ముగిసిన జన్మభూమి–మా ఊరు
Published Thu, Jan 12 2017 12:05 AM | Last Updated on Tue, Sep 5 2017 1:01 AM
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో నాల్గో విడత జన్మభూమి– మా ఊరు కార్యక్రమం బుధవారంతో ముగిసింది. ఈ నెల 2న ప్రారంభమైన ఈ కార్యక్రమం 10 రోజుల పాటు జరిగింది. జిల్లాలో 897 గ్రామ పంచాయతీలు, 270 మున్సిపల్ వార్డులు మొత్తంగా 1167 జన్మభూమి సభలు జరిగాయి. గత ఏడాది జన్మభూమి కార్యక్రమంతో పోలిస్తే ఈ సారి వినతులు తగ్గిపోయాయి. మంగళవారం నాటికి గ్రామీణ ప్రాంతాల్లో వివిధ సమస్యలపై 34,627, పట్టణ ప్రాంతాల్లో 8979 ధరఖాస్తులు వచ్చాయి.
Advertisement
Advertisement