District Elections
-
మునుగోడు ఓట్ల వివరాలు ఇవే.. అలాగే మెజారిటీ ఓట్లు వీరివే..
మునుగోడు నియోజకవర్గం జిల్లా: నల్గొండ లోక్ సభ పరిధి: భువనగిరి రాష్ట్రం: తెలంగాణ మొత్తం ఓటర్ల సంఖ్య: 248,524 పురుషులు: 124,473 మహిళలు: 123,996 ఈ నియోజకవర్గం పరిధిలో మొత్తం ఏడు మండలాలు ఉన్నాయి: నల్గొండ జిల్లా మునుగోడు చందూర్ మర్రిగూడ నాంపల్లి ఘాటుప్పల్ యాదాద్రి భువనగిరి జిల్లా సమస్థాన్ నారాయణపూర్ చౌటుప్పల్ నియోజకవర్గం ముఖచిత్రం సీపీఐ సిట్టింగ్ స్థానమైన మునుగోడులో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్థన్ రెడ్డి ఇక్కడి నుంచి ఐదుసార్లు విజయం సాధించారు. ఇప్పటి వరకు మునుగోడులో పదకొండుసార్లు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ ఐదుసార్లు, సీపీఐ ఐదుసార్లు విజయం సాధించాయి. 1967 వరకు ఈ స్థానం చిన్నకొండూరుగా ఉంది. తెలంగాణ ప్రముఖ పోరాటయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గతంలో ఇక్కడ నుంచి రెండు సార్లు విజయం సాధించారు. మునుగోడులో కాంగ్రెస్ ఐ పార్టీ అభ్యర్దిగా పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాదించారు. 2009లో ఆయన ఎంపిగా గెలిచారు. 2014లో ఓటమి చెందినా, ఆ తర్వాత ఎమ్మెల్సీగా గెలుపొందారు. తిరిగి ఈసారి మునుగోడు నుంచి అసెంబ్లీకి పోటీచేసి విజయం సాదించారు. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్ది కె. ప్రభాకరరెడ్డిపై 22,552 ఓట్ల మెజార్టీతో నెగ్గారు. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి 97239 ఓట్లు రాగా, ప్రభా కరరెడ్డికి 74687 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన జి.మనోహర్‌రెడ్డికి 12700 ఓట్లు వచ్చాయి. రాజగోపాలరెడ్డి సామాజిక పరంగా రెడ్డి వర్గానికి చెందినవారు. 2014లో మునుగోడు నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్ధి కె.ప్రబాకరరెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధనరెడ్డి కుమార్తె స్రవంతిని 38055 ఓట్ల తేడాతో ఓడిరచారు. స్రవంతి కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్ధిగా పోటీచేసి ఓడిపోయారు. 2009లో పాల్వాయి గోవర్దనరెడ్డి పోటీచేసి ఓటమి పాలైతే, 2014లో ఆయన కుమార్తె ఓడిపోవలసి వచ్చింది. అయితే పాల్వాయి 2009లో ఓటమి తర్వాత కాంగ్రెస్ ఐ పార్టీ ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చింది. 2014లో కాంగ్రెస్ పార్టీ ,సిపిఐతో పొత్తు పెట్టుకోవడాన్ని ఆయన వ్యతిరేకించారు. సిపిఐ పోటీచేసినా సమీప ప్రత్యర్ధిగా కూడా ఉండలేకపోయింది.సిపిఐ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డికి 20952 ఓట్లు వచ్చాయి. సీనియర్ సిపిఐ నాయకుడు ఉజ్జిని నారాయణరావు మూడు సార్లు గెలుపొందితే, ఆయన కుమారుడు యాదగిరిరావు ఒకసారి గెలుపొందారు. పాల్వాయి గోవర్ధనరెడ్డి మునుగోడులో ఐదుసార్లు గెలిచారు. ఒకసారి ఎమ్మెల్సీ అయ్యారు. ఒకసారి రాజ్యసభ సభ్యుడయ్యారు. ఈయన గతంలోమంత్రి పదవి నిర్వహించారు. మునుగోడులో కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి ఆరుసార్లు, సిపిఐ ఐదుసార్లు గెలిచాయి. టిఆర్ఎస్ ఒకసారి గెలిచింది. స్వయంగా టిడిపి ఇక్కడ నుంచి గెలవలేదు.సిపిఐ మిత్ర పక్షంగా ఉన్నప్పుడు బలపరిచింది. మునుగోడులో తొమ్మిది సార్లు రెడ్లు, రెండుసార్లు బిసి(పద్మశాలి)నాలుగుసార్లు వెలమ, ఒకసారి ఇతరులు గెలుపొందారు. -
ద్విసభ్య నియోజకవర్గాలు అంటే..
నల్గొండ: హైదరాబాద్ రాష్ట్ర శాసనసభకు 1952లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. ఈ రాష్ట్రంలో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలోని కొన్ని భాగాలు కలిసి ఉండేవి. 1952 శాసనసభ ఎన్నికల్లో కొన్ని ఏక సభ్య నియోజకవర్గాలు, కొన్ని ద్వి సభ్య నియోజకవర్గాలు ఉండేవి. ఏక సభ్య నియోజకవర్గాల్లో ఒకస్థానంలో ఒక పార్టీ నుంచి ఒక్కరే పోటీ చేసే వీలుండేది. ద్విసభ్య నియోజకవర్గాల్లో ఒక స్థానంలో ఒక పార్టీ నుంచి ఇద్దరు పోటీ చేసేవారు. (అప్పటి వరకు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ స్థానాలు లేవు) దీనిలో ఒకరు జనరల్ సభ్యుడిగా.. రెండవ వారు రిజర్వు కేటగిరీకి చెందిన సభ్యుడు (ఎస్సీ లేదా ఎస్టీ) ఉండే వారు. ద్విసభ్య నియోజకవర్గం నుంచి ఇద్దరు గెలిచే వారు. వీరికి సమాన అధికారాలు ఉండేవి. కాకపోతే.. రిజర్వు సభ్యుడు తన నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీల సమస్యలు, హక్కుల గురించి చట్టసభల్లో ప్రస్తావించేవారు. ఈ ఎన్నికల సమయానికి హైదరాబాద్ రాష్ట్రంలో మొత్తం 142 శాసన సభ నియోజకవర్గాలు ఉండేవి. వీటిలో 33 ద్విసభ్య నియోజకవర్గాలు ఉండడంతో మొత్తం శాసనసభ్యుల సంఖ్య 175 ఉండేది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నల్లగొండ, హుజూర్నగర్, సూర్యాపేట నియోజకవర్గాలు ద్విసభ్య నియోజకవర్గాలుగా ఉండేవి. అయితే, ద్విసభ్య నియోజకవర్గాలకు ఎన్నిక ప్రక్రియ క్లిష్టంగా ఉండడంతో అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 1961 సంవత్సరంలో ద్విసభ్య నియోజకవర్గ విధానాన్ని రద్దు చేసి ఎస్టీ, ఎస్సీలకు ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించింది. మాల్ చెక్‌పోస్టు పరిశీలన ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో చింతపల్లి మండలంలోని మాల్ వెంకటేశ్వరనగర్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టును మంగళవారం నల్లగొండ జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ డ్యూటీ చేస్తున్న పోలీసులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో చెక్‌పోస్టు తీసుకుంటున్న చర్యలు, చేపడుతున్న వాహనాల తనిఖీలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అక్రమంగా మద్యం తరలించకుండా పకడ్బందీగా తనిఖీలు చేయాలని సిబ్బందికి సూచించారు. సరైన ఆధారాలు చూపని నగదును సీజ్ చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట దేవరకొండ ఆర్డీవో శ్రీరాములు, తహసీల్దార్ శంషొద్దీన్, ఎంపీడీఓ రాజు తదితరులున్నారు. -
ఓటర్ల జాబితాలు సిద్ధం చేయండి
సాక్షి, హైదరాబాద్: మండల, జిల్లా ప్రజాపరిషత్ ఎన్నికల నిర్వహణకు కసరత్తు మొదలైంది. వచ్చే జూలై 3,4 తేదీల్లో ప్రస్తుత ఎంపీపీ, జెడ్పీపీపీల కాలపరిమితి ముగుస్తున్న విషయం తెలిసిందే. ఈ గడువు ముగియగానే కొత్త పాలకవర్గాలను ఎన్నుకునేందుకు వీలుగా రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని గ్రామపంచాయతీలు, వార్డులవారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేసి ప్రచురించేందుకు వీలుగా త్వరలోనే ఎస్ఈసీ నోటిఫికేషన్ వెలువరించనుంది. ఈ నెల 22న ప్రకటించనున్న (2019 జనవరి 1 నాటి) అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితాకు అనుగుణంగా ఈ జాబితాలను జిల్లా పంచాయతీ అధికారులు (డీపీఓ) సిద్ధం చేయాలని ఎస్ఈసీ సూచించింది. ఈ విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని డీపీవోలను ఆదేశించింది. ఓటర్ల జాబితాల తయారీకి చర్యలు వేగవంతం చేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌కి ఎస్ఈసీ సూచించింది. ఈ జాబితాలకు అనుగుణంగా మండల ప్రజాపరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాలను మండల పరిషత్ అభివృద్ధి అధికారులు (ఎంపీడీవోలు), జిల్లా ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా సీఈవోలు తయారు చేయాల్సి ఉంటుంది. గురువారం ఎస్ఈసీ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లు (హైదరాబాద్ మినహా), జిల్లా ఎన్నికల అధికారులకు లేఖ లు పంపించారు. గ్రామ పంచాయతీల్లోని వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను రూపొందించి, ప్రచురించడానికి ప్రాధాన్యత ఏర్పడిన నేపథ్యంలో ప్రతి గ్రామపంచాయతీకి ఒక అధికారిని నియమించాలని ఎస్ఈసీ నిర్ణయించింది. గ్రామ పంచాయతీలో ఓటర్ల జాబితాను తయారుచేసేందుకు పంచాయతీ కార్యదర్శి కేడర్ అధికారిని డిజిగ్నేట్ చేయాలని జిల్లా కలెక్టర్లను ఎస్ఈసీ ఆదేశించింది. ఓటర్ల జాబితాల తయారీకి అనుసరించాల్సిన మార్గదర్శకాలు పాటిం చాలని సూచించింది. పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటర్ల జాబితాలు, గ్రామపంచాయతీ ఓటర్ల జాబితాలను సరిచూసుకునే కార్యక్రమాన్ని ముందుగానే పూర్తిచేసుకోవాలని కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు సూచించింది. -
ఉత్కంఠ భరితంగా...
♦ పీఆర్టీయూ జిల్లా ఎన్నికలు ♦ జిల్లా అధ్యక్షుడిగా బి.వి.రమణారావు, ♦ ప్రధాన కార్యదర్శిగా నరేంద్రబాబు ఎన్నిక నిర్మల్‌రూరల్: పీఆర్టీయూ జిల్లా ఎన్నికలు ఆదివారం ఉత్కంఠ భరితంగా సాగాయి. నిర్మల్‌లోని దివ్య గార్డెన్స్‌లో జిల్లా కార్యవర్గ ఎన్నికలను ఓటింగ్ పద్ధతిన నిర్వహించారు. ఇందులో రెండు ప్యానెళ్లు పోటీ పడ్డాయి. బి.వి.రమణారావు వర్గం ఒక ప్యానెల్‌గా బరిలో దిగగా సుదర్శన్ మరో ప్యానెల్‌గా బరిలో దిగారు. 100 మంది సభ్యులు తమ ఓటింగ్‌ను వినియోగించుకున్నారు. రమణారావు ప్యానెల్ నుంచి రమణారావు మాత్రమే గెలుపొందగా సుదర్శన్ ప్యానెల్ నుంచి సుదర్శన్ తప్ప మిగితా పోటీ చేసిన అభ్యర్థులందరూ గెలుపొందారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలను నిర్వహించారు. ఇరు ప్యానెళ్ల మధ్య పోటాపోటీ నెలకొంది. రెండు ఓట్ల తేడాతో జిల్లా అధ్యక్షుడిగా రమణారావు రెండు ఓట్ల తేడాతో జిల్లా అధ్యక్షుడిగా బి.వి.రమణరావు గెలుపొందారు. రమణారావుకు 51 ఓట్లు రాగా ప్రత్యర్థి అయిన సుదర్శన్‌కు 49 ఓట్లు లభించాయి. దీంతో ఎన్నికల పరిశీలకులు రమణారావు గెలుపొందినట్లు ప్రకటించారు. అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శిగా నరేంద్రబాబు ఎన్నికయ్యారు. ఇతనికి 61 ఓట్లు రాగా ప్రత్యర్థి గొజ్జ జనార్దన్‌కు 31 ఓట్లు వచ్చాయి. దీంతో 30 ఓట్ల తేడాతో నరేంద్రబాబు విజయం సాధించారు. కార్యవర్గం అసోసియేట్ అధ్యక్షులుగా టి.రమేశ్, ఎ.ప్రభాకర్, మహిళా అసోసియేట్ అధ్యక్షురాలిగా సుహాసిని, ఉపాధ్యక్షులుగా అశోక్‌రెడ్డి, జి.ఎల్.వి.ప్రసాద్, మల్కాగౌడ్, కె.లక్ష్మణ్, మునీందర్‌రాజు, ఉపాధ్యక్షులుగా సీహెచ్.వందన, కార్యదర్శులుగా జమీల్ అహ్మద్, టి.నర్సిములు, లక్ష్మీరాజ్యం, జగదీశ్వర్, సాయినాథ్, మహిళా కార్యదర్శిగా అపర్ణ విజయం సాధించారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నూతనంగా ఎన్ని కైన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమణారావు, నరేంద్రబాబు పేర్కొన్నా రు. తమ సంఘ పటిష్టత కోసం కృషి చేయనున్నట్లు తెలిపారు. తమ గెలు పునకు కృషి చేసిన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు సరోత్తంరెడ్డి, ప్రధాన కార్యదర్శి చెన్నకేశవరెడ్డి, పత్రిక ప్రధాన సంపాదకులు పర్వతి సత్యనారాయణ, జీవన్, ఎన్నికల పరిశీలకులు నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు కమలాకర్‌రావు, ప్రధాన కార్యదర్శి మోహన్ పాల్గొన్నారు.