మునుగోడు ఓట్ల వివ‌రాలు ఇవే.. అలాగే మెజారిటీ ఓట్లు వీరివే.. | Munugode District Assembly Politics | Sakshi
Sakshi News home page

మునుగోడు ఓట్ల వివ‌రాలు ఇవే.. అలాగే మెజారిటీ ఓట్లు వీరివే..

Published Sat, Nov 18 2023 1:07 PM | Last Updated on Sat, Nov 18 2023 8:37 PM

Munugode District Assembly Politics - Sakshi

మునుగోడు నియోజకవర్గం
జిల్లా: నల్గొండ
లోక్ సభ పరిధి: భువనగిరి
రాష్ట్రం: తెలంగాణ
మొత్తం ఓటర్ల సంఖ్య: 248,524
పురుషులు: 124,473
మహిళలు: 123,996

ఈ నియోజకవర్గం పరిధిలో మొత్తం ఏడు మండలాలు ఉన్నాయి:

నల్గొండ జిల్లా
మునుగోడు 
చందూర్
మర్రిగూడ
నాంపల్లి
ఘాటుప్పల్

యాదాద్రి భువనగిరి జిల్లా
సమస్థాన్ నారాయణపూర్ 
చౌటుప్పల్

నియోజకవర్గం ముఖచిత్రం
సీపీఐ సిట్టింగ్‌ స్థానమైన మునుగోడులో గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ప్రభాకర్‌ రెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పాల్వాయి గోవర్థన్‌ రెడ్డి ఇక్కడి నుంచి ఐదుసార్లు విజయం సాధించారు. ఇప్పటి వరకు మునుగోడులో పదకొండుసార్లు ఎన్నికలు జరగగా కాంగ్రెస్‌ ఐదుసార్లు, సీపీఐ ఐదుసార్లు విజయం సాధించాయి. 1967 వరకు ఈ స్థానం చిన్నకొండూరుగా ఉంది. తెలంగాణ ప్రముఖ పోరాటయోధుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ గతంలో ఇక్కడ నుంచి రెండు సార్లు విజయం సాధించారు.

మునుగోడులో కాంగ్రెస్‌ ఐ పార్టీ అభ్యర్దిగా పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి విజయం సాదించారు. 2009లో  ఆయన ఎంపిగా గెలిచారు. 2014లో ఓటమి చెందినా, ఆ తర్వాత ఎమ్మెల్సీగా గెలుపొందారు. తిరిగి ఈసారి మునుగోడు నుంచి అసెంబ్లీకి పోటీచేసి విజయం సాదించారు. ఆయన సిట్టింగ్‌ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ అభ్యర్ది  కె. ప్రభాకరరెడ్డిపై 22,552 ఓట్ల మెజార్టీతో నెగ్గారు. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి 97239 ఓట్లు రాగా, ప్రభా కరరెడ్డికి 74687 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన జి.మనోహర్‌రెడ్డికి 12700 ఓట్లు వచ్చాయి.

రాజగోపాలరెడ్డి సామాజిక పరంగా రెడ్డి వర్గానికి చెందినవారు. 2014లో మునుగోడు నియోజకవర్గంలో  టిఆర్‌ఎస్‌ అభ్యర్ధి కె.ప్రబాకరరెడ్డి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధనరెడ్డి కుమార్తె స్రవంతిని 38055 ఓట్ల తేడాతో ఓడిరచారు. స్రవంతి కాంగ్రెస్‌ తిరుగుబాటు అభ్యర్ధిగా పోటీచేసి ఓడిపోయారు. 2009లో  పాల్వాయి గోవర్దనరెడ్డి  పోటీచేసి ఓటమి పాలైతే, 2014లో  ఆయన కుమార్తె ఓడిపోవలసి వచ్చింది. అయితే పాల్వాయి 2009లో ఓటమి తర్వాత కాంగ్రెస్‌ ఐ  పార్టీ ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చింది.

2014లో కాంగ్రెస్‌ పార్టీ ,సిపిఐతో పొత్తు పెట్టుకోవడాన్ని ఆయన వ్యతిరేకించారు. సిపిఐ పోటీచేసినా సమీప ప్రత్యర్ధిగా కూడా ఉండలేకపోయింది.సిపిఐ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డికి 20952 ఓట్లు వచ్చాయి. సీనియర్‌ సిపిఐ నాయకుడు ఉజ్జిని నారాయణరావు మూడు సార్లు గెలుపొందితే, ఆయన కుమారుడు యాదగిరిరావు ఒకసారి గెలుపొందారు. 

పాల్వాయి గోవర్ధనరెడ్డి మునుగోడులో ఐదుసార్లు గెలిచారు. ఒకసారి ఎమ్మెల్సీ అయ్యారు. ఒకసారి రాజ్యసభ సభ్యుడయ్యారు. ఈయన గతంలోమంత్రి పదవి నిర్వహించారు. మునుగోడులో   కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ఐ కలిసి ఆరుసార్లు, సిపిఐ ఐదుసార్లు గెలిచాయి. టిఆర్‌ఎస్‌ ఒకసారి గెలిచింది. స్వయంగా టిడిపి ఇక్కడ నుంచి గెలవలేదు.సిపిఐ మిత్ర పక్షంగా ఉన్నప్పుడు బలపరిచింది. మునుగోడులో తొమ్మిది సార్లు రెడ్లు, రెండుసార్లు బిసి(పద్మశాలి)నాలుగుసార్లు వెలమ, ఒకసారి ఇతరులు గెలుపొందారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement