Crude oil price
-
సానుకూల సంకేతాలు
ముంబై: ట్రేడింగ్ నాలుగు రోజులే జరిగే ఈ వారంలోనూ ఎన్నికల అప్రమత్తత కొనసాగే వీలుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. చివరి దశ కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు, ప్రపంచ పరిణామాలు, స్థూల ఆర్థిక గణాంకాలు, విదేశీ ఇన్వెస్టర్లు తీరుతెన్నులు స్టాక్ సూచీలకు దిశానిర్దేశం చేస్తాయంటున్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలూ ట్రేడింగ్ ప్రభావితం చూపొచ్చంటున్నారు. ఇక ప్రాథమిక మార్కెట్లో అవఫిస్ స్పేస్ సొల్యూషన్స్ ఐపీఓ బుధవారం ప్రారంభం కానుంది. ఇటీవల పబ్లిక్ ఇష్యూ పూర్తి చేసుకున్న గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ షేర్లు గురువారం ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. ‘‘అంతర్జాయతీ మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. ఇది దేశీయ ఈక్విటీ మార్కెట్‌కు కలిసొచ్చే అంశం. అయితే ఎన్నికల సంబంధిత పరిణామాల వార్తలు, కార్పొరేట్ ఆర్థిక ఫలితాల ప్రకటన నేపథ్యంలో ఒడిదుడుకుల ట్రేడింగ్ కొనసాగొచ్చు. నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 22,500 స్థాయిని నిలుకోగలిగితే జీవితకాల గరిష్టాన్ని (22,795) పరీక్షించవచ్చు. అమ్మకాలు నెలకొంటే 22,200 వద్ద మరో కీలక మద్దతు ఉంది’’ అని నిపుణులు తెలిపారు. ఇక ఈ వారంలో దాదాపు 200 కి పైగా కంపెనీలు తమ క్యూ4 ఫలితాలు ప్రకటించనున్నాయి. ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా యాజమాన్య వ్యాఖ్యలు కీలకం కానున్నాయి. అమెరికా ఆర్థిక పరిణామాలు భారత్ మార్కెట్‌పై ప్రభావం చూపనున్నాయి. -
ఆదాయాలు రెట్టింపైనా ఉద్యోగాల్లో కోత!
ప్రభుత్వ ఆయిల్, గ్యాస్ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గడిచిన ఆరేళ్లలో ప్రభుత్వ చమురు సంస్థలు సుమారు 15,700 ఉద్యోగాలను తగ్గించాయి. వాటి శ్రామికశక్తిలో ఇది 14 శాతంగా ఉంది. ఈ ఆరేళ్ల కాలంలో ఆయా కంపెనీల ఆదాయాలు మాత్రం రెట్టింపు అయినట్లు తెలుస్తుంది. అయినప్పటికీ వేలసంఖ్యలో ఉద్యోగులను తగ్గించడంపట్ల ఆందోళనలు నెలకొంటున్నాయి.చమురు మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం..ఉద్యోగాల కోత అన్ని విభాగాల్లో ఉంది. ప్రధానంగా నాన్-మేనేజిరియల్ ఉద్యోగాలను భారీగా తగ్గించారు. ప్రభుత్వ చమురు, గ్యాస్ కంపెనీల్లో 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 1,10,000గా ఉన్న శ్రామికశక్తి 94,300కి పడిపోయింది. ఎక్స్‌ప్లోరేషన్, ఉత్పత్తి, మార్కెటింగ్, రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగాల్లో గడిచిన ఆరేళ్లలో 20-24% ఉద్యోగాలను తొలగించారు. రిఫైనరీల్లో మాత్రం కేవలం 3% ఉద్యోగాల కోత విధించారు. ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు 6శాతం, నాన్ మేనేజిరియల్ ఉద్యోగాలు 25 శాతం మేర తగ్గించినట్లు తెలిసింది.కాంట్రాక్ట్ ప్రాతిపదికన కొత్త ఉద్యోగాలు నియమించడం, బౌట్‌సోర్సింగ్ కొలువులపై దృష్టిసారించడంతో రెగ్యులర్ స్థానాలపై వేటు పడుతున్నట్లు తెలిసింది. దాంతోపాటు శ్రామికశక్తి స్థానంలో అవకాశం ఉన్న విభాగాల్లో టెక్నాలజీ వాడకాన్ని పెంచుతున్నారు. పదవివిరమణ చేసిన ఉద్యోగులు స్థానంలో పరిమిత స్థాయిలోనే కొత్త వారికి అవకాశం ఇస్తున్నారు. ఫలితంగా కంపెనీల ఆదాయాలు పెరుగుతున్నా ఉద్యోగుల సంఖ్యలో కోతలు కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలాఉండగా, 2022-23 నాటికంటే ముందు ఆరు ఆర్థిక సంవత్సరాల్లో ప్రభుత్వ చమురు కంపెనీలు మూలధన వ్యయంలో భాగంగా సుమారు రూ.6.8 లక్షల కోట్లు వెచ్చించాయి. -
రష్యా చమురు ధరపై పరిమితితో సంక్షోభం!
ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాను నయానో, భయానో తమ దారిలోకి తెచ్చుకునేందుకు అమెరికా, దాని మిత్రదేశాలూ శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. అందులో భాగంగానే కొత్తగా జీ7, ఆస్ట్రేలియా, యూరోపియన్ యూనియన్ దేశాలు... రష్యా ఎగుమతి చేసే ముడి చమురు ధరపై బ్యారెల్‌కు 60 డాలర్ల కనీస పరిమితి విధిస్తూ క్రితం వారం నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఒపెక్ ప్లస్ (రష్యా) దేశాలు మాత్రం రానున్న నెలల్లో ముడిచమురు ఉత్పత్తిని రోజుకు 20 లక్షల బ్యారెల్స్ తగ్గిస్తామని వెల్లడించాయి. ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితులు మందకొండిగా ఉండటమే ఇందుకు కారణమంటున్నాయి. కాగా చమురు ఉత్పత్తిని పెంచమని అమెరికా అధ్యక్షుడు సౌదీ అరేబియాపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రపంచ చమురు ఎగుమతి చేసే దేశాల్లో 2వ స్థానంలో రష్యా ఉంది. చమురు ధరపై కనీస పరిమితి విధించి చమురు ఎగుమతి ద్వారా వచ్చే ఆదాయాలను నీరుగార్చి రష్యా ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి తీసుకెళ్లాలనేది ఈయూ దేశాల తపన. ఇది సఫలీకృతమైతే అమెరికా తన ఆధిపత్యం కొనసాగనీయ వచ్చనేది వ్యూహం. రష్యా ముడిచమురు ధరపై పరిమితి విధించడాన్ని క్రెమ్లిన్ తీవ్రస్థాయిలో ఖండించింది. రష్యాపై ఆంక్షలు విధించినప్పుడల్లా ప్రపంచ దేశాలపై ముఖ్యంగా ఐరోపా దేశాలపై అవి తీవ్ర ప్రతికూల ప్రభావాల్ని కలుగ జేస్తున్నాయని రష్యా గుర్తుచేసింది. రష్యాపై ఆంక్షల నేపథ్యంలో ముడిచమురు ధరలు 2022 ఫిబ్రవరి నుండి పెరుగుతూ వస్తున్నాయి. దీనితో ఈ సంవత్సరం రష్యా అదనంగా 41 శాతం లాభాలను పెంచుకొని ఆంక్షలు విధించిన దేశాలకు, అమెరికాకు షాక్ ఇచ్చింది. రష్యాతో స్నేహంగా లేని దేశాలకు మొత్తం ముడిచమురు ఎగుమతులను ఆపేసి, ప్రత్యామ్నాయ మార్కెట్లుగా వేరే దేశాలను (భారత్, చైనాలు) ప్రోత్సహిస్తామని రష్యా అంటోంది. మన విదేశాంగమంత్రి జైశంకర్ కూడా రష్యాపై ఆంక్షలకూ భారత్‌కూ సంబంధంలేదని స్పష్టం చేశారు. ఈ వారంలో జర్మనీ విదేశాంగమంత్రి అన్నాలేనా బేర్బాక్ న్యూఢిల్లీలో జైశంకర్‌ను కలిసి ఈయూ విధించిన పరిమితి ధరకు మద్దతునివ్వాలని అభ్యర్థించగా జైశంకర్ తోసి పుచ్చారు. యూరప్ ఇంధన అవసరాలకు అనుగుణంగా భారత్ ప్రాధాన్యతలను ఎంపిక చేసుకోజాలదని అన్నారు. రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ప్రారంభం కాక ముందునుందే భారత్, రష్యాల మధ్య ముడిచమురు వాణిజ్యం ఉందని జైశంకర్ అన్నారు. బ్యారెల్ ముడి చమురు ధర 60 డాలర్లకూ, అంత కన్నా తక్కువ బిల్లు చేస్తే... ప్రపంచ ఇన్సూరెన్స్ కంపె నీలు బీమా చేయడానికి ముందుకురావు. దీనితో రష్యా ముడిచమురు రవాణా స్తంభించి పోతుందని ఈయూ ఆలోచన. ముడి చమురుపై పరిమితి విధించిన రెండురోజుల్లో బ్యారెల్ చమురు ధర అంతర్జాతీయ మార్కెట్లో 2 శాతం పెరిగింది. పరిశ్రమలకు అత్యంత అవసరమైన ఇంధన రవాణాను నిలిపివేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు చిన్నా భిన్నమైపోతాయి. ఇదివరలో యూరప్ దేశాలకు రష్యా ముడి చమురు చాలా ఎగుమతి జరిగేది. తాత్కాలికంగా కొంతమేర దిగుమతులు ఆపినప్పటికీ రష్యా ఇంధనాన్ని ఈయూ దేశాలు వేరే మూడవ దేశం ద్వారా దిగుమతి చేసుకొంటున్నాయి. లిథువేనియా 83 శాతం, ఫిన్లాండ్ 80 శాతం, స్లొవేకియా 74 శాతం, పోలాండ్ 58 శాతం, హంగేరి 43 శాతం, ఎస్తోనియా 34 శాతం, జర్మనీ 30 శాతం, గ్రీస్ 29 శాతం రష్యా నుండి దిగుమతి చేసుకుంటున్నాయి. మిగతా దేశాల దిగుమతి కూడా ఇంచు మించు 15 శాతం తగ్గకుండా ఉంది. ఇప్పుడు అకస్మాత్తుగా ధరల పరిమితి విధింపుతో రష్యాతోపాటుగా ఈయూ దేశాల ఆర్థిక వ్యవస్థలూ చాలా నష్టపోనున్నాయి. రానున్న వారాల్లో ముడి చమురు ధర అంతర్జాతీయంగా 100 డాలర్లు దాటుతుందని నిపుణుల అభిప్రాయం. ఇదివరకటి ‘విన్–విన్’ వాణిజ్య పరిస్థితులు ఇప్పుడు ‘లాస్–లాస్’ పరిస్థితులుగా పరిణమించాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ధరలు తగ్గినప్పుడల్లా లాభాలను కార్పొరేట్లు అనుభవిస్తున్నారు. ధరలు పెరుగు తునప్పుడు నష్టాల భారాన్ని ప్రజలపై మోపటంతో ఆర్థిక వృద్ధిరేటు తగ్గుతూ వస్తోంది. ఫలితంగా ప్రతి దేశంలోనూ ద్రవ్యోల్బణం పెరుగుదలతోపాటు నిరుద్యోగం, నిత్యా వసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. ఇందువల్ల జీవన ప్రమాణాలు తగ్గిపోతూ ఆర్థిక మాంద్యం వైపు దేశాలు కుంటుతున్నాయి. ఉక్రెయిన్–రష్యాల మధ్య జరుగుతున్న యుద్ధంలో మరణించిన సైనికుల కంటే... ