గ్రామీణ విద్యకు వాయిస్‌ టెక్నాలజీ దన్ను | voice technology enhances rural education | Sakshi
Sakshi News home page

గ్రామీణ విద్యకు వాయిస్‌ టెక్నాలజీ దన్ను

Published Sun, Sep 1 2024 7:44 AM | Last Updated on Sun, Sep 1 2024 7:44 AM

voice technology enhances rural education

న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో విద్యాబోధనలో వాయిస్‌ టెక్నాలజీ కీలక పాత్ర పోషించగలదని అమెజాన్‌ ఇండియా డైరెక్టర్‌ (అలెక్సా) ఆర్‌ఎస్‌ దిలీప్‌ తెలిపారు. అయితే, ఇప్పటికీ దీని ఉపయోగం గురించి చాలా మందికి తెలియదని, ఈ నేపథ్యంలోనే అవగాహన కల్పన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

నాగాలాండ్‌లోని కొన్ని ప్రభుత్వ పాఠశాల్లో అలెక్సా ఎనేబుల్డ్‌ ఎకో స్మార్ట్‌ స్పీకర్లను ఉపయోగిస్తుండటమనేది వాయిస్‌ టెక్నాలజీ వల్ల చేకూరే ప్రయోజనాలను తెలుసుకునేందుకు తోడ్పడగలదని చెప్పారు. చదువుపై విద్యార్థుల్లో ఆసక్తి పెరగడానికి కూడా ఈ సాంకేతికత దోహదపడుతోందని దిలీప్‌ పేర్కొన్నారు. వాయిస్‌ టెక్నాలజీ మెరుగుపడే కొద్దీ విద్యారంగంలో మరిన్ని వినూత్న సాధనాలు అందుబాటులోకి రాగలవని, గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభ్యాసం రూపురేఖలు మార్చగలవని ఆయన చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement