Standard
-
హైదరాబాద్‌లో స్టాండర్డ్ గ్లాస్ భారీ ప్లాంట్..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా, కెమికల్ పరిశ్రమలకు ప్రత్యేక ఇంజనీరింగ్ పరికరాలను తయారు చేస్తున్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ 10వ ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్ సమీపంలోని బొంతపల్లి వద్ద 36 ఎకరాల్లో ఇది రానుంది. రూ.130 కోట్ల వ్యయంతో తొలి దశ 15 నెలల్లో పూర్తి అవుతుందని కంపెనీ ఎండీ నాగేశ్వర రావు కందుల వెల్లడించారు. 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులోకి వస్తుందని అన్నారు.జనవరి 6న ప్రారంభం అవుతున్న ఐపీవో వివరాలను వెల్లడించేందుకు శనివారమిక్కడ జరిగిన సమావేశంలో కంపెనీ ఈడీ కాట్రగడ్డ మోహన రావు, సీఎఫ్‌వో పాతూరి ఆంజనేయులుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అయిదేళ్లలో అన్ని దశలు పూర్తి చేసుకుని ప్లాంటు మొత్తం 9 లక్షల చదరపు అడుగుల స్థాయికి చేరుతుందని చెప్పారు. ఇందుకు మొత్తం రూ.300 కోట్ల పెట్టుబడి అవసరమని వెల్లడించారు. నతన కేంద్రంలో చమురు, సహజ వాయువు, భారీ పరిశ్రమలు, వంట నూనెల రంగ సంస్థలకు అవసరమైన ఇంజనీరింగ్ పరికరాలను తయారు చేస్తామని నాగేశ్వర రావు వివరించారు.అయిదేళ్లలో ఎగుమతులు సగం..కంపెనీ ఆదాయంలో గత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల వాటా 0.5 శాతమే. 2024–25లో ఇది 15 శాతానికి చేరుతుందని నాగేశ్వర రావు వెల్లడించారు. ‘అయిదేళ్లలో ఎగుమతుల వాటా 50 శాతానికి చేరుస్తాం. యూఎస్‌కు చెందిన ఐపీపీ కంపెనీతో చేతులు కలిపాం.ఆ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 1.5 లక్షలకుపైగా కంపెనీలు క్లయింట్లుగా ఉన్నాయి. ఐపీపీ సహకారంతో ఎగుమతి అవకాశాలను అందిపుచ్చుకుంటాం. అలాగే జపాన్‌కు రెండు నెలల్లో ఎగుమతులు ప్రారంభిస్తున్నాం. కంపెనీ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా 100 బిలియన్ డాలర్ల వ్యాపార అవకాశాలు ఉన్నాయి. అలాగే ఒక్క భారత్ నుంచే రూ.15,000 కోట్లు ఉంటుంది’ అని వివరించారు.ఆర్డర్ బుక్ రూ.450 కోట్లు..ప్రస్తుతం స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ 65 రకాల ఉత్పత్తులను తయారు చేస్తోంది. 15 కొత్త ఉత్పత్తులు అభివృద్ధి దశలో ఉన్నాయని నాగేశ్వర రావు వెల్లడించారు. ‘నెలకు 300 యూనిట్లు తయారు చేసే సామర్థ్యం ఉంది. రెండు నెలల్లో ర.40 కోట్ల మూలధన వ్యయం చేస్తాం. రెండేళ్లలో మరో ర.60 కోట్లు వెచ్చిస్తాం. 2023–24లో ర.549 కోట్ల టర్నోవర్ సాధించాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది ర.700 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నాం. ఏటా టర్నోవర్‌లో 50 శాతం వృద్ధి నమోదు చేస్తున్నాం. ఆర్డర్ బుక్ రూ.450 కోట్లు ఉంది’ అని పేర్కొన్నారు.