సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో పెంచిన (34 ఏళ్ల నుంచి 40 ఏళ్లు) వయోపరిమితి గడువును మరో ఏడాదిపాటు పొడిగించారు. ఈమేరకు ప్రభుత్వ సాధారణ పరిపాలనా శాఖ సోమవారం జీవో నంబర్ 381ను జారీచేసింది. దీంతో వయోపరిమితి గడువు పెంపు 2017 సెప్టెంబర్ 30 వరకూ అమల్లో ఉంటుంది. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ గత కొన్నేళ్లుగా నిలిచిపోవడంతో ఉద్యోగార్హత కోల్పోతామని, వయోపరిమితి గడువు పెంచాలని లక్షలాది మంది నిరుద్యోగులు గతంలో ప్రభుత్వాన్ని కోరారు. దీంతో ఉద్యోగాల వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచారు.
ఆ పెంపు రెండేళ్లు అమల్లో ఉండేలా 2014 సెప్టెంబర్ 23న జీవో 295 విడుదలైంది. ఆ జీవో గడువు 2016 సెప్టెంబర్ 30తో ముగిసింది. దీనిపై ‘సాక్షి’ ఇటీవల కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ల విడుదలను పెండిం గ్‌లో పెట్టి వయోపరిమితి పెంపు జీవో పొడిగింపుపై స్పష్టత కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనిపై ప్రభుత్వం స్పందిస్తూ వయోపరిమితి పెంపును మరో ఏడాది అమలయ్యేలా ఉత్తర్వులు జారీచేసింది. ఇలా ఉండగా వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 42 ఏళ్లకు పెంచాలని నిరుద్యోగులు కోరుతున్నారు.
వయోపరిమితి పెంపు మరో ఏడాది
Published Tue, Oct 18 2016 1:44 AM | Last Updated on Thu, Mar 28 2019 6:33 PM
Advertisement