Hyundai India
-
హ్యుందాయ్ కీలక నిర్ణయం: తొలి బ్రాండ్‌గా రికార్డ్
దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం, దేశంలోని మూడో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఇకపై తమ కార్లు అన్నింటిలోనూ ఆర్ ఎయిర్ బ్యాగులను ప్రామాణింగా అందించనున్నట్టు మంగళవారం వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన భారత్ NCAP మార్గదర్శకాల ప్రకారంఈ రేటింగ్స్‌లోనూ స్వచ్ఛందంగా పాల్గొనాలని నిర్ణయించినట్లు పేర్కొంది. భారతదేశంలో బ్రాండ్ అందించే అన్ని కార్లు, ఎస్‌యూవీల్లో ఇక 6 ఎయిర్‌బ్యాగ్‌లను ప్రామాణికంగా ఉంటాయి. తద్వారా హ్యుందాయ్ తమ అన్ని కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను అందించనున్న దేశంలో తొలి బ్రాండ్‌గా అవతరించింది హ్యుందాయ్ ఇండియా కూడా భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ (BNCAP) ద్వారా క్రాష్ టెస్టింగ్ కోసం తమ మూడు కార్లను స్వచ్ఛందంగా అందిస్తున్నట్లు ప్రకటించింది. (2023 ఐసీసీ వరల్డ్ కప్: ప్రకటనల ఆదాయం ఎంతో తెలుసా?) హ్యుందాయ్ ఉత్పత్తి పోర్ట్‌ఫోలియో 13 విభిన్న మోడళ్లను కలిగి ఉంది. వాటిలో చాలా వరకు ఇప్పటికే ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను అమర్చారు. ఈ సేఫ్టీ ఫీచర్ గ్రాండ్ i10 నియోస్, ఆరా , వెన్యూ సబ్-4 మీటర్ SUVలతో సహా మిగిలిన మూడు మోడళ్లలో అందుబాటులో ఉంది. (ఐటీ దిగ్గజాల కీలక నిర్ణయం: ఆందోళనలో టెకీలు ) ఇంతకుముందు, హ్యుందాయ్ అన్ని మోడళ్లలో అన్ని సీట్లకు 3-పాయింట్ సీట్ బెల్ట్‌లు మరియు సీట్ బెల్ట్ రిమైండర్లను ప్రామాణికంగా చేసింది. వాటిలో చాలా వరకు ESC మరియు హిల్-స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్‌ని స్టాండర్డ్‌గా అమర్చారు. తమ కంపెనీ కార్లలో ‘అందరికీ భద్రత’ అనేదే తమ అత్యంత ప్రాధాన్యత అని హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎండీ కం సీఈఓ ఉన్సూ కిమ్ వెల్లడవించారు.పేర్కొన్నారు. వాహన భద్రతా లక్షణాల ప్రామాణీకరణలో బెంచ్‌మార్క్ సృష్టికర్తలుగా ఉన్న తాము ఇపుడిక అన్ని మోడల్స్ అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌ల ప్రామాణీకరణను ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. (మరో వివాదంలో బిగ్ బీ అమితాబ్: ఇంత దారుణమా అంటూ తీవ్ర ఆగ్రహం) -
హ్యుందాయ్ చేతికి జనరల్ మోటార్స్ ప్లాంట్.. కొత్త ప్లాన్ ఏంటంటే?
ప్రముఖ అమెరికన్ కార్ల తయారీ సంస్థ 'జనరల్ మోటార్స్' భారతదేశంలోని తన తాలెగావ్ ప్లాంట్ సౌత్ కొరియా దిగ్గజం 'హ్యుందాయ్ ఇండియా' చేతికి అందించినట్లు సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం హ్యుందాయ్ కంపెనీ మహారాష్ట్రలోని జనరల్ మోటార్ యూనిట్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ డీల్ విలువ ఎంత అనేదానికి సంబంధించిన వివరాలు అధికారికంగా వెలువడలేదు. దేశంలో అత్యధిక కార్లను విక్రయిస్తున్న సంస్థల జాబితాలో ఒకటైన హ్యుందాయ్ తన ఉనికిని మరింత విస్తరించడానికి ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. 2025 నుంచి ఉత్పత్తి.. హ్యుందాయ్ కంపెనీ ఈ కొత్త ప్లాంట్‌లో 2025 నుంచి ఉత్పత్తి ప్రారంభించే అవకాశం ఉంది. ఇప్పటికే సంస్థ ఈ సంవత్సరం ప్రారంభంలో తమిళనాడులో ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ఏకంగా రూ. 20వేలకోట్లు పెట్టుబడికి ఒప్పందం కుదుర్చుకుంది. ఇక తాలెగావ్ కొత్త ప్లాంట్‌లో ఏడాదికి 10 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఇదీ చదవండి: అందులోని వాహనాల ఖరీదే వేలకోట్లు.. ఆ ప్యాలెస్ గురించి తెలిస్తే షాకవుతారు! భారతదేశంలో జనరల్ మోటార్స్ అమ్మకాలు రోజురోజుకి తగ్గుముఖం పడుతుండటంతో త్వరలో ఇండియాను వదిలేసే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. కాగా ఇప్పుడు మహారాష్ట్ర ప్లాంట్ వదులుకోవడంతో ఆ నమ్మకం మరింత బలపడింది. ఇప్పటికే ఫోర్డ్ కంపెనీ కూడా మన దేశంలో ఉత్పత్తిని నిలిపివేసిన సంగతి తెలిసిందే. -
కొత్త వెర్షన్లో సిద్దమవుతున్న 'హ్యుందాయ్ ఐ10 నియోస్'.. ప్రత్యర్థులకు ఇక గట్టి పోటీనే!
భారతీయ ఆటోమొబైల్ రంగంలో ప్రముఖ కార్ల కంపెనీ 'హ్యుందాయ్' (Hyundai) తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఈ కంపెనీ లాంచ్ చేసిన 'ఐ10' మోడల్ కారు ప్రారంభం నుంచి మంచి ఆదరణ పొందుతూ ముందుకు సాగుతూ ఉంది. అయితే ఆ తరువాత ఐ10 నియోస్ పుట్టుకొచ్చింది, కాగా ఇప్పుడు 'ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్' రావడానికి సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి ఫోటోలు కూడా ఇటీవల కెమెరాకి చిక్కాయి. హ్యుందాయ్ నుంచి రానున్న 'ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్' గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూద్దాం.. గత కొన్ని సంవత్సరాలు హ్యుందాయ్ తన గ్రాండ్ ఐ10 నియోస్ ను ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లో తీసుకురావడానికి శ్రమిస్తూనే ఉంది, అయితే ఇప్పటికి ఆ కల నిజమయ్యే సమయం వచ్చేసింది. ఇటీవల ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ కనిపించింది. అయితే ఈ వెర్షన్ టెస్టింగ్ సమయంలో చెన్నైలోని కంపెనీ ప్లాంట్‌కు సమీపంలో కనిపించింది. కావున దీనికి సంబంధించిన ఎక్కువ సమాచారం అందుబాటులో లేదు. కానీ ఇది చూడటానికి దాని మునుపటి మోడల్‌ను గుర్తుకు తెస్తుంది. కొత్తగా రానున్న ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్ ముందు మరియు వెనుక చాలా వరకు కప్పబడి ఉండటం వల్ల ఖచ్చితమైన డిజైన్ వెల్లడి కాలేదు. అయితే ఇందులో అప్డేటెడ్ ఎల్ఈడీ డిఆర్ఎల్ ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఫాగ్ ల్యాంప్ కేసింగ్ డిజైన్ వంటివి మునుపటి మాదిరిగానే ఉన్నాయి. ఫ్రంట్ గ్రిల్ కూడా కొంత అప్డేట్ పొందే అవకాశం ఉన్నట్లు అనిపిస్తుంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్ సైడ్ ప్రొఫైల్ కూడా చాలా వరకు దాని మునుపటి మోడల్ మాదిరిగా ఉంటుంది. ఇందులో అప్డేటెడ్ అల్లాయ్ వీల్స్ చూడవచ్చు. రియాక్ర్ ప్రొఫైల్‌లో రిఫ్రెష్ చేసిన టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. ఇంటీరియర్ విషయానికి వస్తే, రాబోయే 2023 ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్ అప్డేట్ చేయబడిన డ్యాష్‌బోర్డ్, కొత్త ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ వంటి ఫీచర్స్ ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ వెర్షన్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో అందుబాటులో ఉన్న 8 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కలిగి ఉంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్ 2023లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ మోడల్ హ్యుందాయ్ ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చేలా ఉంది. చదవండి: రైల్వే శాఖ ఆదాయానికి గండి.. ఆ ప్యాసింజర్ల సంఖ్య తగ్గుతోంది, కారణం అదేనా! -
హ్యుందాయ్ ‘సారీ’.. మరో మలుపు తిరిగిన వివాదం
హ్యుందాయ్ మోటార్స్ కశ్మీర్ విషయంలో పాకిస్థాన్ సపోర్ట్ చేస్తూ పెట్టిన ఒక పోస్టు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌లో #BoycottHyundai బాయ్‌కాట్ హుందాయ్ ట్విటర్లో ట్రెండ్ అయ్యింది. వాహనదారులు హ్యుందాయ్ ఇండియా ఉత్పత్తులను బహిష్కరించాలని కూడా పిలుపునిచ్చారు. చాలా మంది ఆ కంపెనీకి చెందిన కార్లను అస్సలు కొనవద్దు అని కోరారు. కశ్మీర్ కోసం పాక్ చేసింది త్యాగాలైతే.. మరి ఏళ్లకేళ్లుగా భారతీయులు చేస్తున్నదేమిటి అంటూ కడిగిపడేశారు హ్యుందాయ్‌ని. ఈ నేపథ్యంలో కొరియన్ కార్ల కంపెనీ హ్యుందాయ్.. భారత ప్రజలకు క్షమాపణలు చెప్పింది. కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ కు అనుకూలంగా.. హ్యాందాయ్ పాకిస్తాన్ విభాగం సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితులలో సమర్ధించబోమని స్పష్టం చేసింది. జాతీయవాదాన్ని గౌరవించే భారతీయుల బలమైన తత్వానికి తాము కట్టుబడి ఉన్నామని హ్యూందాయ్(హెచ్ఎంఐఎల్) భారత విభాగం చెప్పుకొచ్చింది. కానీ.. Hi Hyundai. So many wishy-washy words not needed. All you need to say is - we are unequivocally sorry. Rest is all unnecessary https://t.co/wjqNh7YsXv — Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) February 6, 2022 Official Statement from Hyundai Motor India Ltd.#Hyundai #HyundaiIndia pic.twitter.com/dDsdFXbaOd — Hyundai India (@HyundaiIndia) February 6, 2022 రాజకీయ విమర్శలు అయినా వివాదం చల్లారడం లేదు. పైగా ఇప్పుడు మరో మలుపు తిరిగింది. ఈ వివాదం రాజకీయ అంశంగా మారింది. పలువురు రాజకీయ నేతలు.. హ్యుందాయ్‌పై విరుచుకుపడుతున్నారు. శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది హ్యుందాయ్ తీరును తప్పుబడుతూ ఓ ట్వీట్ చేశారు. హ్యూందాయ్ ఇండియా ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేసిన సందేశంలో అనవసరమైన పదాలు అక్కర్లేదని, స్పష్టంగా సారీ చెప్తే సరిపోయేదని, మిగతాదంతా అనవరసరమని ఆమె వ్యాఖ్యానించారు. బీజేపీ నేత డాక్టర్ విజయ్ చౌథాయివాలే సైతం హ్యుందాయ్‌పై విరుచుకుపడ్డారు. కేవలం సారీ సరిపోదని, వివరణ ఇవ్వాల్సిందేనని, ఇలా భారత్ వ్యతిరేకత వ్యాఖ్యలపై హ్యుందాయ్ గ్లోబల్ స్టాండ్ ఏంటో తెలియజేయాలని కోరారు. .@HyundaiIndia , this is not sufficient. You must explain if you endorse statements of @PakistanHyundai ? What's your global stand on such anti-India rhetoric? @Hyundai_Global https://t.co/jA0QQjU3Az — Dr Vijay Chauthaiwale (@vijai63) February 6, 2022 ఏం జరిగిందంటే.. ఫిబ్రవరి 5న పాకిస్తాన్ దేశంలో కశ్మీర్ కోసం పోరాడి చనిపోయిన వారిని గుర్తుచేసుకుంటూ ప్రతి ఏడాది కశ్మీరీ సంఘీభావ దినాన్ని అక్కడ జరుపుకుంటారు. అయితే, ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ పాకిస్తాన్ తన ట్విటర్ హ్యాండిల్స్ ద్వారా చేసిన ఒక పోస్టులో.. "మన కశ్మీరీ సోదరుల త్యాగాలను గుర్తుంచుకుందాం. స్వేచ్ఛ కోసం పోరాడుతున్న వారికి మద్దతుగా నిలబడదాం" అని హ్యుందాయ్ #KashmirSolidarityDay అనే హ్యాష్ ట్యాగ్ ఉపయోగించి పోస్ట్ చేసింది. ఆపై పెద్ద ఎత్తున్న అభ్యంతరాలు వ్యక్తంకాగా.. ఆ పోస్టులు ఇప్పుడు తొలగించినప్పటికి అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. హ్యుందాయ్ పాకిస్తాన్ ట్విటర్ హ్యాండిల్ పోస్టు చేసిన ట్వీట్లను చాలా మందికి స్క్రీన్ షాట్ తీసి ట్విటర్ వేదికగా యూజర్లు షేర్ చేస్తూ కంపెనీ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మారుతీ సుజుకి తర్వాత భారతదేశంలో రెండవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్. ప్రముఖ సబ్ కాంపాక్ట్ క్రాస్ఓవర్ SUV అయిన క్రెటాతో సహా కంపెనీ 12 మోడళ్లను విక్రయిస్తోంది. డిసెంబర్లో, హ్యుందాయ్ 2028 నాటికి ఆరు ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి భారతదేశంలో సుమారు ₹ 4,000 కోట్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్లు ప్రకటించుకుంది. చదవండి: హ్యుందాయ్ కంపెనీపై ఫైర్! ఏ రేంజ్లో అంటే.. -
హ్యుందాయ్ ఇండియాకి భారీ జరిమానా
న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద కార్ల తయారీదారు హ్యుందాయ్ కంపెనీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. వాహన విక్రయాల్లో, వ్యాపార నిర్వహణలో హ్యుందాయ్ ఇండియా తప్పుడు విధానాలను అనుసరించిందని ఆరోపిస్తూ కాంపిటీషన్ కమీషన్ భారీ జరిమానా విధించింది. అక్రమ విధానాలు, కార్లపై అక్రమ డిస్కౌంట్లు అందించినందుకు గాను రూ. 87 కోట్ల జరిమానా విధించింది. 44 పేజీల లిఖితపూర్వక ఆర్డర్లో కొరియా కార్ మేకర్ పోటీ-వ్యతిరేక విధానాలను అవలంబించిందని సీసీఐ పేర్కొంది. ఈ ఉల్లంఘన ద్వారా సంబంధిత టర్నోవర్‌ని నిర్ణయించే ప్రయోజనాలతోపాటు, ఈ వాహనాల అమ్మకం నుంచి వచ్చే ఆదాయం పరిగణనలోకి తీసుకోవాలని వ్యాఖ్యానించింది. అయితే దీనిపై హ్యుందాయ్ ఇండియా స్పందించింది. ఈ ఆర్డర్‌తో తాము తీవ్ర ఆశ్చర్యంలో మునిగిపోయామని ప్రకటించింది. దీన్ని నిశితంగా అధ్యయనం చేస్తున్నామని చెప్పింది. తమ వినియోగదారులు, ఇతర ఛానెల్ పార్టనర్ల ప్రయోజనాలను కాపాడడానికి తగిన స్థాయిలో ఆర్డర్ ను సవాలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటున్నామని తెలిపింది. -
హ్యుందాయ్ క్రెటా వచ్చేసింది..
రేటు రూ. 8.59 లక్షల నుంచి ప్రారంభం న్యూఢిల్లీ : దేశీయంగా స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల (ఎస్యూవీ) మార్కెట్లో ఆధిపత్యాన్ని దక్కించుకునే లక్ష్యంతో ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ ఇండియా మంగళవారం ‘క్రెటా’ను ఆవిష్కరించింది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభించే ఈ ఎస్యూవీ ధరలు రూ. 8.59 లక్షల నుంచి రూ. 13.6 లక్షల దాకా ఉంటాయి. భారత మార్కెట్లో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు క్రెటా ఉపయోగపడగలదని, దీన్ని అంతర్జాతీయంగా ఇతర మార్కెట్లలోనూ ఆవిష్కరిస్తున్నామని హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎండీ బీఎస్ సియో తెలిపారు. గడచిన 20 రోజుల్లో 15,000 పైచిలుకు ప్రీ-బుకింగ్స్ వచ్చినట్లు ఆయన వివరించారు. కొరియాలో డిజైన్ చేసిన క్రెటాను అభివృద్ధి చేయడంపై రూ. 1,000 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు చెప్పారు. హైదరాబాద్.. చెన్నైలోని తమ ఇంజినీర్లు దీని రూపకల్పనలో పాలుపంచుకున్నట్లు సియో తెలిపారు. ఫైవ్ సీటర్ క్రెటాలో అత్యాధునిక నేవిగేషన్ సిస్టం, పుష్ బటన్ స్టార్ట్, లెదర్ సీట్లు మొదలైన ఫీచర్లు ఉంటాయి. పెట్రోల్ వేరియంట్ల ధరలు రూ. 8.59-11.19 లక్షలుగాను, డీజిల్ వెర్షన్స్ రేట్లు రూ. 9.46-13.6 లక్షలు దాకా ఉంటాయి. ఫోర్డ్ ఎకోస్పోర్ట్, రెనో డస్టర్, నిస్సాన్ టెరానో, మహీంద్రా స్కార్పియో, మహీంద్రా ఎక్స్‌యూవీ500, టాటా సఫారీ స్టార్మ్ మొదలైన వాటితో క్రెటా పోటీపడనుంది. వీటి ధర రూ. 6.75-15.99 లక్షల దాకా ఉంది.