ముంబై: చిన్న పట్టణాలు, గ్రామాల్లో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే లక్ష్యంతో.. పేమెంట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ (పీఐడీఎఫ్) పథకం కింద సెప్టెంబర్ నాటికి 2.46 లక్షల డివైస్‌లు అందుబాటులోకి వచ్చాయని ఆర్‌బీఐ తెలిపింది. వీటిలో పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్), మొబైల్ పీవోఎస్, జనరల్ పాకెట్ రేడియో సర్వీస్, పబ్లిక్ స్విచ్డ్ టెలిఫోన్ నెట్‌వర్క్ ఉన్నాయని వివరించింది.
పీఐడీఎఫ్ పథకం కింద యూపీఐ క్యూఆర్, భారత్ క్యూఆర్‌తోసహా 55,36,678 డిజిటల్ పరికరాలు ఏర్పాటయ్యాయి. పథకంలో భాగంగా విక్రేతలకు అధీకృత కార్డ్ నెట్‌వర్క్స్, బ్యాంక్‌లు సబ్సిడీతో పరికరాలను మంజూరు చేస్తాయి. ఈ స్కీమ్ కోసం ప్రస్తుతం రూ.614 కోట్ల నిధి ఉందని ఆర్‌బీఐ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment