Hyundai Motor's unit to buy General Motors India plant; check details - Sakshi
Sakshi News home page

హ్యుందాయ్ చేతికి జనరల్ మోటార్స్ ప్లాంట్.. కొత్త ప్లాన్ ఏంటంటే?

Published Wed, Aug 16 2023 9:25 PM | Last Updated on Thu, Aug 17 2023 10:18 AM

Hyundai india buy general motor india plant details - Sakshi

ప్రముఖ అమెరికన్ కార్ల తయారీ సంస్థ 'జనరల్ మోటార్స్' భారతదేశంలోని తన తాలెగావ్ ప్లాంట్ సౌత్ కొరియా దిగ్గజం 'హ్యుందాయ్ ఇండియా' చేతికి అందించినట్లు సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం హ్యుందాయ్ కంపెనీ మహారాష్ట్రలోని జనరల్ మోటార్ యూనిట్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ డీల్ విలువ ఎంత అనేదానికి సంబంధించిన వివరాలు అధికారికంగా వెలువడలేదు. దేశంలో అత్యధిక కార్లను విక్రయిస్తున్న సంస్థల జాబితాలో ఒకటైన హ్యుందాయ్ తన ఉనికిని మరింత విస్తరించడానికి ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని భావిస్తున్నారు.

2025 నుంచి ఉత్పత్తి..
హ్యుందాయ్ కంపెనీ ఈ కొత్త ప్లాంట్‌లో 2025 నుంచి ఉత్పత్తి ప్రారంభించే అవకాశం ఉంది. ఇప్పటికే సంస్థ ఈ సంవత్సరం ప్రారంభంలో తమిళనాడులో ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ఏకంగా రూ. 20వేలకోట్లు పెట్టుబడికి ఒప్పందం కుదుర్చుకుంది. ఇక తాలెగావ్ కొత్త ప్లాంట్‌లో ఏడాదికి 10 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.

ఇదీ చదవండి: అందులోని వాహనాల ఖరీదే వేలకోట్లు.. ఆ ప్యాలెస్ గురించి తెలిస్తే షాకవుతారు!

భారతదేశంలో జనరల్ మోటార్స్ అమ్మకాలు రోజురోజుకి తగ్గుముఖం పడుతుండటంతో త్వరలో ఇండియాను వదిలేసే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. కాగా ఇప్పుడు మహారాష్ట్ర ప్లాంట్ వదులుకోవడంతో ఆ నమ్మకం మరింత బలపడింది. ఇప్పటికే ఫోర్డ్ కంపెనీ కూడా మన దేశంలో ఉత్పత్తిని నిలిపివేసిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement