హైదరాబాద్: ఇంటర్నెట్ కనెక్టివిటీ సొల్యూషన్లు అందించే ఎయిర్ జల్దీ, మైక్రోసాఫ్ట్‌తో చేతులు కలిపింది. మూడేళ్ల ఎంవోయూపై ఈ రెండు సంస్థలు సంతకాలు చేశాయి. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యానికి దూరమైన పేద ప్రజలకు వేగవంతమైన ఇంటర్నెట్‌ను ఇవి అందించనున్నాయి.
తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లోకి కొత్తగా ఎయిర్ జల్దీ విస్తరించనుంది. ఈ రాష్ట్రాల్లో 20వేల కిలోమీటర్ల మేర తన నెట్‌వర్క్‌ను విస్తరించుకోవడం ద్వారా ఐదు లక్షల మంది లబ్ధిదారులకు సేవలను అందించనుంది. అలాగే, ప్రస్తుతం కార్యకలాపాలు సాగిస్తున్న తొమ్మిది రాష్ట్రాల్లో నెట్‌వర్క్‌ను బలోపేతం చేయనున్నట్టు ఎయిర్ జల్దీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment