పరిష్కరించే క్రమంలో.. సామాజిక పరిస్థితులపై సమస్య ప్రభావం.. ఆ సమస్య పరిష్కారం ద్వారా సామాజికంగా కలిగే లాభాల గురించి కూడా తెలుస్తుంది. దీనిద్వారా విద్యార్థులకు ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ కూడా అలవడటం ఈ విధానంలోని మరో ప్రయోజనం. సోషల్ టు టెక్నికల్.. హైస్కూల్ టు పీజీ ఈ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ విధానం కేవలం టెక్నికల్, మేనేజ్మెంట్ కోర్సులు.. ఉన్నత స్థాయి చదువులకే పరిమితం కాదు. సోషల్ సెన్సైస్ నుంచి సాంకేతిక విభాగం కోర్సుల వరకు.. హైస్కూల్ స్థాయి నుంచి పీజీ కోర్సుల వరకు ప్రతి విభాగంలో ప్రతి కోర్సులో.. ప్రతి స్థాయిలో అమలు చేయొచ్చు. కోర్సు.. స్థాయి ఏదైనా ఈ విధానం ఉద్దేశం విద్యార్థుల్లో సహజ నైపుణ్యాలను వెలికితీయడమే. పూర్తిగా గ్రాఫ్‌లు, ఫార్ములాలకే పరిమితమయ్యే మ్యాథమెటిక్స్‌లో నైపుణ్యం ఆధారంగా కూడా ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్‌కు ఆస్కారం ఉందనడం అతిశయోక్తి కాదు. పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా.. కేవలం పాఠ్యాంశాలు, సిలబస్‌లోని నిర్దేశిత అంశాలకే పరిమితం కాకుండా.. విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న ఏ రంగంలోనైనా.. ఏ అంశంలోనైనా ఒక సమస్యను పరిష్కరించేలా ప్రోత్సహించడం ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్‌లోని మరో ప్రత్యేకత. దీని ప్రధాన ఉద్దేశం సృజనాత్మకత, క్రిటికల్ థింకింగ్, సామాజిక-ఆర్థిక పరిస్థితులపై అవగాహన కల్పించడం. ఈ తరహా నైపుణ్యాలను తెలుసుకునేందుకు కొన్ని సంస్థలు ఉమ్మడి వేదికల ద్వారా అవకాశం కల్పిస్తున్నాయి. ఇన్ఫోసిస్ వంటి సంస్థలు పోటీలు నిర్వహిస్తున్నాయి. విద్యార్థులు ఒక ఐడియాతో వెళ్లి.. దానికి కార్యరూపమిస్తే బహుమతులు అందించడంతోపాటు.. తమ సంస్థల్లో ఉద్యోగావకాశాలు కూడా కల్పిస్తున్నాయి. క్రమేణా పెరుగుతున్న అవగాహన అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో ఈ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఎప్పటి నుంచో సమర్థంగా అమలవుతోంది. మన దేశంలో ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్‌పై ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతోంది. ప్రధానంగా టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ ఈ తరహా విధానానికి తెరదీస్తున్నాయి. ఐఐటీ-గాంధీనగర్ తొలిసారి అకడెమిక్ స్థాయిలో పీబీఎల్ విధానాన్ని అమలు చేస్తోంది. ఐఐటీ-బాంబే కూడా ‘ఈ-యంత్ర రోబోటిక్స్ కాంపిటీషన్’ పేరుతో వ్యవసాయ సాగు విధానాలలో రైతులకు తోడ్పడే సాధనాలను ఆవిష్కరించడానికి పోటీ నిర్వహించింది. దేశవ్యాప్తంగా దాదాపు ఆరు వేల మంది విద్యార్థులు ఈ పోటీలో పాల్గొని తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. పలు సంస్థల ప్రతిపాదన మన దేశంలోని ప్రస్తుత కరిక్యులం, వాస్తవ అవసరాల మధ్య తేడాను పరిగణనలోకి తీసుకుంటే.. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ చాలా అవసరమని నిపుణులు పేర్కొంటున్నారు. ఆ మేరకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ), నాస్కామ్ తదితర సంస్థలు అకడెమిక్ స్థాయిలో ఈ విధానాన్ని అమలు చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని సూచిస్తున్నారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో నేటి అవసరాలను తీర్చే విధంగా కరిక్యులంలోనే పీబీఎల్ విధానాన్ని అంతర్భాగం చేయాలని సీఐఐ సూచించింది. అధ్యాపకుల పాత్ర కీలకం పీబీఎల్ విధానం అమలులో అధ్యాపకులదే ప్రధాన పాత్ర. విద్యార్థులకు నిర్దిష్ట సమస్యను కేటాయించడం.. దాని పరిష్కారం కనుగొనే దిశగా పర్యవేక్షణ, సలహాలు, సూచనలు అందించడంలో అధ్యాపకులే కీలకం. ఈ మేరకు ఆబ్జెక్టివ్స్, చెక్‌లిస్ట్ రూపొందించ డం వంటి వాటిపై ముందుగా వారికి అవగాహన ఉండాలి. ఒక సమస్యను కేటాయించే ముందు ఆ సమస్యకు అందుబాటులో ఉన్న పరిష్కారాల గురించి కూడా తెలిసుండాలి. అంతేకాకుండా తమ తరగతిలోని విద్యార్థుల ఆసక్తి, అభిరుచిని గుర్తించి.. విద్యార్థులను ఒక బృందంగా ఏర్పరచడం అత్యంత కీలకం. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్‌లో.. ఒక తరగతిలో ఆలోచనలు, ఆసక్తుల్లో సారూప్యమున్న విద్యార్థులను గుర్తించడం.. బృందాలుగా ఏర్పరచడం ద్వారానే ఆశించిన ఫలితాలు లభిస్తాయి. అందుకే.. పీబీఎల్‌పై అధ్యాపకులకు కూడా పూర్తి స్థాయి అవగాహన లభించేలా.. అమెరికా, కెనడా, యూకే వంటి దేశాల్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు (ఓరియెంటేషన్ ప్రోగ్రామ్స్) నిర్వహిస్తున్నారు. STEMవిభాగంలో ఎంతో అవసరం మన సామాజిక అవసరాలను పరిగణనలోకి తీసుకుంటే.. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్‌ను అకడెమిక్ స్థాయిలో అమలు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ముఖ్యంగా TEM (Science, Technology, Engineering, Management)విభాగంలో పీబీఎల్ ద్వారా విద్యార్థులకు రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ లభిస్తుంది. దీనికోసం.. విద్యా సంస్థలతోపాటు, సంబంధిత పరిశ్రమ వర్గాల తోడ్పాటు ఉంటే మంచి ఫలితాలు ఆశించొచ్చు. విద్యార్థులను కాలేజ్ స్థాయి నుంచే కంపెనీల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దొచ్చు. పీబీఎల్ వల్ల ఫ్లెక్సిబుల్ లెర్నింగ్‌కు ఎంతో ఆస్కారం లభిస్తుంది. కరిక్యులంలో లేదు కదా.. అనే భావన వీడి విద్యార్థులు.. అధ్యాపకులు ఈ విధానానికి శ్రీకారం చుడితే అద్భుత నైపుణ్యాలు సొంతమవుతాయి. భవిష్యత్తులో చక్కటి అవకాశాలు అందుకోవడానికి వీలవుతుంది. - ప్రొఫెసర్ బి.వి. నారాయణ ప్రిన్సిపల్ రీసెర్చ్ సైంటిస్ట్, ఐఐఎస్సీ-బెంగళూరు ఆర్ అండ్ డీ దిశగా తొలి అడుగు ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ విధానాన్ని.. విద్యార్థుల కోణంలో రీసెర్చ అండ్ డెవలప్మెంట్ దిశలో తొలి అడుగుగా పేర్కొనొచ్చు. ఈ అప్రోచ్ ద్వారా విద్యార్థులకు తరగతి గదిలోనే రియల్ టైం ఎక్స్పీరియన్స్ లభిస్తుంది. ఆర్ అండ్ డీ ఔత్సాహిక విద్యార్థులను గుర్తించి.. భవిష్యత్తులో వారు పీహెచ్డీ దిశగా వెళ్లే ప్రోత్సాహక సాధనంగానూ పీబీఎల్ విధానం తోడ్పడుతుంది. మన దేశంలో ఇంకా పూర్తి స్థాయిలో పీబీఎల్‌పై అవగాహన కలగడం లేదు. దీనికి సంబంధించి విద్యా సంస్థలు, అధ్యాపకులు చొరవ తీసుకోవాలి. పరిశ్రమ వర్గాలతో సంప్రదించి చిన్నపాటి పరిశోధనలను కళాశాల లేబొరేటరీలు, తరగతి గదుల్లోనే పూర్తి చేయాలి. తద్వారా విద్యార్థుల్లో సహజ నైపుణ్యాలు ఆవిష్కృతమయ్యేలా చూడాలి. - ప్రొఫెసర్ వి. వాసుదేవరావు, క్రయోజనిక్ ఇంజనీరింగ్, ఐఐటీ-ఖరగ్‌పూర్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్.. విద్యార్థులకు లభించే ప్రయోజనాలు క్రియేటివిటీ స్కిల్స్ అలవడటం. బృందాలుగా కలిసి పనిచేసే తత్వం. పాఠ్యాంశాలపై ఆసక్తి పెరగడం. భవిష్యత్తులో వాస్తవ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకునే అవకాశం క్లాస్ రూం నుంచే కాంటెంపరరీ అంశాలపై అవగాహన పెంచుకునే వీలు. ముఖ్యంగా పుస్తకాల్లో నేర్చుకున్న అంశాలపై నిరంతరం ప్రాక్టికల్ నాలెడ్జ్ లభించడం. మేనేజ్‌మెంట్‌లోనూ పీబీఎల్‌కు ఆస్కారం పీబీఎల్.. కేవలం టెక్నికల్, ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌లకే అనుకూలం అనుకుంటే పొరపాటు. మేనేజ్మెంట్, సోషల్ సెన్సైస్ విభాగాల్లోనూ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్‌కు ఆస్కారం ఉంది. మేనేజ్మెంట్ కోర్సుల విషయంలో ఆయా కేస్ స్టడీలకు సంబంధించి ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ద్వారా పరిష్కారాలు కనుగొనే అవకాశం లభిస్తుంది. పరికరాల వినియోగం లేకపోయినా.. ఆలోచనలు, వాస్తవ ప్రామాణికాలు, సృజనాత్మకత ఆధారంగా మేనేజ్మెంట్ కేస్ స్టడీస్ అనాలిసిస్, ప్రాబ్లమ్ సాల్వింగ్‌లో పీబీఎల్ ఎంతో దోహదపడుతుంది. - ప్రొఫెసర్ వి. సీత డీన్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, హెచ్‌సీయూ ఐటీ విభాగాల్లో ఆవశ్యకం ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్.. ఐటీ, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ఎంతో ఉపయుక్తం. రియల్ టైం ప్రాబ్లమ్ అనాలిసిస్, సాల్వింగ్‌కు దోహదం చేసే సాధనం. విద్యార్థులు తాము పాఠ్యాంశాల్లో నేర్చుకున్న అంశాల ఆధారంగా వాస్తవ సమస్యలను పరిష్కరించడం.. ఐటీ విభాగంలో ఉంటుంది. అందుకు.. పీబీఎల్ ద్వారా అకడెమిక్ స్థాయి నుంచే అవగాహన కల్పించొచ్చు. - ప్రొఫెసర్ సి. కృష్ణమోహన్, హెచ్ఓడీ-సీఎస్ఈ (ఐఐటీ-హైదరాబాద్)