పెట్రోల్ ధరల పెరుగుదలకు బ్రేక్ పడటం లేదు. ఇంధన ధరలు వరుసగా సోమవారం మూడోరోజూ భారమయ్యాయి. పెట్రోల్ లీటర్‌కు 30 పైసలుకు పైగా పెరగ్గా, పలు మెట్రో నగరాల్లో డీజిల్ ధరలు లీటర్‌కు 40 పైసలు పైగా పెరిగాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ సోమవారం రూ 84.10 పైసలకు చేరింది.