
సాక్షి, హైదరాబాద్: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అనే అంశంపై టీజేఎస్ పార్టీ తర్జనభర్జన పడుతోంది. మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు తమకు సహకరించాలంటూ పార్టీ అధ్యక్షుడు కోదండరాంను సంప్రదిస్తుండటంతో ఆలోచనల్లో పడింది. తొలుత 4 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించిన టీజేఎస్.. ఆ స్థానాలు మిన హా మిగతా చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతివ్వాలని నిర్ణయించింది. అయితే తాము పోటీ చేయా లనుకున్న మల్కాజిగిరి, కరీంనగర్, నిజామాబాద్ వంటి స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. మల్కాజిగిరి నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో దిగుతున్న రేవంత్‌రెడ్డి ఈ ఎన్నికల్లో తనకు సహకరించాలని కోదండరాంను కోరారు. ఇక బుధవారం మరో నేత మధుయాష్కీ కూడా కోదండరాంను కలి సి మద్దతు కోరారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పోటీ చేస్తున్న స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టడం అవసరమా? అని పార్టీ వర్గాలు యోచిస్తున్నాయి.
ఒకటి, రెండు రోజుల్లో నిర్ణయం..
లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి సంబంధించి ఒకటి, రెండు రోజుల్లో పార్టీ కోర్ కమిటీ సమావేశం నిర్వహించి, తుది నిర్ణయం తీసుకోవాలని టీజేఎస్ భావి స్తోంది. పోటీలో ఉంటే ఏయే స్థానాల్లో పోటీ చేయాలి? పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండాలన్న అంశాలపై ఈ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం ప్రకటించాలని భావిస్తున్నట్లు టీజేఎస్ ముఖ్య నేత ఒకరు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment