దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం, దేశంలోని మూడో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఇకపై తమ కార్లు అన్నింటిలోనూ ఆర్ ఎయిర్ బ్యాగులను ప్రామాణింగా అందించనున్నట్టు మంగళవారం వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన భారత్ NCAP మార్గదర్శకాల ప్రకారంఈ రేటింగ్స్‌లోనూ స్వచ్ఛందంగా పాల్గొనాలని నిర్ణయించినట్లు పేర్కొంది.
భారతదేశంలో బ్రాండ్ అందించే అన్ని కార్లు, ఎస్‌యూవీల్లో ఇక 6 ఎయిర్‌బ్యాగ్‌లను ప్రామాణికంగా ఉంటాయి. తద్వారా హ్యుందాయ్ తమ అన్ని కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను అందించనున్న దేశంలో తొలి బ్రాండ్‌గా అవతరించింది హ్యుందాయ్ ఇండియా కూడా భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (BNCAP) ద్వారా క్రాష్ టెస్టింగ్ కోసం తమ మూడు కార్లను స్వచ్ఛందంగా అందిస్తున్నట్లు ప్రకటించింది. (2023 ఐసీసీ వరల్డ్ కప్: ప్రకటనల ఆదాయం ఎంతో తెలుసా?)
హ్యుందాయ్ ఉత్పత్తి పోర్ట్‌ఫోలియో 13 విభిన్న మోడళ్లను కలిగి ఉంది. వాటిలో చాలా వరకు ఇప్పటికే ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను అమర్చారు. ఈ సేఫ్టీ ఫీచర్ గ్రాండ్ i10 నియోస్, ఆరా , వెన్యూ సబ్-4 మీటర్ SUVలతో సహా మిగిలిన మూడు మోడళ్లలో అందుబాటులో ఉంది. (ఐటీ దిగ్గజాల కీలక నిర్ణయం: ఆందోళనలో టెకీలు )
ఇంతకుముందు, హ్యుందాయ్ అన్ని మోడళ్లలో అన్ని సీట్లకు 3-పాయింట్ సీట్ బెల్ట్‌లు మరియు సీట్ బెల్ట్ రిమైండర్‌లను ప్రామాణికంగా చేసింది. వాటిలో చాలా వరకు ESC మరియు హిల్-స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్‌ని స్టాండర్డ్‌గా అమర్చారు. తమ కంపెనీ కార్లలో ‘అందరికీ భద్రత’ అనేదే తమ అత్యంత ప్రాధాన్యత అని హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎండీ కం సీఈఓ ఉన్‌సూ కిమ్ వెల్లడవించారు.పేర్కొన్నారు. వాహన భద్రతా లక్షణాల ప్రామాణీకరణలో బెంచ్‌మార్క్ సృష్టికర్తలుగా ఉన్న తాము ఇపుడిక అన్ని మోడల్స్ అన్ని వేరియంట్‌లలో 6 ఎయిర్‌బ్యాగ్‌ల ప్రామాణీకరణను ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. (మరో వివాదంలో బిగ్ బీ అమితాబ్: ఇంత దారుణమా అంటూ తీవ్ర ఆగ్రహం)
Comments
Please login to add a commentAdd a comment