ఉద్యోగాలు: ఐబీపీఎస్ క్లరికల్ ఎగ్జామినేషన్ - 2014 | IBPS clerical examination 2014 Notification announced by several banks | Sakshi
Sakshi News home page

ఉద్యోగాలు: ఐబీపీఎస్ క్లరికల్ ఎగ్జామినేషన్ - 2014

Published Tue, Aug 12 2014 10:41 PM | Last Updated on Sat, Sep 15 2018 7:34 PM

IBPS clerical examination 2014 Notification announced by several banks

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) ‘క్లరికల్ క్యాడర్ కామన్ రిటెన్  ఎగ్జామినేషన్ - 2014’ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా స్టేట్ బ్యాంక్ మినహా మిగతా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లరికల్ పోస్టులను భర్తీ చేస్తారు.
  ఐబీపీఎస్ క్లరికల్ ఎగ్జామినేషన్ - 2014
 అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉండాలి. సంబంధిత ప్రాంతీయ భాషలో పరిజ్ఞానం ఉండాలి.
 వయసు: 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
 ఎంపిక: ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ ద్వారా.
 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది:
 సెప్టెంబరు 1
 వెబ్‌సైట్: www.ibps.in
 
 విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్
 విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ సీనియర్ డిప్యూటీ అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 సీనియర్ డిప్యూటీ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్
 అర్హత: సీఏ ఉత్తీర్ణత ఉండాలి. సంబంధిత రంగంలో 12 ఏళ్ల అనుభవం ఉండాలి.
 వయసు: 42 ఏళ్లు దాటకూడదు.
 దరఖాస్తుకు చివరి తేది: ఆగస్టు 25
 వెబ్‌సైట్: www.vizagport.com
 
 టాటా మెమోరియల్ హాస్పిటల్
 ముంబైలోని టాటా మెమోరియల్ హాస్పిటల్ కింద పేర్కొన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
  సైంటిఫిక్ ఆఫీసర్ - డి
 వయసు: 35 ఏళ్లు దాటకూడదు.
 అర్హతలు: ఎమ్మెస్సీ లైఫ్ సెన్సైస్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో మూడేళ్ల అనుభవం ఉండాలి.
  డేటా మేనేజర్
 వయసు: 30 ఏళ్లు దాటకూడదు.
 అర్హతలు: బీఎస్సీ ఐటీ ఉత్తీర్ణులై ఉండాలి.
 దరఖాస్తుకు చివరి తేది: ఆగస్టు 19
 వెబ్‌సైట్: tmc.gov.in
 
 ప్రవేశాలు
 ఓయూ - దూర విద్యలో ఎంబీఏ, ఎంసీఏ
 ఉస్మానియా యూనివర్సిటీ దూర విద్యా కేంద్రం ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
  ఎంబీఏ( జనరల్ మేనేజ్‌మెంట్, పర్సనల్, హెచ్‌ఆర్, ఫైనాన్స్, మార్కెటింగ్, ఇంటర్నేషనల్ బిజినెస్.)
  ఎంసీఏ
 వెబ్‌సైట్: http://ouadmissions.com
 డాక్టర్ బి. రమేష్
 సీనియర్ ఫ్యాకల్టీ,
 ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జమ్మికుంట, కరీంనగర్ జిల్లా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement