హైదరాబాద్: డిజిటల్ ఫ్లోట్ వ్యాన్ల ద్వారా గ్రామీణ కొనుగోలుదారులను ఆకర్షించాల ని హ్యుందాయ్ ఇండియా వ్యూహరచన చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన ప్రకారం కారును స్వయంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రదర్శించడం ఈ చొరవ ఉద్దేశం.
ఇదీ చదవండి: 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో నెక్సన్ ఈవీ మ్యాక్స్: ధర ఎంతో తెలుసా?
ఇందులో భాగంగా, గ్రాండ్ ఐ10 నియోస్‌ను వినియోగదారుల ఇళ్ల వద్దకే పంపాలని నిర్ణయించింది. 36 డిజిటల్ ఫ్లోట్‌లు వచ్చే రెండు నెలల్లో 27 రాష్ట్రాల్లోని దాదాపు 582 గ్రామీణ ప్రాంతాలను కవర్ చేయాలన్నది కంపెనీ లక్ష్యం. తెలుగు రాష్ట్రాల్లో 61 గ్రామీణ ప్రాంతాలను కవర్ చేయడానికి 4 డిజిటల్ ఫ్లోట్‌లను సిద్ధం చేసింది. (తనిష్క్ 100 టన్నుల బంగారు మార్పిడి ఉత్సవాలు, ఏకంగా 20 లక్షలమంది)
తెలుగు రాష్ట్రాల గ్రామీణ ప్రాంతాలకు బయలుదేరిన డిజిటల్ ఫోట్ వ్యాన్లను జెండా ఊపి ప్రారంభిస్తున్న కంపెనీ ప్రతినిధులను చిత్రంతో తిలకించవచ్చు. ‘‘భారత్ డైనమిక్ మార్కెట్‌లో చివరి మైలు ను చేరుకోవడానికి వినూత్న విధానాలను అవలంబించాలని మేము విశ్వసిస్తున్నాము. ఉత్పత్తులను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాము’’ అని హ్యుందాయ్ మోటార్ ఇండియా సీఓఓ తరుణ్ గార్గ్ పేర్కొన్నారు.
మరిన్ని టెక్ వార్తలు, బిజినెస్ అప్‌డేట్స్ కోసం చదవండి: సాక్షిబిజినెస్
Comments
Please login to add a commentAdd a comment