rural
-
అంబరాన్నంటే జానపద సంబరం అక్టోబరు 25-27 దాకా
బెంగాల్లో గ్రామీణ వారసత్వం – సంస్కృతిని అన్వేషించే అవకాశం ఈ అక్టోబర్ నెలలోనే లభిస్తోంది. మొన్నటి దసరా వేడుకల్లో దుర్గా మాత పూజలు, దాండియా నృత్యాల ఆనందాన్ని పొందాం. ఆ ఆస్వాదనకు కొనసాగింపుగా రంగుల కళతో నిండిన మరో ప్రపంచం ఆహ్వానిస్తుంటే... ఎలా మిస్ అవగలం.. ఇష్టమైన హస్తకళల నుండి నోరూరించే వంటకాల వరకు అక్కడ ప్రతిదీ గొప్పగా జరుపుకుంటారు. బెంగాల్ గ్రామాల్లోని వారి గొప్ప వారసత్వం, కనుల విందు చేసే వారి సంస్కృతిలో మనమూ ఇట్టే లీనమైపోతాం. దీనిని గుర్తించిన కోల్ ఇండియా లిమిటెడ్, బంగ్లానాటక్ డాట్ కామ్‌తోపాటు ఎక్స్ప్లోర్ రూరల్ బెంగాల్ పండుగలు, జాతరల శ్రేణిని మన ముందుకు తీసుకువస్తోంది. దీని ద్వారా బీర్భూమ్, పురూలియా బంకురా, నదియా ప్రాంతాలతో పాటు దక్షిణ బెంగాల్లో గల 16 గ్రామాలలో ప్రయాణించవచ్చు. ఇక్కడి జానపద సంగీతం, నృత్యం, తోలుబొమ్మలాటలు, హస్తకళల ద్వారా వారి సాంస్కృతిక వారసత్వంలో మనమూ పాల్గొనవచ్చు. అక్టోబర్‌లో చివరి వారాంతాల్లో ఇక్కడ పండుగ, జాతరలు ఘనంగా నిర్వహిస్తారు. బీర్భూమ్లోని అంత్యంత అట్టహాసంగా జరిగే కాంత మేళా, శాంతినికేతన్ మేళాను సందర్శించవచ్చు. పురూలియాలో చౌ ఉత్సవ్, పాత చిత్రాల మేళాను సందర్శించి, వారి కళను ఆస్వాదించవచ్చు. బురాద్వన్లోని డోక్రా మేళా, చెక్క బొమ్మల మేళాలో షాపింగ్ చేయవచ్చు. ఈ గ్రామీణ జాతర అక్టోబర్ 25 నుంచి 27 వరకు జరుగుతుంది. -
గ్రామీణ విద్యకు వాయిస్ టెక్నాలజీ దన్ను
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో విద్యాబోధనలో వాయిస్ టెక్నాలజీ కీలక పాత్ర పోషించగలదని అమెజాన్ ఇండియా డైరెక్టర్ (అలెక్సా) ఆర్ఎస్ దిలీప్ తెలిపారు. అయితే, ఇప్పటికీ దీని ఉపయోగం గురించి చాలా మందికి తెలియదని, ఈ నేపథ్యంలోనే అవగాహన కల్పన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.నాగాలాండ్‌లోని కొన్ని ప్రభుత్వ పాఠశాల్లో అలెక్సా ఎనేబుల్డ్ ఎకో స్మార్ట్ స్పీకర్లను ఉపయోగిస్తుండటమనేది వాయిస్ టెక్నాలజీ వల్ల చేకూరే ప్రయోజనాలను తెలుసుకునేందుకు తోడ్పడగలదని చెప్పారు. చదువుపై విద్యార్థుల్లో ఆసక్తి పెరగడానికి కూడా ఈ సాంకేతికత దోహదపడుతోందని దిలీప్ పేర్కొన్నారు. వాయిస్ టెక్నాలజీ మెరుగుపడే కొద్దీ విద్యారంగంలో మరిన్ని వినూత్న సాధనాలు అందుబాటులోకి రాగలవని, గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభ్యాసం రూపురేఖలు మార్చగలవని ఆయన చెప్పారు. -
గ్రామాల్లో ధరల భారం తీవ్రం
ముంబై: దేశంలో మహమ్మారి కరోనా అనంతరం ఎకానమీ తీవ్ర ఒడిదుడుకులతో రికవరీ అవుతున్న అయిన విధంగానే (ఇంగ్లీషు అక్షరం ‘కే‘ నమూనా) ఇప్పుడు ద్రవ్యోల్బణం పరిస్థితులు నెలకొన్నాయని బ్యాంకింగ్ సేవల దిగ్గజం– హెచ్ఎస్బీసీ నివేదిక ఒకటి పేర్కొంది. కరోనా అనంతరం దేశ ప్రజలందరికీ ఎకానమీ రికవరీ ప్రయోజనాలు ఒకే రీతిగా అందకుండా తీవ్ర అడ్డంకులు నెలకొన్నాయని, అదే విధంగా ఇప్పుడు ద్రవ్యోల్బణ ప్రభావం కొన్ని వర్గాలపై ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలపై తీవ్ర ప్రతికూలత చూపుతోందని వివరించింది. దేశంలో పట్టణ ప్రాంతాలతో పోల్చితే గ్రామీణ ప్రాంత ప్రజలు తీవ్ర ద్రవ్యోల్బణం సవాళ్లను ఎదుర్కొంటున్నారని పేర్కొంది. ప్రధానంగా ఆహార ద్రవ్యోల్బణం గ్రామీణ వినియోగదారులపై తీవ్ర ప్రభావం చూపుతోందని హెచ్ఎస్బీసీ ప్రధాన ఆర్థికవేత్త ప్రంజూల్ భండారీ నివేదికలో పేర్కొన్నారు. ప్రధానంగా తీవ్ర వేడి, పంట నష్టం, పశువుల మరణాల కారణంగా అధిక ఆహార ద్రవ్యోల్బణం సమస్యలను గ్రామీణ ప్రాంతం ఎదుర్కొంటోందని ఆయన పేర్కొన్నారు. నివేదికలోని కొన్ని కీలక అంశాలను పరిశీలిస్తే.. 👉పలు ఇంధన ధరలను తగ్గించడం ద్వారా ప్రభుత్వం ద్రవ్యోల్బణం తగ్గించడానికి ప్రయత్నిస్తోంది. అయితే పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ వంటి అనేక ఇంధనాలను సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపయోగించరు. దీనివల్ల పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ద్రవ్యోల్బణం చాలా ఎక్కువగా ఉందని పేర్కొంది. 👉 ఆహార ద్రవ్యోల్బణం విషయానికి వస్తే, ఇది ఎంతో ‘‘నిగూఢమైన’’ అంశం. నిజానికి ఆహారాన్ని పండించే గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల కంటే తక్కువ ద్రవ్యోల్బణం ఉంటుందని అందరూ భావిస్తారు. అయితే రైతు ఆదాయాలు దెబ్బతింటున్నందున వారు పట్టణ ప్రొక్యూర్లకు (పంట సేకరణ వ్యాపారులు)తమ పంటలను విక్రయించడానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ సరఫరాలకు దారితీసి, ఆయా ప్రాంతాల్లో ధరల తీవ్రతకు దారితీస్తోంది. 👉ఇక ఇదే సమయంలో తగిన మౌలిక సదుపాయాలు, సరఫరాల వ్యవస్థ పటిష్టత, భారీ దిగుమతుల వెసులుబాటు వంటి అంశాల నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో ప్రజలు గ్రామీణ ప్రాంతాలకంటే తక్కువ ద్రవ్యోల్బణం ప్రభావాన్ని కలిగి ఉంటున్నారు. 👉 మేలో ఏడాది కనిష్ట స్థాయిలో 4.75 శాతంగా రిటైల్ ద్రవ్యోల్బణం నమోదయినప్పటికీ, ఆర్బీఐ లక్ష్యం కన్నా 75 బేసిస్ పాయింట్లు అధికం. కాగా, రిటైల్ ద్రవ్యోల్బణంలో కీలక విభాగం– ఆహార ద్రవ్యోల్బణం మాత్రం తీవ్ర స్థాయిలో కొనసాగడం ఆందోళన కలిగిస్తోంది. మేలో తీవ్ర స్థాయిలో 8.69 శాతంగా నమోదైంది. ఏప్రిల్‌లో సైతం ఈ రేటు 8.70 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం తీవ్రత అటు సామాన్యులకు, ఇటు వృద్ధి పురోగతికి అడ్డంకి కలిగించే అంశం. సమీక్షా నెల మేలో పట్టణ ప్రాంతాల్లో 4.15 శాతం ద్రవ్యోల్బణం ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఇది సగటు 4.75 శాతంకన్నా అధికంగా 5.28 శాతంగా నమోదయ్యింది. 👉 వర్షాలు తగిన విధంగా లేకపోతే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వడ్డీరేట్ల తగ్గుదలకు తగిన పాలసీ నిర్ణయాలను తీసుకోకపోవచ్చు. ఇది ఎకానమీపై తీవ్ర ప్రతికూలత చూపుతుంది. 👉జూలై– ఆగస్టుల్లో సాధారణ వర్షాపాతం నమోదుకాకపోతే తీవ్ర ద్రవ్యోల్బణం సమస్య తప్పదు. ధాన్యాగారాల్లో గోధుమలు పప్పుధాన్యాల నిల్వలు ఇప్పటికే తక్కువగా ఉన్నాయి. తగిన వర్షపాతం నమోదుకాకపోతే, 2024లో ఆహార ఒత్తిడి 2023 కంటే అధ్వాన్నంగా ఉండవచ్చు. జూన్‌లో ఇప్పటివరకు వర్షాలు సాధారణం కంటే 17 శాతం తక్కువగా నమోదయ్యాయి. వాయువ్య ప్రాంతంలో అత్యధికంగా తృణధాన్యాలు పండుతాయి. ఇక్కడ 63 శాతం లోటు వర్షపాతం నమోదుకావడం గమనార్హం. 👉 వర్షాలు సాధారణ స్థితికి వస్తే, ద్రవ్యోల్బణం బాగా పడిపోవచ్చు. దీనితో ఆర్బీఐ సరళతర వడ్డీరేట్ల వ్యవస్థకు నిర్ణయం తీసుకోవచ్చు. సానుకూల అంశాల నమోదయితే మార్చి 2025 నాటికి 0.5 శాతం రెపో రేటు తగ్గింపునకు దారితీయవచ్చు. 👉బ్యాంకులకు ఆర్బీఐ తానిచ్చే నిధులపై వసూలు చేసే వడ్డీ రేటును రెపో రేటుగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఇది 6.5 శాతం. బ్యాంకింగ్ వ్యవస్థలో వడ్డీ రేట్లు ప్రధానంగా దీనిపై ఆధారపడి ఉంటాయి. 2023 ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ దీన్ని యథాతథంగా కొనసాగిస్తోంది. కాగా, వృద్ధికి విఘాతం కలగకుండా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయగలిగిన విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పటికీ, ఆహార ధరలపరంగా ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగే అవకాశాలను ఆర్బీఐ పరిశీలిస్తోంది. 👉 ఆర్బీఐ పాలసీ విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2024–25లో 4.5 శాతం ఉంటుందన్నది ఆర్బీఐ పాలసీ అంచనా. క్యూ1 (ఏప్రిల్–జూన్) 4.9 శాతం, క్యూ2లో 3.8 శాతం, క్యూ3లో 4.6 శాతం, క్యూ4లో 4.5 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం ఉంటుందని ఆర్బీఐ భావిస్తోంది. కేంద్రం ఆర్బీఐ నిర్దేశిస్తున్నదాని ప్రకారం ప్లస్2 లేదా మైనస్2తో 4 శాతం వద్ద రిటైల్ ద్రవ్యోల్బణం ఉండవచ్చు. అంటే ఎగువముఖంగా 6 శాతంగా ఉండవచ్చన్నమాట. అయితే 4 శాతమే లక్ష్యమని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ పలు సందర్భాల్లో స్పష్టం చేస్తూ వస్తున్నారు. ఆహార ధరల తీవ్రతవల్లే రిటైల్ ద్రవ్యోల్బణం 4 శాతం దిగువకు రావడం లేదని ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష పేర్కొంది. -
గ్రామీణ బాలికలు.. డాక్టరమ్మలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల బాలికలు ఎక్కువగా వైద్య రంగం వైపే చూస్తున్నారు. 14.2 శాతం మంది డాక్టర్ కావాలనుకుంటే, మరో 25.2 శాతం మంది నర్స్ అవుదామని ఉందని చెప్పారు. అదే మగపిల్లల్లో డాక్టర్ కావాలనుకుంటున్నవారు 4.7 శాతం మందేకావడం గమనార్హం. రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా చూసినా.. బాలికలు డాక్టర్, నర్స్ లేదా టీచర్ కావాలని కోరుకుంటే, బాలురు పోలీసు, ఇంజనీరింగ్, ఆర్మీ వైపు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ‘యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్’లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 26 రాష్ట్రాల్లో సర్వే చేసి.. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లోని 28 జిల్లాల పరిధిలో ఉన్న 1,664 గ్రామాల్లో 34,745 మంది 14–18 ఏళ్ల మధ్య వయసున్న బాలురు, బాలికలపై ఈ సర్వే చేశారు. వారి ఉద్యోగ/ఉపాధి ఆశలు, విద్యా ప్రమాణాలు, డిజిటల్ స్కిల్స్, చదువు ను నిజజీవితంలో ఏమేరకు అమలు చేస్తున్నా రనేది పరిశీలించారు. స్కూళ్లు, కాలేజీల్లో చదు వుతున్నవారితోపాటు బయటివారినీ ప్రశ్నించా రు. మొత్తంగా త్వరగా జీవితంలో స్థిరపడాలనేది చాలా మంది ఆలోచనగా ఉందని, ఆ ప్రకారమే ఉద్యోగం/ఉపాధిపై దృష్టిపెడుతున్నారని కేంద్ర నివేదిక పేర్కొంది. లాక్డౌన్ సమయంలో కష్టాలు ఎదుర్కొన్నందున ప్రభుత్వ ఉద్యోగంపై చాలా మంది మక్కువ చూపిస్తున్నట్టు తెలిపింది. మహిళలు చదువుకున్నా ఇంటి పని తప్పదన్న ఉద్దేశంతో.. అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని వివరించింది. హోటల్ మేనేజ్మెంట్, టైలరింగ్, బ్యూటీ పార్లర్, వ్యవసాయం వంటి వాటిపై దృష్టిసారిస్తామని బాలికలు పేర్కొన్నట్టు తెలిపింది. లెక్కలు, ఇంగ్లిష్‌లో వెనుకబాటు తెలంగాణ గ్రామీణ యువతలో 14–18 ఏళ్ల వయసు వారిలో కూడికలు, తీసివేతలు వంటి లెక్కలు చేయగలిగినవారు 21.5 శాతమేనని కేంద్ర నివేదిక పేర్కొంది. ఇంగ్లిష్‌పై కనీస అవగాహన ఉన్నవారు 41 శాతమేనని తెలిపింది. ఇక రాష్ట్రంలో పనిచేయడానికి ఆసక్తి చూపనివారిలో బాలురు 18 శాతం, బాలికలు 11.7 శాతం ఉన్నారు. పనిపై ఆసక్తి చూపనివారి విషయంలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని నివేదిక పేర్కొంది. ఈ అంశంలో దేశ సగటు రెండు శాతమే. ఉద్యోగ భద్రతకే గ్రామీణ యువత మొగ్గు ‘‘గ్రామీణ యువత జీవితంలో త్వరగా స్థిరపడాలని, ఉద్యోగ భద్రత కావాలనే ఆలోచనలో ఉన్నట్టు కేంద్ర నివేదిక చెప్తోంది. దానికి తగ్గట్టుగానే చాలా మంది పనిని ఎంచుకుంటున్నారు. అయితే సమాజ అవసరాలు కూడా ముఖ్యమే. పరిశోధనలు, ఉన్నత విద్య, వైద్య రంగంలో స్థిరపడటంలో ఆలస్యం కారణంగా తక్కువ మంది వాటివైపు వస్తున్నారు. పనిచేయడానికి ఆసక్తి చూపనివారూ ఎక్కువగా ఉండటం వెనుక కారణాలను అన్వేషించాలి. – డాక్టర్ కిరణ్ మాదల, సైంటిఫిక్ కన్వీనర్, ఐఏఎం, తెలంగాణ -
174 మంది విద్యార్థులు.. రూ. 61.27 లక్షలు
రాయదుర్గం: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే గ్రామీణ విద్యార్థులకు చేయూత ఇచ్చేందుకు కొండాపూర్‌లోని చిరేక్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు నడుం బిగించారు. అందుకోసం ‘క్లౌడ్ ఫండింగ్ ఫ్లాట్‌ఫాం ఫ్యూయల్ ఎ డ్రీమ్ డాట్‌కామ్’ద్వారా నిధులను సేకరించారు. పాఠశాలకు చెందిన 174 మంది విద్యార్థులు స్వచ్చందంగా ముందుకొచ్చి మూడు వారాల్లోనే రూ.61.27 లక్షలు సేకరించడం విశేషం. తెలంగాణ, మహారాష్ట్రలోని అన్ని ప్రాంతాలలో చదివే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బ్యాక్–టు–స్కూల్ కిట్‌ను అందించడమే లక్ష్యంగా వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కిట్కోసం సంవత్సరానికి రూ.900 ఖర్చవుతుంది. గ్రీన్‌సోల్ అనే ఎన్జీఓ సహకారంతో ఈ కిట్‌ను తయారు చేయించారు. చిరేక్ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రతి విద్యార్థి రూ.27వేలు సేకరించడం లక్ష్యం. దీంతో 30 మంది గ్రామీణ విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. అయితే 174 మంది విద్యార్థులు రూ.61.27 లక్షలను సేకరించడంతో 6,800 మంది విద్యార్థులకు మేలు జరగనుంది. -
‘పల్లెవెలుగు’లో మరో రాయితీ టికెట్
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో ఆటోల్లో వెళ్లే ప్రయాణికులను బస్సుల వైపు మళ్లించేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కొత్తగా పల్లె వెలుగు బస్సుల్లో 30 కి.మీ. దూరం ప్రయాణించే వారికి రాయితీ టికెట్‌ను అందుబా టులోకి తీసుకువచ్చింది. కొద్ది రోజుల క్రితం సంస్థ టీ9–60 పేరుతో పల్లెవెలుగు బస్సుల్లో 60 కి.మీ. పరిధిలో తిరిగే ప్రయాణికులకు రూ.100కే రాను పోను రాయితీ టికెట్‌ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. దానికి స్పందన తక్కువగా ఉండటంతో, ఇప్పుడు టీ9–30 పేరుతో 30 కి.మీ. పరిధిలో తిరిగే వారికి రూ.50కే రానుపోను వర్తించేలా రాయితీ టికెట్‌ను ప్రారంభించింది. ఈ టికెట్లు గురువారం నుంచి కండక్టర్ల వద్ద అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. ఆటోల్లో ప్రయాణించేవారిపై గురి.. చాలా ప్రాంతాల్లో ప్రజలు ఆటోలను ఆశ్రయి స్తున్నారు. పల్లెవెలుగు బస్సు టికెట్‌పై రాయితీ ప్రకటిస్తే వారిలో కొందరైనా బస్సులెక్కు తారని ఆర్టీసీ భావిస్తోంది. ప్రస్తుతం పల్లెవెలుగు బస్సుల్లో 30 కి.మీ. నిడివిలో ప్రయాణించే వారి సంఖ్య దాదాపు మూడున్నర లక్షలుగా ఉంది. అంతకు రెట్టింపు జనం అదే పరిధిలో ఆటోల్లో ప్రయాణిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా తెచ్చిన రాయితీ టికెట్ తీసుకుంటే.. రూ.50తో గమ్యం వెళ్లితిరిగి రావచ్చు. దానికి అదనంగా రూ.20 చెల్లించి కాంబి టికెట్ తీసుకుంటే ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో కూడా అదే టికెట్‌తో రాను, పోనూ ప్రయాణించవచ్చు. కొద్ది రోజుల క్రితం 60 కి.మీ. నిడివిలో ప్రయాణించేవారికోసం రూ.100కే రానుపోను టికెట్ తీసుకురాగా, 60 కి.మీ. పరిధిలో తిరిగే ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండటంతో దానికి పెద్దగా స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో చాలా మంది డిపో మేనేజర్లు కోరటంతో కొత్త విధానం ప్రారంభించారు. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు ఈ టికెట్ చెల్లుబాటులో ఉంటుంది. సాయంత్రం 6 వరకు టికెట్ల జారీ ఉంటుంది. 30 కి.మీ. పరిధిలో పొరుగు రాష్ట్రంలో ప్రయాణం ఉంటే.. అక్కడ కూడా ఇది చెల్లుబాటు (టీఎస్ఆర్టీసీ బస్సుల్లోనే) అవుతుందని అధికారులు ప్రకటించారు. ఈ కొత్త టికెట్‌కు సంబంధించిన పోస్టర్‌ను బుధవారం బస్‌భవన్‌లో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి, ఎండీ సజ్జనార్‌లు ఆవిష్కరించారు. -
18 నెలలుగా పెరగనే లేదు!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఉద్యోగుల సగటు వేతన ఆదాయంలో పెరుగుదల కనిపించడం లేదని పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్) తెలిపింది. 2023–24 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంతో ముగిసిన 18 నెలల కాలంలో వారి వేతనంలో ఎలాంటి ఎదుగుదల లేదని పేర్కొంది. రూ. 14,700 దగ్గరే ఆగిపోయినట్లు వివరించింది. అయితే పట్టణ ప్రాంతాల్లో సగటు ఉద్యోగి (శాలరీడ్ పర్సన్) నెలవారీ సగటు వేతనం మాత్రం రూ. 20,030 నుంచి 7.5 శాతం పెరిగి రూ. 21,647కు చేరుకున్నట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ నివేదిక తెలిపింది. పీఎల్ఎఫ్ఐ డేటా ప్రకారం చూస్తే గ్రామీణ ప్రాంతాల్లోని దినసరి కూలీ లేదా వేతనం 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఉన్న రూ. 302తో పోలిస్తే 2023–24 తొలి త్రైమాసికంలో రూ. 368కు పెరిగింది. అదే పట్టణ ప్రాంతాల్లోని క్యాజువల్ లేబర్ రోజుకూలీ రూ. 385 నుంచి రూ. 464కు పెరిగింది. దేశంలోని కార్మికశక్తిలో 46 శాతం మంది వ్యవసాయ దిగుబడులపై ఆధారపడి ఉన్నారని... కానీ ఈ ఏడాది తీవ్ర వాతావరణ మార్పులు వారికొచ్చే నెలసరీ ఆదాయాలపై ప్రతికూల ప్రభావం చూపొచ్చని నివేదిక అభిప్రాయపడింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, నిర్మాణ రంగాల్లో... పట్టణాల్లో ఉత్పత్తి, సర్వీసెస్, ఇతర రంగాల్లో ఉద్యోగులు కేంద్రీకృతమైనట్లు పీఎల్ఎఫ్ఎస్ నివేదిక వెల్లడించింది. ప్రైవేటులో ఉపాధిలేమి.. పట్టణ ప్రాంతాల్లోని ఉద్యోగులు ప్రైవేటు రంగంలోని ఐటీ, స్టార్టప్ సెక్టార్లలో ఎక్కువగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ప్రతికూల పరిస్థితుల కారణంగా ఈ ఉద్యోగులకు అవకాశాలు దక్కకపోవడంతో ఉపాధిలేమి కూడా వెంటాడుతోందని నిపుణులు చెబుతున్నారు. గతేడాదితో పోలిస్తే ‘నెలవారీ హైరింగ్ ట్రెండ్స్’ దాదాపు 7 శాతం తగ్గిపోయినట్లు ‘ఫౌండిట్ ఇనసైట్స్ ట్రాకర్’ వెల్లడించింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీస్స్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగంలోని మొత్తం 27 పరిశ్రమల్లో 10 శాతం ఉద్యోగాల కల్పన తగ్గినట్లు ట్రాకర్ పేర్కొంది. ఏయే రంగాల్లో వృద్ధి... ఫౌండిట్ ఇన్సైట్స్ ట్రాకర్ అధ్యయనం ప్రకారం... గతేడాది నుంచి పరిశీలిస్తే కేవలం 9 రంగాల్లో మాత్రమే ఈ–రిక్రూట్మెంట్ కార్యకలాపాలు పెరిగాయి. ఇందులోనూ షిప్పింగ్/మెరైన్ పరిశ్రమ అత్యధికంగా 45 శాతం వృద్ధిని నమోదు చేసింది. డేటా ఆధారంగా వ్యూహాలు రూపొందించుకొనే అడ్వర్టయిజింగ్, మార్కెటింగ్–పీఆర్ పరిశ్రమలు 28 శాతం రిక్రూట్మెంట్ యాక్టివిటీ పెరుగుదల సాధించాయి. రిటైల్, ట్రావెల్, టూరిజం రంగాలు గతేడాదితో పోచ్చితే 27 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ద్రవ్యోల్బణం పెరుగుదలే కారణం... దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుదలతో గ్రామీణ ప్రాంతాల్లో వేతనాలు పెరగట్లేదు. దీంతో ఈ ప్రాంతాల్లోని ఉద్యోగుల నిజ వేతనాలు (రియల్ వేజ్) పెరగక ఇబ్బందిపడుతున్నారు. పట్టణ ప్రాంతాలోన్లూ అదే పరిస్థితి నెలకొంది. పైకి చూస్తే వేతనం ద్వారా నిర్ణిత ఆదాయం వస్తున్నట్లు కనిపిస్తున్నా గత నెలతో పోలిస్తే ద్రవ్యోల్బణం పెరుగుదల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. జనం చేతుల్లో డబ్బుల్లేక వారి కొనుగోలు శక్తి తగ్గుతోంది. దీనికితోడు ఉపాధి హామీ పనిదినాలు తగ్గడం గ్రామీణ ప్రాంత దినసరి కూలీలపై మరింత ప్రభావం చూపుతోంది. గ్రామీణ భారతంలో సగటు వేతన జీవులు ఉసూరుమంటున్నారు..అత్తెసరు వేతన ఆదాయంతో బతుకుబండిని భారంగా లాగుతున్నారు..పల్లెల్లో చాలీచాలని ఆదాయంతో సర్దుకుంటున్నారు. కేంద్ర గణాంక శాఖ పరిధిలోని నేషనల్ శాంపిల్ సర్వే కార్యాలయం 2023–24 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి సంబంధించి విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్) నివేదిక ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఈ సర్వే ప్రకారం దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో వేతన జీవి సగటు ఆదాయం గత ఏడాదిన్నర నుంచి రూ. 14,700 వద్దే నిలిచిపోయింది. మరోవైపు ఓ ప్రైవేటు సంస్థ చేపట్టిన మరో అధ్యయనం ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పట్టణ ప్రాంత ఉద్యోగి సగటు ఆదాయం రూ. 21,647గా నమోదైంది. -
గ్రామీణ పేదలకు ఇంటర్నెట్: మైక్రోసాఫ్ట్, ఎయిర్‌జల్దీ మధ్య ఎంవోయూ
హైదరాబాద్: ఇంటర్నెట్ కనెక్టివిటీ సొల్యూషన్లు అందించే ఎయిర్ జల్దీ, మైక్రోసాఫ్ట్‌తో చేతులు కలిపింది. మూడేళ్ల ఎంవోయూపై ఈ రెండు సంస్థలు సంతకాలు చేశాయి. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యానికి దూరమైన పేద ప్రజలకు వేగవంతమైన ఇంటర్నెట్ను ఇవి అందించనున్నాయి. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లోకి కొత్తగా ఎయిర్ జల్దీ విస్తరించనుంది. ఈ రాష్ట్రాల్లో 20వేల కిలోమీటర్ల మేర తన నెట్‌వర్క్‌ను విస్తరించుకోవడం ద్వారా ఐదు లక్షల మంది లబ్ధిదారులకు సేవలను అందించనుంది. అలాగే, ప్రస్తుతం కార్యకలాపాలు సాగిస్తున్న తొమ్మిది రాష్ట్రాల్లో నెట్‌వర్క్‌ను బలోపేతం చేయనున్నట్టు ఎయిర్ జల్దీ తెలిపింది. -
హ్యుందాయ్ కొత్త ప్లాన్స్: గ్రామీణ భారతంపై కన్ను
హైదరాబాద్: డిజిటల్ ఫ్లోట్ వ్యాన్ల ద్వారా గ్రామీణ కొనుగోలుదారులను ఆకర్షించాల ని హ్యుందాయ్ ఇండియా వ్యూహరచన చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన ప్రకారం కారును స్వయంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రదర్శించడం ఈ చొరవ ఉద్దేశం. ఇదీ చదవండి: 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో నెక్సన్ ఈవీ మ్యాక్స్: ధర ఎంతో తెలుసా? ఇందులో భాగంగా, గ్రాండ్ ఐ10 నియోస్‌ను వినియోగదారుల ఇళ్ల వద్దకే పంపాలని నిర్ణయించింది. 36 డిజిటల్ ఫ్లోట్లు వచ్చే రెండు నెలల్లో 27 రాష్ట్రాల్లోని దాదాపు 582 గ్రామీణ ప్రాంతాలను కవర్ చేయాలన్నది కంపెనీ లక్ష్యం. తెలుగు రాష్ట్రాల్లో 61 గ్రామీణ ప్రాంతాలను కవర్ చేయడానికి 4 డిజిటల్ ఫ్లోట్లను సిద్ధం చేసింది. (తనిష్క్ 100 టన్నుల బంగారు మార్పిడి ఉత్సవాలు, ఏకంగా 20 లక్షలమంది) తెలుగు రాష్ట్రాల గ్రామీణ ప్రాంతాలకు బయలుదేరిన డిజిటల్ ఫోట్ వ్యాన్లను జెండా ఊపి ప్రారంభిస్తున్న కంపెనీ ప్రతినిధులను చిత్రంతో తిలకించవచ్చు. ‘‘భారత్ డైనమిక్ మార్కెట్లో చివరి మైలు ను చేరుకోవడానికి వినూత్న విధానాలను అవలంబించాలని మేము విశ్వసిస్తున్నాము. ఉత్పత్తులను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాము’’ అని హ్యుందాయ్ మోటార్ ఇండియా సీఓఓ తరుణ్ గార్గ్ పేర్కొన్నారు. మరిన్ని టెక్ వార్తలు, బిజినెస్ అప్డేట్స్ కోసం చదవండి: సాక్షిబిజినెస్ -
గ్రామీణంలో పుంజుకున్న ఎఫ్ఎంసీజీ వినియోగం
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల వినియోగం తిరిగి గాడిన పడింది. ఆరు త్రైమాసికాల క్షీణత తర్వాత మార్చి క్వార్టర్లో వృద్ధి నమోదైంది. డేటా విశ్లేషణ సంస్థ ‘ఎన్ఐక్యూ’ ఈ వివరాలను విడుదల చేసింది. ఎఫ్ఎంసీజీ విక్రయాల్లో గ్రామీణ ప్రాంతాల వాటా 35%గా ఉంటుందని పేర్కొంది. అయితే ఆరు త్రైమాసికాల తర్వాత అమ్మకాల్లో భారీ వృద్ధి నమోదు కాలేదు. అతి స్వల్పంగా 0.3 శాతమే పెరిగాయి. కాకపోతే దీన్ని సానుకూలంగా ఐక్యూ నివేదిక పేర్కొంది. పట్టణ ప్రాంతాల్లో మార్చి త్రైమాసికంలో ఎఫ్ఎంసీజీ అమ్మకాలు 5.3%పెరిగినట్టు వెల్లడించింది. దీనికంటే ముందు గ్రామీణ మార్కెట్ చివరిగా 2021 ఏప్రిల్–డిసెంబర్ కాలంలో వృద్ధిని చూడడా న్ని ఈ నివేదిక ప్రస్తావించింది. మొత్తం మీద మార్చి త్రైమాసికంలో ఎఫ్ఎంసీజీ పరిశ్రమలో అమ్మకాల పరంగా 3.1%, విలువ పరంగా 10.1% వృద్ధి నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం పుంజుకోవడానికి తోడు, సంప్రదాయ అమ్మకాలు పెరగడం సానుకూల వృద్ధికి దోహదపడింది. ఆహారోత్పత్తులకే ఆదరణ.. ఆహారోత్పత్తుల అమ్మకాలు 4.3 శాతం వృద్ధి చెందాయి. ఆహారేతర వినియోగం కేవలం 0.2 శాతం పెరిగింది. ఆహారం కాకుండా, గృహ సంరక్షణ ఉత్పత్తుల కొనుగోళ్లలో వినియోగదారులు ఆచితూచి ఖర్చు చేస్తున్నారు. సంప్రదాయ కిరాణా దుకా ణాల్లో అమ్మకాలు కేవలం 1.9 శాతమే పెరగ్గా, ఆధునిక అంగళ్లు అయిన హైపర్ మార్కెట్లు, షాపింగ్ మాల్స్‌లో ఎఫ్ఎంసీజీ అమ్మకాలు 14.6 శాతం వృద్ధిని చూశాయి. వీధి చివర్లో ఉండే కిరాణా దుకాణాల్లో ఎలాంటి డిస్కౌంట్లు ఉండకపోగా, పెద్ద షాపింగ్ మాల్స్ మంచి ఆఫర్లతో తక్కువ మార్జిన్‌తో విక్రయిస్తుండడం ఈ పరిణామాలకు నిదర్శనం. ఎఫ్ఎంసీజీలో చిన్న కంపెనీఈలు అమ్మకాల పరంగా 7.2 శాతం వృద్ధిని చూస్తే, పెద్ద కంపెనీలకు ఇది 3.2 శాతంగానే ఉంది. ఇక్కడ కూడా అంతే, చిన్న ఎఫ్ఎంసీజీ కంపెనీలు తక్కువ మార్జిన్లతో తక్కువ ధరలకు విక్రయిస్తుండడం వినియోగదారులను ఆకర్షిస్తోంది. -
70 ప్లస్... తగ్గేదేల్యా!.. ఫొటో వైరల్
గోవాలో గ్రామీణ బామ్మలు సర్ఫ్బోర్డులతో సర్ఫింగ్‌కు వెళితే? అనే ఊహను ఏఐ సాంకేతికతతో నిజం చేసిన ఫొటో వైరల్ అవుతోంది. ఆశిష్ జోస్ అనే యూజర్ ఈ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ‘నానీస్ ఎట్ ది బీచ్’ అని క్యాప్షన్ ఇచ్చిన ఈ ఫోటోపై యూజర్స్ నుంచి రకరకాల కామెంట్స్ వచ్చాయి. ‘ఫొటో కాదు. బామ్మలు నిజంగానే సర్ఫింగ్ చేస్తే ఎంత బాగుండేదో’ అని ఒకరు కామెంట్ రాస్తే, మరొకరు ‘వెండి వొరెల్ వీడియో చూడండి చాలు’ అని సలహా ఇచ్చారు. టెక్సాస్‌కు చెందిన వెండి వొరెల్ వయసు 70 సంవత్సరాల పైమాటే. ఈ వయసులోనూ సర్ఫింగ్ చేస్తూ ‘ఉమెన్ ఆఫ్ ది వేవ్’గా పేరు తెచ్చుకొని ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతోంది. చదవండి: ఈమె దెయ్యమా.. మనిషా..? అనుమానం వస్తే తప్పులేదు.. ఎందుకంటే? -
స్టార్టప్‌లకు స్వర్గధామం.. టీఎస్‌ఐఆర్‌ఐఐ
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో పురుడు పోసుకున్న పలు అంకుర పరిశ్రమలు ఇప్పుడు పల్లెబాట పట్టనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికవృద్ధి, ఉపాధి కల్పనకు బాటలు పరిచే అంకుర పరిశ్రమలకు ఆర్థిక చేయూతనందించేందుకు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (టీఎస్ఐఐసీ) అధిక ప్రాధాన్యమిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ దిశానిర్దేశం మేరకు ఆయా స్టార్టప్‌లకు రూ.30 లక్షల వరకు ఆర్థిక సాయం అందజేసే అవకాశాలున్నట్లు టీఎస్ఐఐసీ వర్గాలు తెలిపాయి. ఇందులో ప్రయోగాత్మకంగా చేపట్టే ప్రాజెక్టులకు సైతం సాయం అందుతుందని స్పష్టం చేశాయి. ఇందుకోసం తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్స్ ఫర్ రూరల్ ఇంపాక్ట్ ఇన్సెంటివ్స్ (టీఎస్‌ఐఆర్‌ఐఐ) పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపాయి. ► ఈ పథకం అమలుకు సంబంధించిన బాధ్యతలను తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ నిర్వర్తిస్తుందని పేర్కొన్నాయి. ఆర్థిక సాయం సూక్ష్మ, చిన్న, కుటీర, మధ్యతరహా పరిశ్రమలు, వీటికి సంబంధించిన సాంకేతికతను అభివృద్ధి చేసే స్టార్టప్ సంస్థలకు వర్తిస్తుందని తెలిపాయి. ఈ పథకానికి సంబంధించి హెచ్‌టీటీపీఎస్://టీమ్టీఎస్ఐసీ.తెలంగాణ.జీఓవీ.ఐఎన్/టీఎస్ఐఆర్ఐ–ఇన్సెంటివ్స్/ అనే సైట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న సంస్థలను టీఎస్ఐసీ ఏర్పాటు చేసిన గ్రాస్రూట్స్ అడ్వైజరీ కౌన్సిల్ మూల్యాంకనం చేస్తుందని.. ఆయా సాంకేతికత ద్వారా ఒనగూరే ప్రయోజనాలను విశ్లేషిస్తుందని టీఎస్ఐఐసీ వర్గాలు తెలిపాయి. నగరం నుంచి పల్లెలకు... ► నగరంలో అంకుర పరిశ్రమలకు స్వర్గధామంలా మారిన టీహబ్‌లో నూతనంగా వందలాది స్టార్టప్‌లు పురుడు పోసుకున్న విషయం విదితమే. వీటిలో ప్రధానంగా ఐటీ, అనుబంధ రంగాలు, సేవలు, బ్యాంకింగ్, హెల్త్‌కేర్, ఇన్సూరెన్స్ ఇతర సేవారంగ విభాగానివే అత్యధికంగా ఉన్నాయి. ఈ నూతన పథకంతో స్టార్టప్‌లు ఇప్పుడు నగరంలోనే పురుడు పోసుకున్నప్పటికీ.. పల్లెలకు తరలివెళ్లనున్నాయి. (క్లిక్: హెచ్ఎండీఏ ప్లానింగ్‌లో దళారుల దందా : ఆమ్యామ్యాలు లేకుంటే పెండింగే) ► గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ప్రధానంగా వ్యవసాయం, పాడి పరిశ్రమ, హార్టికల్చర్, చేనేత, ఇతర కుటీర పరిశ్రమలకు సాంకేతిక దన్ను అందించడం, వారి ఉత్పత్తులకు బ్రాండింగ్, మార్కెటింగ్ సదుపాయం కల్పించడం ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు స్టార్టప్‌లు రూపొందించే టెక్నాలజీ దోహదం చేయనుంది. ఈ సంస్థలు రూపొందించే ఉత్పత్తులు లేదా సాంకేతికత గ్రామీణుల జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే ఈ పథకం ఉద్దేశమని నిపుణులు చెబుతుండడం విశేషం. -
గ్రామాలకూ డిజిటల్ చెల్లింపులు
ముంబై: చిన్న పట్టణాలు, గ్రామాల్లో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే లక్ష్యంతో.. పేమెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ (పీఐడీఎఫ్) పథకం కింద సెప్టెంబర్ నాటికి 2.46 లక్షల డివైస్‌లు అందుబాటులోకి వచ్చాయని ఆర్బీఐ తెలిపింది. వీటిలో పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్), మొబైల్ పీవోఎస్, జనరల్ పాకెట్ రేడియో సర్వీస్, పబ్లిక్ స్విచ్డ్ టెలిఫోన్ నెట్వర్క్ ఉన్నాయని వివరించింది. పీఐడీఎఫ్ పథకం కింద యూపీఐ క్యూఆర్, భారత్ క్యూఆర్‌తోసహా 55,36,678 డిజిటల్ పరికరాలు ఏర్పాటయ్యాయి. పథకంలో భాగంగా విక్రేతలకు అధీకృత కార్డ్ నెట్వర్క్స్, బ్యాంక్‌లు సబ్సిడీతో పరికరాలను మంజూరు చేస్తాయి. ఈ స్కీమ్ కోసం ప్రస్తుతం రూ.614 కోట్ల నిధి ఉందని ఆర్బీఐ తెలిపింది. -
పల్లె, పట్టణ ప్రగతిపై సీఎం కేసీఆర్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) ఆదివారం సమీక్ష నిర్వహించారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంపై సీఎం సమావేశమయ్యారు. జిల్లాల వారీగా పనుల పురోగతిని కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమాల తదుపరి లక్ష్యాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. చదవండి: హైదరాబాద్: ముగ్గురు మహిళల అదృశ్యం కలకలం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి.. వెబ్సైట్ నిలిపివేత! -
స్పైస్ మనీ బ్రాండ్ అంబాసిడర్‌గా సోనూ సూద్
సాక్షి, న్యూఢిల్లీ: డిజిస్పైస్ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ, స్పైస్ మనీకు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ నటుడు సోనూ సూద్ వ్యవహరించనున్నారు. డీల్‌లో భాగంగా సోనూ సూద్‌కు చెందిన సూద్ ఇన్పోమేటిక్స్ (సీఐఎల్) సంస్థకు స్పైస్ మనీలో 5 శాతం వాటాను కేటాయిస్తారు. సోనూ సూద్‌ను నాన్-ఎగ్జిక్యూటివ్ అడ్వైజరీ బోర్డ్ మెంబర్‌గా నియమిస్తారు. కరోనా కల్లోలం చెలరేగినప్పు డు, లాక్డౌన్ కాలంలో ఆపన్నులకు అండగా నిలిచిన సోనూ సూద్ కార్యక్రమాల్లో కొన్నింటిని కొనసాగిస్తామని స్పైస్ మనీ తెలిపింది. కోటి మంది గ్రామీణ పారిశ్రామికవేత్తలను డిజిటల్‌గా, ఆర్ధికంగా శక్తివంతం చేసే లక్ష్యంతో ఉన్నామని స్పైస్ మనీఫౌండర్ దిలీప్ మోడీ వెల్లడించారు. ఇదే లక్ష్యంతో భాగస్వామిగా సోను సూద్‌లో ఉండటం చాలా ఆనందంగా ఉందన్నారు. గ్రామీణులు తమ ఇళ్లను, కుటుంబాలను విడిచిపెట్టకుండా స్వతంత్ర జీవనోపాధిని సంపాదించేందుకు అవసరమైన సాంకేతిక శక్తిని అందిస్తామని ‘భారత్’ ప్రతి మూలలో స్వావలంబన, వ్యవస్థాపకత, ఆర్థిక పరిపుష్టికి ప్రోత్సహించనున్నామని తెలిపారు. ఆత్మనీర్భర్ భారత్ కోసం , ప్రతీ గ్రామాన్ని డిజిటల్‌గా బలోపేతం చేయడం కోసం స్పైస్ మనీతో తన అనుబంధం ఉపయోగపడనుందని విశ్వసిస్తున్నానని ఈ సందర్భంగా సోనూ సూద్ తెలిపారు. -
‘సీ’ ఫర్ చోర్.. నెహ్రూ దొంగల ప్రధాని
-
‘సీ’ ఫర్ చోర్.. నెహ్రూ దొంగల ప్రధాని
రాంచీ : జార్ఖండ్ రాష్ట్రంలోని ఓ ప్రభుత్వ పాఠశాల్లో టీచర్ బోధించిన పాఠాలు విద్యావ్యవస్థపై ప్రభుత్వాల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. హిందీ అక్షరమాల బోధిస్తున్న సదరు టీచర్ చ- అంటే చోర్( దొంగ) అని, భారత తొలి ప్రధాని పండిట్ జవహార్‌లాల్ నెహ్రూ దొంగల ప్రధాని అని బోధించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జార్ఖండ్‌లోని కుతి గ్రామ ప్రభుత్వ పాఠశాల్లో ఈ ఘటన చోటు చేసుకోగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. పాఠశాలకు భవన సౌకర్యం లేకపోవడంతో ఆ టీచర్ చెట్టు కింద బోర్డుపై పిల్లలకు హిందీ అక్షరమాల నేర్పించాడు. ఇందులో భాగంగా చ- అంటే చోర్ అని, చాచా నెహ్రూ దొంగల ప్రధాని అనే వ్యాఖ్యాన్ని చెబుతూ .. పిల్లలతో చెప్పించాడు. ఇలా భోదిస్తున్న సమయంలో కొందరు వీడియో తీసి మీడియాకు అందించారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులను వివరణ కోరగా.. విచారణకు ఆదేశించామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యాశాఖ తరుఫున క్షమాపణలు తెలుపుతున్నామన్నారు. అయితే ఇలా టీచర్లు ఇంకిత జ్ఞానం లేకుండా బోధించడం తొలి సారేం కాదు. గతంలో బీహార్, ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. అయితే బోధించే పాఠ్యంశంపై అవగాహన లేని టీచర్లు ఎందరో ఉంటున్నారని, వీరంతా పరీక్షల్లో అవతవకలు పాల్పడి ఉద్యోగాలు పొందుతున్నట్లు విద్యా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
42,990 కొత్త ఓటర్లు
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): జిల్లాలో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. కొత్తగా 42,990 మం ది ఓటరుగా పేరు నమోదు చేసుకున్నారు. దీంతో గతేడాది 10,02,949గా ఉన్న జిల్లా ఓటర్ల సంఖ్య ప్రస్తుతం 10,45,939కి చేరింది. ఇందు లో మహిళా ఓటర్ల సంఖ్యే ఎక్కువగా ఉండడం విశేషం. 4,99,682 మంది పురుష ఓటర్లు ఉండగా, 5,46,178 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. పురుషులతో పోల్చితే మహిళా ఓటర్లు 1,974 మంది ఎక్కువగా ఉన్నారు.ఓటర్ జాబితాలో చేర్పులు, మార్పుల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో.. తాజా వివరాలను జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ అధికారులు బుధవారం విడుదల చేశారు. జిల్లాలో గతంలో 1379 ఉన్న పోలింగ్ స్టేషన్లలో 40 తగ్గించి 1339కి కుదించారు. కొత్తగా ఓటర్ల నమోదుతో పాటు ఓటర్ జాబితాలో చేర్పులు, మార్పులకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. కొత్తగా నమోదు, చేర్పులు, మార్పులు, అభ్యంతరాలను స్వీకరించి అన్ని మండల తహసీల్దార్ కార్యాలయాల్లో జాబితాలు ప్రదర్శించారు. అక్కడి నుంచి వివరాలను తెప్పించుకున్న కలెక్టరేట్ అధికారులు తుది జాబితాను బుధవారం విడుదల చేశారు. అత్యధిక ఓటర్లు ‘రూరల్’లోనే.. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోనే అత్యధికంగా కొత్తగా ఓటర్లు నమోదయ్యారు. 38,704 మంది కొత్తగా తమ పేరు నమోదు చేసుకోగా, మొత్తం ఓటర్ల సంఖ్య 1,94,481కి చేరింది. అలాగే, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 1,349 మంది కొత్త ఓటర్లు నమోదయ్యారు. 1,95,974తో జిల్లాలోనే అత్యధిక ఓటర్లు గల నియోజకవ వర్గంగా ‘రూరల్’ ప్రథమ స్థానంలో నిలిచింది. ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రస్తుతం 3,512 మంది కొత్త ఓటర్ల నమోదుతో 1,60,692కి చేరగా, బోధన్ నియోజకవర్గంలో 822 ఓటర్లు తగ్గి 1,66,428కి చేరింది. అలాగే బాన్సువాడ నియోజకవర్గంలో 438 మంది కొత్త ఓటర్లు పేరు నమోదు చేసుకోగా, ఓటర్ల సంఖ్య 1,50,006కు పెరిగింది. బాల్కొండ నియోజకవర్గంలో కొత్తగా 685 మంది పేర్లు నమోదు కాగా, ఓటర్ల 1,78,358కి చేరింది. -
గ్రామీణ అభ్యర్థుల హవా!
- కానిస్టేబుల్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు - జిల్లా టాపర్‌గా నాన్‌లోకల్ అభ్యర్థి - డి.హాసన్, ఎం.శ్రీనివాసులుకు 2, 3 ర్యాంకులు - పేదింటికి చెందిన మహేష్‌కు 9వ ర్యాంకు కర్నూలు సిటీ: పోలీసు కానిస్టేబుల్ ఫలితాల్లో గ్రామీణ ప్రాంత అభ్యర్థులు సత్తా చాటారు. శుక్రవారం విడుదల చేసిన ఫలితాల్లో ఈ విషయం రుజువైంది. జిల్లాలో 180 సివిల్, 35 ఏఆర్ కానిస్టేబుల్ పోస్టుల ఖాళీలకు గతేడాది నవంబరు 8న ప్రిలీమనరీ, ఈ ఏడాది జనవరి 17వ తేదిన మెయిన్స్ పరీక్షలు జరిగాయి. కడప జిల్లాకు చెందిన డి.శ్రీధర్‌రెడ్డి 154 మార్కులతో నాన్‌లోకల్ కేటగిరీలో జిల్లా టాపర్‌గా నిలిచారు. ఆ తర్వాత డి.హాసన్ బాషా 152 మార్కులతో ద్వితీయ ర్యాంకు, 151 మార్కులతో ఎం.శ్రీనివాసులు మూడో ర్యాంకు సాధించారు. బుడగ జంగాల వర్గానికి చెందిన మహేష్ 9వ ర్యాంకు సాధించారు. కూలీ పనికి పోతేగానీ పూట గడవని స్థితిలోని కుటుంబం, మట్టిని నమ్ముకున్న ఓ రైతు ఇంట పుట్టిన బిడ్డలు పోలీసు కానిస్టేబుల్ ఫలితాల్లో ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయి ఉత్తమ ర్యాంకులు సాధించారు. - పాములపాడు మండలం ఎర్రగూడురుకు చెందిన బుడగ జంగం సామాజిక వర్గానికి చెందిన ఎం.గంగన్న, ఎం.జానమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు, కూతురు. గంగన్న వివాహం కాకముందు ఊరూరా తిరుగుతూ సంచార జీవితం గడిపే వారు. జానమ్మను పెళ్లి చేసుకున్న తర్వాత ఎర్రగూడురులో స్థిరపడ్డారు. కూలి పనులు చేసుకుంటూ పిల్లలను చదివించేవారు. అయితే తల్లిదండ్రుల కష్టాన్ని చూసిన పెద్ద కుమారుడు మధు, కూతురు సుజాత తమ్ముళ్ల చదువు కోసం వారు మధ్యలోనే చదువు మానేశారు. రెండో కుమారుడు ఎం.మహేష్ ప్రస్తుతం కానిస్టేబుల్ పరీక్ష ఫలితాల్లో జిల్లా స్థాయి 9వ ర్యాంకు సాధించారు. చివరి కొడుకు రాఘవేంద్ర సైతం ఇటీవలే ఆర్మీ ఉద్యోగం సాధించి బెంగళూరులో విధులు నిర్వహిస్తున్నారు. - వెలుగోడు మండలం వెల్పనూరుకు చెందిన మాచర్ల వెంకటరమణ, ఎం.నాగలక్ష్మమ్మ దంపతులు వ్యవసాయం చేస్తుంటారు. నాలుగెకరాలు భూమి ఉంది. వీరికి ఇద్దరు కూమారులు. పెద్దవాడు ఎం.శ్రీనివాసులు 151 మార్కులు సాధించి జిల్లాలో మూడో ర్యాంకర్‌గా నిలిచారు. ప్రాథమిక చదువంతా వేల్పనూరులో సాగింది. నంద్యాల వెంకటేశ్వర జూనియర్ కాలేజీలో ఇంటర్, కడప కె.ఎస్.ఆర్.ఎమ్ ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ పూర్తి చేశారు. మొదటి ప్రయత్నంలోనే కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. హోంగార్డు నుంచి కానిసేబుల్ పోస్టుకు ఎంపిక.. పోలీసు శాఖలో హోంగార్డుగా సేవలు అందిస్తున్న వారు సైతం కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. దేవనకొండ మండలం పూల్లాపురం గ్రామానికి చెందిన డి.రామకృష్ణారెడ్డి 2012 నుంచి హోంగార్డుగా పని చేస్తున్నారు. ఇంటర్, డిగ్రీ ఓపెన్ స్కూల్ విధానంలో పూర్తి చేశారు. హోంగార్డుగా పని చేస్తూ కానిస్టేబుల్ పోస్టులకు ఎస్.వి.ఆర్ కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకున్నాడు. సి.బెళగల్‌కు చెందిన హరిప్రసాద్, పి.ఆంజనేయులు, ఈ.రామన్‌గౌడు తదితరులు కూడా హోంగార్డులుగా పని చేస్తూ సివిల్ కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు. -
ఇంటర్ పరీక్షలు ప్రారంభం
– 96.96 శాతం హాజరు – గైర్హాజరైన వారిలో సైన్స్ విద్యార్థులే అధికం కర్నూలు సిటీ: బుధవారం నుంచి ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజున తెలుగు, హిందీ, సంస్కృతం పరీక్షలు జరిగాయి. గ్రామీణ ప్రాంత విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరే సమయంపై ముందు నుంచే అధికారులు ప్రచారం కల్పించ పోవడంతో అక్కడక్కడ కొంత ఆలస్యంగా కేంద్రాలకు చేరుకున్నారు. అదే విధంగా మరి కొన్న చోట్ల పరీక్ష సమయానికి చేరుకోలేక పోయిన వారికి అనుమతించక పోవడంతో విద్యార్థులు కన్నీళ్ళు పెట్టుకుంటు వెనుదిరిగారు. 1213 మంది విద్యార్థులు గైర్హాజరు : జిల్లాలో ఉన్న 218 జూనియర్ కాలేజీలకు చెందిన మొత్తం 39963 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు హాల్ టికెట్లు వచ్చాయి. వివిధ కారణాల వల్ల 38750 మంది విద్యార్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. 1213 మంది పరీక్షలకు హాజరు కాలేకపోయినట్లు ఆర్ఐఓ తెలిపారు. మొదటి రోజు జిల్లాలో ఎక్కడ కూడా మాల్ ప్రాక్టిస్ కానీ, కాపీయింగ్ జరుగలేదని అధికారులు పేర్కొన్నారు. హాజరుకానివారిలో సైన్స్ విద్యార్థులే అధికం: నిర్ణీత హాజరు శాతం లేని సైన్స్ విద్యార్థులకు హాల్ టికెట్స్ ఇవ్వక పోవడంతో చాలా మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఆర్ట్స్ విద్యార్థులకయితే నిర్ణీత రుసం చెల్లించి పరీక్షలకు హాజరు కావచ్చు. అయితే మంగళవారం బ్యాంకు అధికారుల ధర్నా వల్ల బ్యాంకులు తెరుచుకోలేదు. ఈ కారణంతో మరి కొంతమంది విద్యార్థులు హాల్ టికెట్లు పొందలేకపోవడంతో పరీక్షలు రాయలేకపోయారు. ఈ విషయంపై ముందు నుంచే విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చిరించినా బోర్డు అధికారులు సరైన రీతిలో స్పందించక పోవడం వల్ల చాలా మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాలేక పోయారని తెలుస్తోంది. నిర్ణీత సమయానికి కేంద్రాలకు...! ఇంటర్ బోర్డు అధికారులు ఉదయం 8.30 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించిన మేరకు కేంద్రాలకు చేరుకున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల మాత్రమే కొంత ఆలస్యంగానే విద్యార్థులు కేంద్రాలకు చేరుకున్నారు. మరికొన్ని చోట్ల నిర్ణీత సమయానికి చేరుకోలేక పోయారని వెనిక్కి పంపించారు. ఆర్ఐఓ వై.పరమేశ్వరరెడ్డి నగరంలోని వాసవి, కోల్స్, అమరావతి జూనియర్ కాలేజీలను తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ... నంద్యాల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ పరిశీలించారు. పరీక్షల నిర్వహణపై కళాశాల ప్రిన్సిపల్ సునీతను అడిగి తెలుసుకున్నారు. -
పల్లె–నగరం మధ్య తేడాలు
నగర గీతం అందమైన సహజ ప్రకృతి.. పల్లె – కృతకమైన అందాల ముల్లె.. పట్నం. పల్లె ఆత్మీయతల సంగమం – నగరంలో ఎవరికి వారే ఏకాకి. పల్లెలో స్వచ్ఛమైన ప్రకృతి – నగరంలో సమస్తం కలుషిత భరితం. పల్లెల్లోని మనుషుల మనసుల్లో మలినం లేదు – నగరాల్లో కుట్రలు, దగాలు, వంచనలు. పల్లెల్లో పరిమళించే మానవత్వం – నగరంలో అంతా యాంత్రికత. పల్లెల్లో డబ్బులేకున్నా పరిచయాలతో పనులు సమకూరుతాయి. నగరంంలో పైసా లేకుండా ఏ పనీ జరగదు. పల్లెల్లో పరస్పర గౌరవ మర్యాదలు – నగరంలో ఎవరూ ఎవ్వరినీ లక్ష్యపెట్టరు. నగర జీవికి తీరిక దొరకదు, కోరిక చిక్కదు. ఇక్కడ జీవితం చాలా ఖరీదైంది. ఎంత సంపాదించినా చాలదు. ఎంత డబ్బున్నా అంతకు మించిన విలాసవంతమైన జీవితం ఊరిస్తూ ఉంటుంది. అందుకే ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకొని డబ్బు సంపాదించాలనుకుంటారు. దీంతో తీరిక సమయం దొరకదు. ఏ కోరికలు నెరవేర్చుకోవడానికి అంత కష్టపడుతుంటారో ఆ అవకాశాలు మాత్రం ఎప్పటికీ అందని ద్రాక్షలాగే ఉండిపోతాయి. ఖరీదైన జీవనశైలి ఇక్కడి మనుషులకు పెను సవాలుగా నిలుస్తుంది. నగర జీవితంలోని ప్రతికూలాంశాలు – కఠిన వర్ణన: జగిత్యాలలో స్వేచ్ఛగా జీవిస్తూ తనకిష్టమైన కవిత్వం, కళారాధనలో హాయిగా గడిపే అలిశెట్టి ప్రభాకర్.. నగర జీవితంలో ఇరుక్కుపోయారు. పేదరికాన్ని, దీనస్థితినే కడుపారా అనుభవించిన ఈ యువ కవి తన అనుభవాలను అక్షరాయుధాలుగా చేసి కవితలు రాశారు. అందుకే ఆయన అనుభవాల్లో నగరంలోని ప్రతికూలాంశాలే ఎక్కువగా ఉన్నాయి. అవి ‘సిటీలైఫ్’ కవితల్లో ప్రతిఫలించాయి. నగరంలో జీవన విధానం: నగరంలో మనిషి జీవితం అంతుచిక్కని అయోమయం. కాలుష్యం కోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతుంటుంది. నిరంతరం ప్రమాదాల అంచున ప్రయాణం. ఎప్పుడు, ఎక్కడి నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో చెప్పలేం. కాలంతో పోటీపడుతూ ఉరుకులు–పరుగులు పెట్టడం ఇక్కడి ప్రత్యేకత. ఎవరికీ తీరిక చిక్కదు. తీరని కోరికల చిట్టా పెరుగుతూనే ఉంటాయి. సహజమైన ఆనందం దుర్లభం. అంతా కృత్రిమం, యాంత్రికం, వంచనలమయం. అంతుచిక్కని రసాయనశాల లాంటి నగరంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఒకసారి ఈ పద్మవ్యూహం లాంటి నగరంలో ప్రవేశిస్తే బయటపడటం కష్టం. నగరజీవనం సంక్లిష్టంగా మారడానికి కారణాలు: శరవేగంగా పెరుగుతున్న జనాభా వల్ల సౌకర్యాలు సరిపడకపోవడం, అవసరాలు పెరిగిపోవడంతో జీవనవ్యయం ఖరీదవుతోంది. విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి తగినంత డబ్బు సంపాదించడం అవసరమవుతోంది. ఎంత సంపాదించినా చాలడం లేదు. అందుకే పోటీతత్వం పెరుగుతోంది. మనుషుల మధ్య ఆత్మీయతలకు బదులు అంతరం పెరిగిపోతుండటం వల్ల పరస్పరం మర్యాద, నమ్మకం స్థానంలో నిర్లక్ష్యం, వంచన పెరిగిపోతున్నాయి. సంపాదించే యంత్రాలుగా మారుతున్న మనుషుల్లో సున్నితత్వం, సహృదయత కొరవడి అకారణ ద్వేషాలు, పగలు–ప్రతీకారాలు అధికమవుతున్నాయి. ఎవరికి వారే యమునా తీరే. ఒకే కుటుంబంలోని మనుషుల మధ్య కూడా ఆత్మీయతలు లేవు. మమతాభిమానాలు కొరవడ్డాయి. నిర్లక్ష్యం, వేగం, అలసత్వం, బేఖాతరు లాంటి కారణాల వల్ల నిరంతరం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదాల బారినపడ్డవాళ్లను పలకరించి, పట్టించుకునేవారు కరువయ్యారు. అందరూ కలిసి జీవిస్తున్నా, ఒకరిపై మరొకరికి నమ్మకం లేకపోవడంతో అందరూ ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. ఇన్ని వైవిధ్యాల నడుమ గడిచే సిటీ జీవితం ఒక రసాయనశాలగా, పద్మవ్యూహంలా నానాటికీ అంతుచిక్కకుండా సంక్లిష్టంగా తయారవుతోంది. పై అంశాల ఆధారంగా ఏ ప్రశ్న వచ్చినా చక్కగా ఆలోచించి జవాబు రాసేందుకు విద్యార్థులు సంసిద్ధం కావాలి. మాదిరి ప్రశ్నలు 1.నగరగీతం పాఠం ఆధారంగా నగర జీవనంలోని మంచి, చెడులను విశ్లేషించండి? (6 మార్కులు) 2.పల్లె ప్రజలు నగరబాట పట్టడానికి కారణాలేమిటి? (3 మార్కులు) 3.పల్లె.. తల్లి ఒడి, పట్టణం.. ఇనప్పెట్టె. ఈ వాక్యాన్ని సమర్థించండి. 3 మార్కులు) 4.నగర గీతం పాఠం ద్వారా అలిశెట్టి ప్రభాకర్ ఏం చెప్పదలచుకున్నారు? (6 మార్కులు) 5.నగరంలోని ప్రతి మనిషీ పఠనీయ గ్రంథం అని కవి పేర్కొనడంలో అంతరార్థమేమిటి? (3 మార్కులు) 6.నగరాన్ని పద్మవ్యూహమని, రసాయనశాల అని కవి ఎందుకు అన్నాడో వివరించండి. (6 మార్కులు) -
ముగిసిన జన్మభూమి–మా ఊరు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో నాల్గో విడత జన్మభూమి– మా ఊరు కార్యక్రమం బుధవారంతో ముగిసింది. ఈ నెల 2న ప్రారంభమైన ఈ కార్యక్రమం 10 రోజుల పాటు జరిగింది. జిల్లాలో 897 గ్రామ పంచాయతీలు, 270 మున్సిపల్ వార్డులు మొత్తంగా 1167 జన్మభూమి సభలు జరిగాయి. గత ఏడాది జన్మభూమి కార్యక్రమంతో పోలిస్తే ఈ సారి వినతులు తగ్గిపోయాయి. మంగళవారం నాటికి గ్రామీణ ప్రాంతాల్లో వివిధ సమస్యలపై 34,627, పట్టణ ప్రాంతాల్లో 8979 ధరఖాస్తులు వచ్చాయి. -
కిరాణ షాపులకు తక్కువ ధరకే సరుకులు
–రూరల్ రిటైల్ చైన్‌తో ప్రయోజనం –డీపీఎం వసంత కర్నూలు(హాస్పిటల్): గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నచిన్న కిరాణాషాపుల్లో విక్రయించేందుకు అవసరమైన సరుకులను తక్కువ ధరకే రూరల్ రిటైల్ చైన్ ద్వారా అందజేయనున్నట్లు డీఆర్డీఏ–వెలుగు డీపీఎం వసంత చెప్పారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. రూరల్ రిటైల్ చైన్ కింద జిల్లాలో జూపాడుబంగ్లా, కొత్తపల్లి, బేతంచెర్ల, పెద్దకడుబూరు, దేవనకొండ మండలాలను ఎంపిక చేశారన్నారు. ఈ మండలాల్లో చిన్న చిన్న కిరాణాషాపులను గుర్తించి 50 మందికి పైగా సభ్యులతో మండల నోడల్ స్టోర్‌గా ఏర్పాటు చేసి మేనేజర్‌ను నియమిస్తారన్నారు. ఆ మేనేజర్ ద్వారా ఎంపికైన వారిచే రూ.5000ల చొప్పున వాటాధనం కట్టిస్తారన్నారు. అనంతరం జిల్లా కో ఆపరేటివ్ కార్యాలయంలో ఎంపికైన బాడీని రిజిస్టర్ చేయిస్తారని తెలిపారు. ఈ సంఘానికి వ్యాట్, పాన్‌కార్డు తీసుకున్న అనంతరం ప్రభుత్వం రూ.10లక్షలు మూలధనం ఇస్తుందన్నారు. వాటాధనం, ప్రభుత్వ మూలధనం కలిపి సరుకులను ఉత్పత్తి చేసే కంపెనీల నుంచే టోకుగా సరుకులు కొనుగోలు చేస్తారన్నారు. సంఘంలో సభ్యులైన కిరాణాషాపుల వారు మండల నోడల్ స్టోర్ నుంచి తక్కువ ధరకు సరుకులను కొనుగోలు చేసి విక్రయించవచ్చన్నారు. ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్టుగా ఈ విధానం జూపాడుబంగ్లాలో అమలు చేస్తున్నామని, మిగిలిన మండలాల్లో సభ్యులను ఎంపిక చేస్తున్నట్లు వివరించారు. -
గ్రామీణ మౌలిక అభివృద్ధికి ముందడుగు
ఈ బడ్జెట్లో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనకు ఇరవై వేల కోట్ల రూపాయలు కేటాయించడంపై కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. నీటిపారుదల సౌకర్యాలు మెరుగు పడటానికి, వ్యవసాయ రంగ అభివృద్ధికి ఈ బడ్జెట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. దీనికి తోడు రైతులకు వ్యవసాయ రుణాలకు అత్యధికంగా 9 లక్షల కోట్లు, ఎంఎన్ ఆర్ ఈజీఏ కి అత్యధికంగా 38,500 కోట్లు కేటాయించడం గ్రామీణ ఆర్థిక ప్రయోజనాలకు ఎంతగానో తోడ్పడుతుందన్నారు. బడ్జెట్లో ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన పథకానికి 19,000 కోట్లు కేటాయించడం.. గ్రామీణ మౌలిక సదుపాయాలను పెంచడంలో ముందడుగు వేసినట్లేనంటూ రాజ్ నాథ్.. అరుణ్ జైట్లీ బడ్జెట్ ను అభినందించారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాలకు ఈ ఏడాది బడ్జెట్ అనుకూలంగా ఉందని, గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేసిందని అన్నారు. అంతేకాక రహదారుల అభివృద్ధికి 55 వేల కోట్లు కేటాయించడం స్వాగతించదగ్గ విషయమన్నారు. మౌలిక రంగంలో పెట్టుబడులతోపాటు, రైల్వేలో మూలధన వ్యయం కలిపి 2.2 లక్షల కోట్లు అధిగమిస్తుందని హోం మంత్రి రాజ్ నాథ్ తెలిపారు. ఈ ఏడు బడ్జెట్ ముఖ్యంగా పేదల పెన్నిధిగా ఉందని, ప్రతి ఇంటికి లక్ష రూపాయల ఆరోగ్య బీమా పథకం ఏర్పాటు చేయడం అభినందించాల్సిన విషయం అన్నారు. గ్రామ పంచాయితీలు, మున్సిపాలిటీల అభివృద్ధికి 2,87,000 కోట్లు కేటాయించడం పంచాయితీరాజ్ సంస్థల బలోపేతానికి దీర్ఘకాలికంగా ఫలితం ఉంటుందని అన్నారు. తయారీ రంగ అభివృద్ధికి, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కూడ ఎన్డీఏ ప్రభుత్వం ఈ బడ్జెట్లో అనేక ప్రయోజనాలు కల్పించిందని హోంమంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. -
వైద్యానికి కొత్త మొబైల్ యాప్..!
కర్ణాటక రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత గర్భిణులు, తల్లీ పిల్లల ఆరోగ్య సేవల్లో సుయోజన యాప్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. పేషెంట్ కు ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండేందుకు సహకరిస్తోంది. ఎప్పటికప్పుడు గర్భిణుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించేందుకు, వివరాలను నమోదు చేసుకొని అత్యవసర సమయంలో తక్షణ వైద్యం అందించేందుకు ఈ సింపుల్ టెక్నాలజీ వినియోగిస్తున్నారు. మొబైల్ ఆధారిత వైద్య సేవలతో మారుమూల గ్రామాల్లో తక్షణ వైద్యం అందించగల్గుతున్నారు. ఇమ్మునైజేషన్ వంటి వైద్యపరమైన సమస్యలను గుర్తించేందుకు, గర్భిణుల నమోదు, సేవలు అందించడం వంటి వాటిలో ఏఎన్ ఎంలకు ఎన్నో బాధ్యతలు ఉంటాయి. అయితే ఈ సాధారణ మొబైల్ యాప్ తో వారు సమర్థవంతంగా విధులను నిర్వర్తించేందుకు చక్కగా పనికి వస్తోంది. కర్నాటక ఛామరాజ్ నగర్ కు చెందిన రోహిణి రూరల్ ఏరియాల్లో ఏఎన్ఎం గా పనిచేస్తున్నారు. నిజానికి ఆమె తన విధులను నిర్వహించడంలో ఎంతో చురుకుగానూ, ఆసక్తిగానూ ఉంటారు. అయినప్పటికీ ఒక్కోసారి పేషెంట్లకు కావాల్సిన సమాచారాన్ని అందించడంలో కాస్త ఇబ్బంది పడాల్సి వచ్చేది. క్లిష్టమైన సందర్భాల్లో కీలకమైన కేసుల వివరాలను తెలుసుకోవాల్సి వచ్చినపుడు.. ఆమె ఓ పద్ధతి ప్రకారం వాటిని గుర్తుంచుకోవడం కష్టంగా మారింది. దీంతో ఇటీవల రోహిణి సుయోజన యాప్ వాడకం ప్రారంభించింది. ఈ మొబైల్ బేస్డ్ అప్లికేషన్ వాడకం ప్రసూతి, పిల్లల సంరక్షణ చర్యల్లో ప్రస్తుతం ఆమెకు ఎంతో సహకరిస్తోంది. పరీక్షలు నిర్వహించేందుకు, పరిశోధనలు జరిపేందుకు సుయోజన యాప్ మార్గదర్శకంగా ఉందని రోహణి అంటోంది. ఒక దశలో పనిని వాయిదా వేసే అవకాశం లేనప్పుడు ఎమర్జెన్సీని బట్టి వారికి తక్షణ చికిత్స అందించాల్సి వచ్చినపుడు యాప్ ఎంతో ఉపయోగపడుతోందని రోహిణి చెప్తున్నారు. చిన్న టెక్నాలజీని వాడుకోవడంతో ఎంతోమంది ఏ ఎన్ ఎం లు రోగులకు ప్రత్యేక సేవలు అందించగల్గుతున్నారని కూడ రోహిణి చెప్తోంది. సుయోజన యాప్ ను వెనుకబడిన వారికి సేవలు అందించేందుకు స్వాస్థి హెల్త్ రిసోర్స్ సెంటర్ ప్రవేశ పెట్టింది. కరుణ ట్రస్ట్ , డి. ట్రీ ఇంటర్నేషనల్ సహకారంతో సామాజికంగా వెనుకబడ్డి వర్గాలకు ఈ యాప్ సేవలు అందించేందుకు ప్రత్యేక ఏర్పాటు చేశారు. అయితే స్వాస్థి ద్వారా ప్రజారోగ్య సేవలు అందించడం ప్రారంభించి సుమారు పదకొండు సంవత్సరాలు అయింది. ప్రస్తుతం సేవలను వివిధ కోణాల్లో అట్టడుగు స్థాయినుంచి సమర్థవంగా అందించేందుకు, ఏ ఎన్ ఎం ల కు పని సులభతరం అయ్యేందుకు ఈ మొబైల్ యాప్ ను వాడకంలోకి తెచ్చినట్లు స్వాస్థి డైరెక్టర్ బాబా కార్కల్ చెప్తున్నారు. పారా మెడికల్ సిబ్బంది తక్షణ వైద్య సేవలు అందించాల్సి వచ్చినప్పుడు సరైన నిర్ణయాన్ని తీసుకునేందుకు యాప్ ఉపయోగపడుతుంది. ఇది లేని సందర్భాల్లో ఏఎన్ ఎం లు అందించాల్సిన కొన్ని క్లిష్టమైన సేవలను కూడ దాట వేసే అవకాశం ఉందని ఆయన చెప్తున్నారు. ఈ మొబైల్ ఆధారిత వైద్య చికిత్స ప్రసవానికి ముందు, ప్రసవానంతరం బిడ్డల రక్షణకు ఎంతగానో ఉపయోగ పడుతుంది. కొత్తగా పుట్టిన పిల్లల సంరక్షణకు కావాల్సిన కౌన్సెలింగ్ కు, వారి గుండె కొట్టుకునే తీరు గమనించడంతోపాటు ప్రతి లక్షణాన్ని గుర్తించే అవకాశం ఈ యాప్ తో కలుగుతుందని నిర్వాహకులు అంటున్నారు. రామరాజనగర్ జిల్లాలో మార్చి 2014 లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఆసక్తికరమైన యాప్ సేవలు కర్ణాటకలోని నాలుగు జిల్లాలో 31 మంది ఏఎన్ ఎం లు అందిస్తున్నారు. యూజర్ ఫ్రెండ్లీ గా ఈ యాప్ లో కన్నడలో సమాచారం అందుబాటులో ఉంటుంది. ఈ యాప్ ను గురించి ముందుగా దీన్ని వినియోగించే ఏఎన్ ఎం లకు శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తి కాగానే సేవలు అందించడంలో వారికి వచ్చే సమస్యలను తీర్చేందుకు ఓ సూపర్ వైజర్ ను కూడ అందుబాటులో ఉంచుతారు. ప్రస్తుతం ఈ యాప్ ను శిక్షణ తీసుకున్న ఏఎన్ ఎం ల మొబైల్స్ లో మాత్రమే ఇన్ స్టాల్ చేస్తున్నారు. అయితే యాప్ ద్వారా సేవలు అందించడం వల్ల ఏఎన్ఎం లకు కొంతవరకు ఇబ్బందులు తగ్గినప్పటికీ ప్రభుత్వ అంగీకారం కోసం మాత్రం వీరి బృందం పోరాటం చేయాల్సి వస్తోంది. యాప్ కోసం నిధులు సమకూర్చిన నలుగురు సభ్యులున్న డి-ట్రీ ఇంటర్నేషనల్ తమ ప్రాజెక్టు మరికొన్ని జిల్లాల్లో ప్రవేశ పెట్టేందుకు యోచిస్తోంది.