మారుమూల ప్రాంతాల్లోనూ రిటైలర్లు, ఇతర కస్టమర్లకు కరెంటు, పొదుపు ఖాతాలను తెరిచే దిశగా ప్రైవేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్, డిజిటల్ సర్వీస్ నెట్‌వర్క్ పేనియర్‌బై జట్టు కట్టాయి. ఆధార్ ఆధారిత ఈ–కేవైసీ విధానంతో స్థానిక దుకాణాల ద్వారా కూడా సులువుగా ఖాతాల ను తెరిచేందుకు ఈ ఒప్పందం తోడ్పడగలదని యాక్సిస్ బ్యాంక్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ మునీష్ షర్డా తెలిపారు.
గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లోని వారు ఆర్థిక సర్వీసుల కోసం ప్రత్యేకంగా బ్యాంకు శాఖలకు వెళ్లాల్సిన అవసరం ఉండని రీతిలో ఈ విధానాన్ని తీర్చిదిద్దినట్లు వివరించారు. ఖాతాను తెరిచేందుకు పలు పత్రాలు సమర్పించడం, సుదీర్ఘ ప్రక్రియలాంటి బాదరబందీ ఉండదని పేనియర్‌బై వ్యవస్థాపకులు ఆనంద్ కుమార్ బజాజ్ తెలిపారు. తమతో జట్టు కట్టిన స్థానిక చిన్న, మధ్య తరహా సంస్థలకు ఇకపై యాక్సిస్ బ్యాంక్ సేవలు కూడా అందుబాటులోకి వస్తాయని, వారు తమ వ్యాపార లావాదేవీలను సమర్ధమంతంగా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
చదవండి: జనవరిలో మహీంద్రా తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. మరో రికార్డ్ క్రియేట్ చేస్తుందా!
Comments
Please login to add a commentAdd a comment