Kodada Ram
-
ఇది ప్రజాస్వామ్య వైఫల్యం
హైదరాబాద్: పరిపాలన ప్రజలకు అర్థం కాకపోవటం అంటే అది ప్రజాస్వామ్య వైఫల్యమేనని లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ అన్నారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ లోక్ సత్తా పార్టీ ఆధ్వర్యంలో ‘స్థానిక ప్రభుత్వాలు– సాధికారత, ఆవశ్యకత’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. సామాన్య ప్రజలకు విద్య అందటం లేదంటే సిగ్గుతో తలదించుకోవాలని విమర్శించారు. ఇన్నాళ్ల ప్రజాస్వామ్యంలో పిల్లలకు చదువు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 40 వేల కోట్లు పాఠశాల విద్యకు ఖర్చు అవుతున్నా నూటికి 60 శాతం మందికి చదువు రావటం లేదన్నారు. స్థానిక నాయకత్వ లోపం వల్లనే మెరుగైన విద్య అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో నామమాత్రంగా విద్యకు ఖర్చు చేసినప్పుడే మెరుగైన ఫలితాలు వచ్చాయని, ఇప్పుడు కోట్లు ఖర్చు చేసినా ఫలితాలు లేవన్నారు. ఇన్ని అనర్థాలకు మూలం అధికారాన్ని ప్రజలకు దూరం చేయటమేనన్నారు. మనుషులు మారుతున్నారే తప్ప పాలన మారటం లేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం వేల కోట్ల మిగులు తో ఏర్పడినప్పటికీ ఇప్పుడు ఏమీ లేదని, వృథా ఖర్చులు పెరగటం వల్లనే అప్పుల పాలవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, లోక్‌సత్తా పార్టీ కన్వీనర్ తుమ్మనపల్లి శ్రీనివాసు, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, కటారి శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
అధికారులు, గ్లోబరీనాను కాపాడేందుకే: కోదండరాం
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫలితాల గందరగోళం నేపథ్యంలో చోటుచేసుకున్న విద్యార్థుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలుగానే భావించాల్సి ఉంటుందని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ.కోదండరాం అన్నారు. ప్రభుత్వ బాధ్యతారాహిత్యం కారణంగానే ఆత్మహత్యలు జరిగాయని ధ్వజమెత్తారు. బోర్డు అధికారులు, గ్లోబరీనాను కాపాడటానికే ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌కు ఇతర రాష్ట్రాల పర్యటనలపై ఉన్న శ్రద్ధ విద్యార్థులపై లేదన్నారు. శుక్రవారం మఖ్దూంభవన్‌లో ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరవధిక దీక్షా శిబిరాన్ని సందర్శించి.. విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వం, అధికార పార్టీలోని ఒక్క ప్రజాప్రతినిధి అయినా ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను పరామర్శించారా అని ప్రశ్నించారు. ఉచితంగా రీవెరిఫికేషన్, రీ కౌంటింగ్ పేరుతో ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూస్తోందని మండిపడ్డారు. -
ఆవిర్భావ ఉత్సవాలు భారీగా వద్దు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జనసమితి (టీజేఎస్) ఆవిర్భావ ఉత్సవాలను భారీగా నిర్వహించకుండా స్థానికంగా ఎక్కడికక్కడ పార్టీ జెండాలు ఎగురవేయాలని నాయకులు, కార్యకర్తలకు ఆ పార్టీ అధ్యక్షుడు ప్రొ.కోదండరాం విజ్ఞప్తి చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్‌లో రాష్ట్రస్థాయిలో భారీ ప్లీనరీ నిర్వహించాలని పార్టీ నిర్ణయించిందని శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. పార్టీ ఆవిర్భవించి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ నెల 29న ఆవిర్భావ ఉత్సవాలను నిర్వహించాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించినా.. రాష్ట్రంలో ఇంటర్ విద్య సంక్షోభం, విద్యార్థుల ఆత్మహత్యలు, విద్యార్థుల పోరాటాలు, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వాటిని భారీగా నిర్వహించవద్దని కోరారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరకపోగా రాష్ట్రాన్ని ఒక కుటుంబం గుత్తసొత్తుగా మార్చుకున్న నేపథ్యంలో ఉద్యమ ఆకాంక్షను నెరవేర్చేందుకు టీజేఎస్ పార్టీ ఆవిర్భవించిందన్నారు. ఈ ఏడాది కాలంలో ప్రజా సమస్యలపై, ప్రధానంగా రైతాంగ సమస్యలపై టీజేఎస్ నిర్వహించిన పోరాటాలతో ప్రజలకు పార్టీ పట్ల నమ్మకం, విశ్వాసం పెరిగాయని కోదండరాం పేర్కొన్నారు. ఈ నెల 29న అఖిలపక్షం పిలుపు మేరకు ఇంటర్ బోర్డు ఎదుట నిర్వహించనున్న ధర్నాలో సంఘీభావం తెలియజేయాలని టీజేఎస్ అధికార ప్రతినిధి, మీడియా రాష్ట్ర కో ఆర్డినేటర్ వెదిరె యోగేశ్వర్‌రెడ్డి ఓ ప్రకటనలో కోరారు. కిషన్‌రెడ్డికి టీజేఎస్ నేతల పరామర్శ... బీజేపీ నేత కిషన్‌రెడ్డిని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, ఇతర నాయకులు పరామర్శించారు. శనివారం రంగారెడ్డి జిల్లాలోని కిషన్‌రెడ్డి స్వగ్రామం తిమ్మాపూర్‌లో ఆయనను కలిసి తమ సంతాపాన్ని తెలియచేశారు. -
పోటీ చేయాలా? వద్దా?
సాక్షి, హైదరాబాద్: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అనే అంశంపై టీజేఎస్ పార్టీ తర్జనభర్జన పడుతోంది. మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు తమకు సహకరించాలంటూ పార్టీ అధ్యక్షుడు కోదండరాంను సంప్రదిస్తుండటంతో ఆలోచనల్లో పడింది. తొలుత 4 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించిన టీజేఎస్.. ఆ స్థానాలు మిన హా మిగతా చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతివ్వాలని నిర్ణయించింది. అయితే తాము పోటీ చేయా లనుకున్న మల్కాజిగిరి, కరీంనగర్, నిజామాబాద్ వంటి స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. మల్కాజిగిరి నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో దిగుతున్న రేవంత్‌రెడ్డి ఈ ఎన్నికల్లో తనకు సహకరించాలని కోదండరాంను కోరారు. ఇక బుధవారం మరో నేత మధుయాష్కీ కూడా కోదండరాంను కలి సి మద్దతు కోరారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పోటీ చేస్తున్న స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టడం అవసరమా? అని పార్టీ వర్గాలు యోచిస్తున్నాయి. ఒకటి, రెండు రోజుల్లో నిర్ణయం.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి సంబంధించి ఒకటి, రెండు రోజుల్లో పార్టీ కోర్ కమిటీ సమావేశం నిర్వహించి, తుది నిర్ణయం తీసుకోవాలని టీజేఎస్ భావి స్తోంది. పోటీలో ఉంటే ఏయే స్థానాల్లో పోటీ చేయాలి? పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండాలన్న అంశాలపై ఈ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం ప్రకటించాలని భావిస్తున్నట్లు టీజేఎస్ ముఖ్య నేత ఒకరు వెల్లడించారు. -
నాలుగు స్థానాల్లో టీజేఎస్ పోటీ
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ జన సమితి (టీజేఎస్) నాలుగు స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. అందులో మూడు స్థానాలను టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఖరారు చేశారు. కరీంనగర్, నిజామాబాద్, మల్కాజిగిరి స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించామని, మరొక స్థానాన్ని ఖరారు చేయాల్సి ఉందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఆసిఫాబాద్ లేదా భువనగిరిలో పోటీ చేసే అంశాలను టీజేఎస్ పరిశీలిస్తోంది. ఒకటీ రెండు రోజుల్లో ఆ రెండింటిలో ఏదో ఒక స్థానంలో పోటీ చేసే విషయాన్ని పార్టీ ప్రకటించనుంది. మరోవైపు తాము పోటీలో లేని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు బయటినుంచి మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటివరకు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ పార్టీ శ్రేణులు ఒత్తిడితో పోటీలో ఉండాల్సి వస్తే కరీంనగర్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికైతే ఆ స్థానం నుంచి జగ్గారెడ్డిని పోటీలో నిలిపేందుకు పార్టీ నిర్ణయించినట్లు తెలిసింది. నిజామాబాద్ నుంచి గోపాలశర్మ, మల్కాజిగిరి నుంచి కపిలవాయి దిలీప్‌కుమార్‌ను పోటీలో నిలిపే అంశాలను పార్టీ పరిశీలిస్తోంది. ఒకటీ రెండు రోజుల్లో అధికారికంగా అభ్యర్థులను ప్రకటించనుంది. ఎన్నికల ప్రచారం కోసం మూడు కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో మానిటరింగ్, ఎలక్షన్ అండ్ పొలిటికల్ ఎఫైర్స్, క్రమశిక్షణ కమిటీలను ఏర్పాటు చేసింది. ఆ కమిటీల నేతృ త్వంలో ప్రచారం వేగవంతం చేసి పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని నిర్ణయించింది. భవిష్యత్ లక్ష్యాల సాధన కోసమే పోటీ ఈ ఎన్నికల్లో టీజేఎస్ సొంతంగా నాలుగు స్థానాల్లో పోటీ చేస్తుందని, పోటీలో ఉంటేనే భవిష్యత్తులో తాము అనుకున్న లక్ష్యాలను సాధిస్తామన్న ఉద్దేశంలో పోటీలో ఉంటామని కోదండరాం తెలిపారు. ఈ ఎన్నికల కోసం కొత్తగా మేనిఫెస్టోను రూపొందించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. గత ఎన్నికల మేనిఫెస్టో కలిపి రీక్లెయిమింగ్ రిపబ్లిక్ పేరుతో కొత్త మేనిఫెస్టోను ఒకటీ రెండు రోజుల్లో ప్రకటిస్తామన్నారు. పార్టీ నిర్మాణానికి దోహదపడే చోటనే తమ అభ్యర్థులను పోటీలో నిలపాలని నిర్ణయించామన్నారు. ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం యాత్ర నిర్వహిస్తామని, ఈనెల 16,17 తేదీల్లో భద్రాచలం నుంచి మేడారం వరకు ఆదివాసీ హక్కుల రక్షణ యాత్ర చేపడతామని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నాయని, ప్రజల హక్కులకు రక్షణలేకుండా పోయిందన్నారు. లోక్ సభ ఎన్నికల్లో పొత్తులపై చర్చలు జరగలేదన్నారు. జాతీయ స్థాయిలో ఎవరితో వెళ్లాలన్న దానిపై తమ ప్రణాళికలు తమకు ఉన్నాయన్నారు. ఈ సమావేశంలో టీజేఎస్ నేతలు దిలీప్‌కుమార్, యోగేశ్వర్‌రెడ్డి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
గిట్టుబాటు ధరకోసం ఉద్యమిస్తాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కోసం ఉద్యమిస్తామని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు కోదండరాం పేర్కొన్నారు. పసుపునకు క్వింటాలుకు రూ.15 వేలు, ఎర్రజొన్నలకు క్వింటాలుకు రూ.3500 మద్ధతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. టీజేఎస్ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లోని రైతుల డిమాండ్ మేరకు పసుపు, ఎర్రజొన్న పంటలకు ధరలు పెంచి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 16న రైతులు తలపెట్టిన ఆందోళనకు తాము మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వర్షాలు కారణంగా పత్తి, మిర్చి, కందులు, జొన్న రైతులు దెబ్బతిన్నారన్నారు. రాష్ట్రంలో మంత్రివర్గం లేకపోవడంతో సమస్యలు నివేదించే పరిస్థితి లేదని చెప్పారు. పంటకు గిట్టుబాటు ధర కోరితే ప్రభుత్వం దాడులు చేస్తోందని మండిపడ్డారు. ఉగ్రవాదుల దాడిలో అమరులైన జవాన్లకు నివాళులర్పించారు. టీజేఎస్ రాష్ట్ర నాయకులు విశ్వేశ్వర్రావు మాట్లాడుతూ రైతుల సమస్యలపై గ్రామాలకు వెళ్లి అధ్యయనం చేస్తామన్నారు. ఆ నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. -
31న ‘కొలువుల కొట్లాట’ సభ: కోదండరాం
నారాయణఖేడ్/న్యాల్కల్: ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 31న హైదరాబాద్‌లో ‘కొలువుల కొట్లాట’ సభ నిర్వహించనున్నట్లు టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల పరిధి లోని మామిడ్గి గ్రామ శివారులో సోమవారం నిర్వహించిన నిమ్స్ భూ నిర్వాసితుల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. డీఎస్సీ ప్రకటన వెలువ డక ఎదురుచూసి అనా రోగ్యంతో మరణించిన నారాయణఖేడ్‌కు చెందిన రామకృష్ణ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. ఉద్యోగ ప్రకటనల కోసం ఎదురుచూసి విసిగి వేసారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల క్యాలెం డర్‌ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. లోకల్ రిజర్వేషన్ అంశాన్ని తాత్సారం చేయకుండా పరిష్కరించాలన్నారు. -
ఇలాంటి తెలంగాణ చూస్తామనుకోలేదు
► జేఏసీ చర్చాగోష్టిలో కోదండరాం ► నిర్బంధాలపై ప్రతిఘటించాలని నేతల నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ అణచివేత పెరిగిపోతోందని.. ఇలాంటి నిర్బంధాల తెలంగాణను చూస్తామనుకోలేదని టీజేఏసీ చైర్మన్ ప్రొఫె సర్ ఎం.కోదండరాం అన్నారు. ‘సభలు, సమావేశా లు జరుపుకొనే హక్కు–ప్రభుత్వ ఆంక్షలు’ అనే అంశంపై శనివారం తెలంగాణ జేఏసీ హైదరా బాద్‌లో చర్చాగోష్టి నిర్వహించింది. కోదండరాం మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో రాజ్యాంగ విలువలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాస్వామ్యం ఉంటేనే సమాజం నిలబడుతుందన్నారు. తెలంగాణకోసం ఆత్మహత్య చేసుకున్న ప్రతీ విద్యార్థి సూసైడ్ నోట్లో తమ ఆకాంక్షలు రాశారని, అమరవీరుల ఆకాంక్షలను అమలుచేయాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నామని అన్నారు. నేరెళ్లలో అన్యాయాన్ని ప్రశ్నించిన దళితులను పోలీసులు అమానవీయంగా, అప్రజా స్వామికంగా కొట్టారని విమర్శించారు. దీనిపై నేరెళ్లలో సభకు అనుమతి ఇస్తే కొంపలు మునుగు తాయా అని కోదండరాం ప్రశ్నించారు. 144 , 38,151 సెక్షన్లను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోం దని విమర్శించారు. ఈ సెక్షన్లను ఉపయోగించు కుని శాంతియుతంగా, ప్రజాస్వామికంగా సభలు పెట్టుకునే హక్కును కూడా ప్రభుత్వం హరిస్తోందన్నారు. ఇలాంటి దుస్థితి ఊహించలేదు: సంపత్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వస్తే ఇలాంటి సభలు, సమావే శాలు జరుపుకోలేని దుస్థితి వస్తుందని ఏ తెలంగాణ వాదీ ఊహించలేదన్నారు. అసెంబ్లీలో మంత్రులు, ఎమ్మెల్యేలు నోరువిప్పలేని దుస్థితిలో ఉన్నారని అన్నారు. తమ గురించి మాట్లాడాలని టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులే అడుగుతున్నారని వెల్లడించారు. ప్రజలకోసం పనిచేసే న్యాయవా దులు, ఉద్యమ కారులపై పోలీసుల దాడులు టీఆర్ఎస్ అనుస రిస్తున్న అప్రజాస్వామిక చర్యలకు పరాకాష్ట అని సంపత్ విమర్శించారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో నేరెళ్ల ఘటన, ప్రభుత్వ నిర్బంధాలపై నిలదీస్తామని అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ పోలీసులు కేవలం సీఎం కేసీఆర్ కోసమే పని చేయవద్దని కోరారు. చట్టాలను ఉల్లంఘిస్తే పోలీసులు కూడా బాధ్యత వహిం చాల్సి వస్తుందని హెచ్చరించారు. కామారెడ్డిలో జేఏసీ సమావేశం కోసం ఏర్పాటు చేసిన టెంట్లను పడగొట్టిన టీఆర్ఎస్ నేతలు, కార్య కర్తలపై పోలీసులు ఎందుకు కేసులు పెట్టలేదని ప్రశ్నించారు. బీజేపీ నేత మనోహర్‌రెడ్డి మాట్లాడు తూ ఆంక్షలు, నిర్బంధాలపై జాతీయస్థాయిలో పోరాడుదామని అన్నారు. న్యూ డెమొక్రసీ నేత గోవర్ధన్, ప్రొఫెసర్లు విశ్వేశ్వర్రావు, పురుషోత్తం, న్యాయవాదులు రచనారెడ్డి, గోపాలశర్మ ప్రసంగిం చారు. నిర్బంధాలపై పోరాడుతామని వారు అన్నారు. జేఏసీ నేతలు దరువు ఎల్లన్న, మాదు సత్యం తదితరులు పాల్గొన్నారు. -
భయపెట్టి భూములు సేకరిస్తారా?
టీజేఏసీ చైర్మన్ కోదండరాం సాక్షి, హైదరాబాద్: ప్రాజెక్టులు కట్టడానికి భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం, పునరావాసం కల్పించకుండా రైతులను భయపెట్టి భూములను సేకరిస్తారా అని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం ప్రశ్నించారు. టీజేఏసీ నేతల అక్రమ అరెస్టులను సోమవారం ఇక్కడ జరిగిన జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం ఖం డించింది. అనంతరం జేఏసీ నేతలు రఘు, పురుషోత్తం, రమేశ్ తదితరులతో కలసి కోదండరాం విలేకరులతో మాట్లాడారు. రిజర్వాయర్ కట్టాలనుకుంటే దాని నీటి నిల్వ సామర్థ్యం, ముంపు, సాగునీటి లభ్యత వంటి వివరాలను బయటకు చెప్పాలన్నారు. భూసేకరణకు నోటిఫికేషన్ ఇవ్వకుండా, రైతులకు పరిహారం ఎంత ఇస్తున్నారో చెప్పకుండా, పునరావాసానికి ఎలాంటి చర్యలను తీసుకుంటున్నారో చెప్పకుండా రహస్యంగా ఉంచుతున్నారని విమర్శించారు. తుపాకులు ఉన్న పోలీసులను ముందుపెట్టి కొండపోచమ్మ రిజర్వాయర్ కోసం బహిలింపూర్ రైతుల భూములను బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారని కోదండరాం విమర్శించారు.ప్రాజెక్టు కోసం భూములను చట్ట ప్రకారం సేకరించకుండా కేవలం కొన్నట్టుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం అప్రజాస్వామికం, చట్ట వ్యతిరేకం కాదా అని ప్రశ్నిం చారు. గ్రామంలో బహిరంగసభ పెట్టలేదని, ర్యాలీ నిర్వహించలేదని, రోడ్లపైకి వెళ్లలేదని, అయినా సెక్షన్ 30 అమలులో ఉందంటూ పోలీసులు తమను అక్రమంగా అరెస్టు చేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్‌కు దగ్గరలోనే ఉన్న బహిలింపూర్‌లో ఇలా జరుగుతున్నదని, ఇది దురదృష్టకరమని అన్నారు. చట్ట ప్రకారమే ఆదుకుంటామని, భయపడాల్సిన అవసరంలేదని గ్రామస్తులకు భరోసాను ఇచ్చినట్టు చెప్పారు. కోదండరాం అరెస్ట్.. విడుదల గజ్వేల్: సిద్దిపేట జిల్లా ములుగు మండలం బహిలింపూర్‌లో సోమవారం ‘కొండపో చమ్మ సాగర్’ రిజర్వాయర్ ముంపు బాధి తులను కలిసేందుకు వెళ్లిన టీజేఏసీ చైర్మన్ కోదండరాం, హైకోర్టు న్యాయవాది రచనారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టును అడ్డుకునేందుకు గ్రామస్తులు యత్నించడం తో ఉద్రిక్తతకు దారితీసింది. గజ్వేల్ నియో జకవర్గం మర్కూక్–పాములపర్తి గ్రామాల మధ్య ప్రభుత్వం ‘కొండపోచమ్మ సాగర్’ రిజర్వాయర్ కోసం భూసేకరణ జరుగు తోంది.ముంపునకు గురవుతున్న ములుగు మండలం బహిలింపూర్, మామిడ్యాల, తానేదార్పల్లిల్లో రైతుల నుంచి భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సాగుతోంది. కోదండరాం, రచనారెడ్డి, జేఏసీ నాయకుడు పురు షోత్తం బహిలింపూర్ చేరుకుని భూసేకర ణ, నష్టపరిహారంపై ఆరా తీస్తుండగా... పోలీసులు వారిని అరెస్టు చేశారు. గజ్వేల్ బేగంపేట పోలీస్‌స్టేషన్‌లో కొద్ది గంటలు ఉంచి అనంతరం విడుదల చేశారు.