
నారాయణఖేడ్/న్యాల్‌కల్: ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 31న హైదరాబాద్‌లో ‘కొలువుల కొట్లాట’ సభ నిర్వహించనున్నట్లు టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండల పరిధి లోని మామిడ్గి గ్రామ శివారులో సోమవారం నిర్వహించిన నిమ్స్ భూ నిర్వాసితుల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
డీఎస్సీ ప్రకటన వెలువ డక ఎదురుచూసి అనా రోగ్యంతో మరణించిన నారాయణఖేడ్‌కు చెందిన రామకృష్ణ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. ఉద్యోగ ప్రకటనల కోసం ఎదురుచూసి విసిగి వేసారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల క్యాలెం డర్‌ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. లోకల్ రిజర్వేషన్ అంశాన్ని తాత్సారం చేయకుండా పరిష్కరించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment