
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేతలు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంని కలిసి మునుగోడులో మద్దతు ఇవ్వాలని కోరారు. అయితే దీనిపై పార్టీలో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని కోదండరాం అన్నారు. పార్టీలో నేతలకు ట్రైనింగ్ క్లాసులు కూడా ఉన్నాయని తెలిపారు. మేము కూడా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాం. కాబట్టి పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కోదండరాం చెప్పారు.
కాగా, అంతకుముందు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్ గౌడ్, మాజీ ఎంపీ మల్లు రవి పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆదేశాలతో కోదండరాంను కలిశారు. ఈ సందర్భంగా మునుగోడు ఉప ఎన్నికపై చర్చిస్తూ.. ఎప్పుడు ఎన్నిక వచ్చినా టీజేఎస్ మద్దతు ఇవ్వాలని కోరారు.
చదవండి: (Munugode Politics: ఆ పార్టీ సరేనంటే.. కమ్యూనిస్టులు అటువైపే..!)
Comments
Please login to add a commentAdd a comment