జనవరి 6న ఐపీవో..స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ ఐపీవో జనవరి 6న ప్రారంభమై 8న ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ ర.123 కోట్లు అందుకుంది. ఒక్కొక్కటి ర.140 చొప్పున 87,86,809 ఈక్విటీ షేర్లను కేటాయించింది. అమన్సా హోల్డింగ్స్, క్లారస్ క్యాపిటల్–1, ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ ఎంఎఫ్, కోటక్ మహీంద్రా ట్రస్టీ కో లిమిటెడ్ ఏ/సీ కోటక్ మాన్యుఫ్యాక్చర్ ఇన్ ఇండియా ఫండ్, టాటా ఎంఎఫ్, మోతిలాల్ ఓస్వాల్ ఎంఎఫ్, 3పీ ఇండియా ఈక్విటీ ఫండ్–1, కోటక్ ఇన్ఫినిటీ ఫండ్–క్లాస్ ఏసీ, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐటీఐ లార్జ్ క్యాప్ ఫండ్ వీటిలో ఉన్నాయి.ఇక ఐపీవోలో భాగంగా ర.210 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేస్తారు. 1,42,89,367 షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద ప్రమోటర్లు విక్రయిస్తారు. షేర్లను బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్ట్ చేస్తారు. ప్రైస్ బ్యాండ్ ర.133–140గా నిర్ణయించారు. ఇన్వెస్టర్లు కనీసం 107 షేర్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. -
పశువులు, కోళ్ల వైద్యానికి ప్రామాణిక మార్గదర్శకాలు
పశువులు, కోళ్ల వైద్యానికి సంబందించి సరికొత్తప్రామాణిక మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రంయాంటీబయాటిక్ తదితర ఔషధాల వినియోగాన్ని తగ్గించటం, దుర్వినియోగాన్ని అరికట్టే ప్రత్యామ్నాయ చికిత్సలపై దృష్టి సంప్రదాయ ఆయుర్వేద చికిత్సా పద్ధతుల (ఈవీఎంల)కు పెద్దపీటఈవీఎంలపైప్రాంతీయ భాషల్లో పుస్తకాలు, వీడియోలు ఉచితంగా అందుబాటులోకి తెచ్చిన ఎన్.డి.డి.బి.దేశంలో పశువులు, కోళ్లకు వచ్చే జబ్బులు, ఇన్ఫెక్షన్లకు అందించేప్రామాణిక చికిత్సా పద్ధతులను నిర్దేశిస్తూ కేంద్ర పశు సంవర్థక, పాడి అభివృద్ధి శాఖ సరికొత్త మార్గదర్శకాలను ఇటీవల విడుదల చేసింది. పాడి ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు తదితర పశువులతో పాటు కోళ్ల చికిత్సకు ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయి. నిర్హేతుకంగా యాంటీబయాటిక్స్ తదితర అల్లోపతి ఔషధాల వినియోగాన్ని కట్టడి చేయటంతో పాటు.. ఆరోగ్యదాయకమైన ప్రత్యామ్నాయ చికిత్సా పద్ధతులను విస్తృతంగా వ్యాప్తిలోకి తెచ్చే లక్ష్యంతో కేంద్రం ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది. ముఖ్యంగా పాడి పశువుల చికిత్సలో చీటికి మాటికి యాంటీబయాటిక్స్‌ను అతిగా వాడటం, దుర్వినియోగం చేయటం వల్ల పాలు, పాల ఉత్పత్తులు, మాంసం, గుడ్లు తదితర ఆహారోత్పత్తుల్లో వాటి అవశేషాలు మోతాదుకు మించి మిగిలి΄ోతున్నాయి.పశువైద్యంలో యాంటీబయాటిక్ మందులను అతిగా వాడటం వల్ల సూక్ష్మజీవులు నిరోధకతను సంతరించుకుంటున్నాయి. ఫలితంగా యాంటీబయాటిక్ ఔషధాలు నిరర్థకంగా మారుతున్నాయి. ఇది ప్రజారోగ్యానికి పైకి కనిపించని పెను ముప్పుగా పరిణమిస్తోంది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ), యుఎస్ఎయిడ్ సంస్థల తోడ్పాటుతో కేంద్ర పశుసంవర్థక మంత్రిత్వ శాఖ 6 నెలల పాటు సుమారు 80 మంది ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని నిపుణులతో చర్చించింది. సరికొత్తప్రామాణిక మార్గదర్శకాలను రూపొందించి ఇటీవలే విడుదల చేసింది. అల్లోపతి ఔషధాలను ఏయే జబ్బులకు ఎంత మోతాదులో వాడాలో మార్గదర్శకాలలో పొందుపరిచారు.ఈవీఎంలకు పెద్ద పీటఅంతేకాకుండా, సంప్రదాయ ఆయుర్వేద చికిత్సా పద్ధతుల (ఎత్నో వెటరినరీ మెడిసిన్ప్రాక్టీసెస్ – ఈవీఎంల)ను, హోమియో వంటి ప్రత్యామ్నాయ చికిత్సా పద్ధతులకు కూడా ప్రభుత్వం ఈ మార్గదర్శకాల్లో పెద్ద పీట వేయటం విశేషం. సంప్రదాయ ఆయుర్వేద పద్ధతుల్లో రైతులే స్వయంగా తయారు చేసుకొని వాడేందుకు వీలుగా ఉండే చికిత్సా పద్ధతులను కూడా పొందుపరిచారు. ఈ రంగంలో 20 ఏళ్లు కృషి చేసిన తమిళనాడుకు చెందిన ఎమిరిటస్ ప్రొఫెసర్ ఎన్. పుణ్యస్వామి 22 రకాల పశువ్యాధులకు రూపొందించిన ఈవీఎం పద్ధతులకు చోటు కల్పించారు. దేశంలో పాడిపై ఆధారపడిన చిన్న, సన్నకారు రైతులకు అతితక్కువ ఖర్చుతో సమకూరే ఈవీఎం చికిత్సా పద్ధతులు ఉపయోగపడతాయని కేంద్ర పశుసంవర్థక శాఖ కార్యదర్శి అల్క ఉపాధ్యాయ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, హోమియో గురించి ప్రస్తావించినప్పటికీ ఈ చికిత్స పద్ధతుల గురించి మార్గదర్శకాల్లో వివరించలేదు. దేశంలోని నలుమూలల్లోని పశు వైద్యులు, వైద్య సిబ్బంది, సంప్రదాయ వైద్యులు, పశు΄ోషకుల అనుభవాలు, సూచనలతో ప్రతి 2–3 ఏళ్లకోసారి ఈ మార్గదర్శకాలను పరిపుష్టం చేయనుండటం మరో విశేషం.సంప్రదాయ ఆయుర్వేద చికిత్సాపద్ధతులు తమిళనాడుకు చెందిన తంజావూరులోని వెటరినరీ యూనివర్సిటీ పరిశోధనా కేంద్రంలో ‘ఎత్నో–వెటరినరీ హెర్బల్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ యూనిట్’ అధిపతిగా పనిచేసిన ఎమిరిటస్ ప్రొఫెసర్ డా.ఎన్. పుణ్యస్వామి, టిడియు ఎమిరిటస్ప్రొఫెసర్ ఎం.ఎన్. బాలకృష్ణన్ నాయర్ పశువ్యాధులకు సంప్రదాయ ఆయుర్వేద చికిత్సా పద్ధతుల (ఎత్నో వెటరినరీ మెడిసిన్ప్రాక్టీసెస్– ఈవీఎంల)పై సుదీర్ఘంగా పరిశోధన చేసి ప్రమాణీకరించారు. ముఖ్యమైన 22 రకాల జబ్బులకు (అల్లోపతి మందులు, యాంటీబయాటిక్స్ వాడవసరం లేకుండా) రైతుల ఇళ్లలో ΄ోపు డబ్బాల్లో ఉండే మసాలా దినుసులు, పెరట్లో ఉండే మొక్కలతో ఆయుర్వేద మందుల్ని రైతులే స్వయంగా తయారు చేసుకొని వాడుకోగలిగే పద్ధతులను పొందుపరచిన ఒక చిరు పుస్తకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలతో పాటు అందుబాటులోకి తెచ్చింది. ఆంగ్లం, హిందీ, తెలుగుతో పాటు 12 భాషల్లో ఈ చిరుపుస్తకాల పీడీఎఫ్‌లను అందుబాటులోకి తెచ్చింది. పశువులకు, ముఖ్యంగా పాడి ఆవులు, గేదెలకు వచ్చే జబ్బులకు ఆయుర్వేద మందులను రైతులు ఇంటి దగ్గరే ఎలా తయారు చేసుకోవాలి? ఎలా వాడాలి? అనేది తెలుగు సహాప్రాంతీయ భాషల్లో రూపొందించిన వీడియోలను జాతీయ పాడి అభివృద్ధి సంస్థ (ఎన్.డి.డి.బి.) యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచారు. ఈ చిరు పుస్తకాల పిడిఎఫ్‌లను, ఆయుర్వేద మందుల తయారీ, వాడే పద్ధతులు తెలిపే వీడియోలను ఉచితంగానే చూడొచ్చు.. డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాంటీబయాటిక్స్, రసాయనిక ఔషధాల అవశేషాల్లేని ఆరోగ్యదాయకమైన పాలు, మాంసం ఉత్పత్తికి దోహదం చేసే మార్గం ఇది. -
హ్యుందాయ్ కీలక నిర్ణయం: తొలి బ్రాండ్‌గా రికార్డ్
దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం, దేశంలోని మూడో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఇకపై తమ కార్లు అన్నింటిలోనూ ఆర్ ఎయిర్ బ్యాగులను ప్రామాణింగా అందించనున్నట్టు మంగళవారం వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన భారత్ NCAP మార్గదర్శకాల ప్రకారంఈ రేటింగ్స్‌లోనూ స్వచ్ఛందంగా పాల్గొనాలని నిర్ణయించినట్లు పేర్కొంది. భారతదేశంలో బ్రాండ్ అందించే అన్ని కార్లు, ఎస్‌యూవీల్లో ఇక 6 ఎయిర్‌బ్యాగ్‌లను ప్రామాణికంగా ఉంటాయి. తద్వారా హ్యుందాయ్ తమ అన్ని కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను అందించనున్న దేశంలో తొలి బ్రాండ్‌గా అవతరించింది హ్యుందాయ్ ఇండియా కూడా భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ (BNCAP) ద్వారా క్రాష్ టెస్టింగ్ కోసం తమ మూడు కార్లను స్వచ్ఛందంగా అందిస్తున్నట్లు ప్రకటించింది. (2023 ఐసీసీ వరల్డ్ కప్: ప్రకటనల ఆదాయం ఎంతో తెలుసా?) హ్యుందాయ్ ఉత్పత్తి పోర్ట్‌ఫోలియో 13 విభిన్న మోడళ్లను కలిగి ఉంది. వాటిలో చాలా వరకు ఇప్పటికే ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను అమర్చారు. ఈ సేఫ్టీ ఫీచర్ గ్రాండ్ i10 నియోస్, ఆరా , వెన్యూ సబ్-4 మీటర్ SUVలతో సహా మిగిలిన మూడు మోడళ్లలో అందుబాటులో ఉంది. (ఐటీ దిగ్గజాల కీలక నిర్ణయం: ఆందోళనలో టెకీలు ) ఇంతకుముందు, హ్యుందాయ్ అన్ని మోడళ్లలో అన్ని సీట్లకు 3-పాయింట్ సీట్ బెల్ట్‌లు మరియు సీట్ బెల్ట్ రిమైండర్లను ప్రామాణికంగా చేసింది. వాటిలో చాలా వరకు ESC మరియు హిల్-స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్‌ని స్టాండర్డ్‌గా అమర్చారు. తమ కంపెనీ కార్లలో ‘అందరికీ భద్రత’ అనేదే తమ అత్యంత ప్రాధాన్యత అని హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎండీ కం సీఈఓ ఉన్సూ కిమ్ వెల్లడవించారు.పేర్కొన్నారు. వాహన భద్రతా లక్షణాల ప్రామాణీకరణలో బెంచ్‌మార్క్ సృష్టికర్తలుగా ఉన్న తాము ఇపుడిక అన్ని మోడల్స్ అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌ల ప్రామాణీకరణను ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. (మరో వివాదంలో బిగ్ బీ అమితాబ్: ఇంత దారుణమా అంటూ తీవ్ర ఆగ్రహం) -
బయోడీగ్రేడబుల్ ప్లేట్లు, కప్పులు వాటితోనే చేయాలి: బీఐఎస్
న్యూఢిల్లీ: బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) బయోడీగ్రేడబుల్ (మట్టిలో కలిసిపోయే) ఆహార పాత్రలకు నాణ్యత ప్రమాణాలను విడుదల చేసింది. ఇటువంటి ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. ప్లేట్లు, కప్పులు, గిన్నెలు, ఇతర పాత్రలను తయారు చేయడానికి ఆకులు, తొడుగులు వంటి వ్యవసాయ ఉప ఉత్పత్తులను మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. ముడి పదార్థాలు, తయారీ పద్ధతులు, పనితీరు, పరిశుభ్రత వంటి అంశాలను ప్రామాణికంగా చేసుకుని ఐఎస్ 18267: 2023 ధ్రువీకరణను బీఐఎస్ జారీ చేస్తుంది. హాట్ ప్రెస్సింగ్, కోల్డ్ ప్రెస్సింగ్, మౌల్డింగ్, స్టిచింగ్ వంటి తయారీ సాంకేతికతలను సైతం బ్యూరో నిర్ధేశిస్తుంది. -
అగ్ని ప్రమాదాలకు మూడు ప్రామాణిక పాలసీలు
సాక్షి, న్యూఢిల్లీ: అగ్ని ప్రమాదాలు, వాటి కారణంగా ఏర్పడే ఇతర ప్రమాదాల నష్టాన్ని భర్తీ చేసే ప్రామాణిక బీమా పాలసీలను కనీసం మూడింటిని ప్రవేశపెట్టాలని అన్ని సాధారణ బీమా సంస్థలను ఐఆర్డీఏఐ ఆదేశించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ‘స్టాండర్డ్ ఫైర్ అండ్ స్పెషల్ పెరిల్స్’(ఎస్ఎఫ్ఎస్పీ) స్థానంలో.. ‘భారత్ గృహ రక్ష’, భారత్ సూక్ష్మ ఉద్యమ్ సురక్ష, భారత్ లఘు ఉద్యమ్ సురక్ష పాలసీలను ప్రవేశపెట్టాలని ఐఆర్డీఏఐ(బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ) తన ఆదేశాల్లో పేర్కొంది. ఏప్రిల్ 1 నుంచి సాధారణ బీమా సంస్థలు వీటిని తప్పకుండా ఆఫర్ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఐఆర్డీఏఐ జనవరి 4న మార్గదర్శకాలను జారీ చేసింది. దీనికి ప్రకారం ఇల్లు, ఇంట్లోని వస్తువుల కవరేజీకి ఉద్దేశించినది భారత్ గృహ రక్ష పాలసీ. ఇంటితో పాటు ఇంట్లో వస్తువులకూ ఆటోమేటిక్‌గా బీమాలో 20 శాతం కవరేజీ (గరిష్టంగా రూ.10 లక్షలు) లభిస్తుంది. ఇంతకుమించి విలువైన వస్తువులు ఇంట్లో ఉంటే వాటిని ప్రపోజల్ పత్రంలో పేర్కొనడం ద్వారా మరింత కవరేజీని పొందొచ్చు. ఉదాహరణకు, మీరు మీ సాధారణ ఇంటి విషయాలలో దేనినైనా (ఫ్రిజ్, టెలివిజన్, వాషింగ్ మెషీన్ వంటివి) 50 వేలకు బీమా చేసినట్లయితే, అసలు విలువ లక్ష అయితే, పాలసీ మొత్తం బీమా మొత్తాన్ని అంటే 50వేలను చెల్లిస్తుంది ( 50,000). భారత్ సూక్ష్మ ఉద్యమ్ సురక్ష అన్నది సంస్థల కోసం ప్రత్యేకించినది. రూ.5 కోట్ల వరకు రిస్క్ కవర్‌ను ఇందులో భాగంగా ఆఫర్ చేయాల్సి ఉంటుంది. భారత్ లఘు ఉద్యమ్ సురక్ష పాలసీ.. రూ.5 కోట్లకు మించి రూ.50 కోట్ల వరకు సంస్థల కోసం బీమా కవరేజీని ఆఫర్ చేస్తుంది. -
8న చంద్రబాబు ప్రమాణం
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వచ్చే నెల 8న ప్రమాణం చేయనున్నారు. ఆదివారం దశమి రోజు శుభప్రదమన్న పండితుల సూచనతో చంద్రబాబు సరేనన్నట్లు సమాచారం. ఆ రోజు సాయంత్రం ముఖ్యమంత్రిగా చంద్రబాబు, కొందరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. విజయవాడ-గుంటూరు మధ్యన ఉన్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాల0యానికి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో అందుకు ఏర్పాట్లు చేయనున్నారు. గుంటూరు-తాడికొండ మార్గంలో ఉన్న ఈ స్థలాన్ని పార్టీ నేతలు పరిశీలించినా వాహనాల రాకపోకలకు అంత అనుకూలంగా లేదు. దీంతో జాతీయ రహదారి పక్కన ఉన్న స్థలాన్నే ఎంపిక చేశారు. మరోవైపు పార్టీ పూజాధికాలను పర్యవేక్షించే ఆచార్య పొన్నలూరి శ్రీనివాస గార్గేయ సిద్ధాంతి ఆదివారం టీడీపీ రాష్ట్ర కార్యాలయ సమన్వయ కార్యదర్శి టీడీ జనార్ధనరావుతో సమావేశమయ్యారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార సమయం గురించి చర్చించారు. ఒకవేళ జూన్ 8న వీలుకాని పక్షంలో మర్నాడు 9వ తేదీ కూడా మంచిరోజే కావడంతో అప్పుడైనా ప్రమాణం చేయవచ్చని చర్చించినట్లు తెలిసింది. విద్యుత్ ఉద్యోగులు సమ్మె విరమించాలి: చంద్రబాబు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా విద్యుత్ ఉద్యోగులు సమ్మె విరమించాలని చంద్రబాబు విజ్ఙప్తి చేశారు. ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి తాము సానుకూలంగా ఉన్నామన్నారు. ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య పరస్పర సహకారం, సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. మహానాడులో ఐదు తీర్మానాలు టీడీపీ మహానాడులో 5 తీర్మానాలు చేయనున్నట్టు పార్టీ కార్యాలయ సమన్వయ కార్యదర్శి టీడీ జనార్దనరావు తెలిపారు. స్థానిక ఎన్టీఆర్ భవన్లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ విజయాన్ని తెలుగుజాతి, కార్యకర్తలకు అంకితం చేయడం, అవినీతి రహిత భారత్ నిర్మాణం, పేదరికం లేని సమాజం, ఎన్టీఆర్ కలలు, బాబు ఆశయం, సంస్థాగత విషయాలు, టీడీపీ విదేశాంగ విధానంపై తీర్మానాలు చేయనున్నట్టు వివరించారు. మహానాడుకు ప్రతి నియోజకవర్గం నుంచి 60 మంది ప్రతినిధులను ఆహ్వానిస్తామని చెప్పారు. ఈ నెల 27న ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే మహానాడు 28 సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. మహానాడులో తెలుగు రక్షణ వేదిక ఆధ్వర్యంలో ఆరుగురు సాహితీవేత్తలకు పురస్కారాలు అందించనున్నారు. -
భారత్ బలహీనతలన్నీ ఇప్పటికే పరిగణలోకి..
న్యూఢిల్లీ: భారత్ బలహీన ఆర్థిక పరిస్థితులన్నీ ప్రస్తుత రేటింగ్స్‌కు అనుగుణంగానే ఉన్నాయని రేటింగ్ దిగ్గజ సంస్థలు స్టాండెర్డ్ అండ్ పూర్స్ (ఎస్అండ్పీ), మూడీస్ మంగళవారం పేర్కొన్నాయి. పలు అంశాలు ఇప్పటికే ‘డిస్కౌంటయిన’ నేపథ్యంలో ప్రస్తుత ఔట్‌లుక్‌లలో ఎటువంటి మార్పులూ చేయబోవడం లేదని సైతం స్పష్టం చేశాయి. బీబీబీ కొనసాగింపు: ఎస్ అండ్ పీ భారత్ రేటింగ్స్‌పై నెగిటివ్ ఔట్లుక్- ‘బీబీబీ-’ సావరిన్ క్రెటిగ్ రేటింగ్స్‌ను కొనసాగిస్తున్నట్లు ఎస్అండ్పీ సీనియర్ డెరైక్టర్ (సావరిన్ అండ్ ఇంటర్నేషనల్ పబ్లిక్ ఫైనాన్స్ రేటింగ్స్-ఆసియా,పసిఫిక్) కిమ్ ఇంగ్ టెన్ ఒక ఈ-మెయిల్ ప్రకటనలో పేర్కొన్నారు. క్యాపిటల్ ఔట్‌ఫ్లోస్, రూపాయి తీవ్ర బలహీనత పెట్టుబడుదారు విశ్వాసంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని పేర్కొంది. క్యాపిటల్ ఔట్‌ఫ్లోస్‌ను నిరోధిస్తూ, ప్రభుత్వం ఇటీవల తీసుకున్న చర్యలు అటు దేశీయంగా ఇటు అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లను అయోమయంలో పడేస్తాయని కిమ్ పేర్కొన్నారు. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే పెట్టుబడులు మరింత క్షీణిస్తాయని విశ్లేషించారు. బీఏఏ3 రేటింగ్: మూడీస్ తమ రేటింగ్ ఔట్లుక్ ‘బీఏఏ3’పై రూపాయి బలహీనత ప్రభావం ఏదీ ఉండబోదని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ పేర్కొంది. రూపాయి బలహీనత, ద్రవ్యలోటు, కరెంట్ అకౌంట్ లోటు, బలహీన వృద్ధి... ప్రస్తుతం తామ సావరిన్ రేటింగ్‌కు ఇప్పటికే ఫ్యాక్టరింగ్ అయిన అంశాలని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ వైస్-ప్రెసిడెంట్ అండ్ సీనియర్ క్రెడిట్ ఆఫీసర్ అత్సీ సేథ్ ఒక పత్రంలో పేర్కొన్నారు. నిర్ణయాలపై భవిష్యత్ స్పందనల ప్రకారం తమ తదుపరి రేటింగ్ పరిశీలన ఆధారపడి ఉంటుందని అన్నారు.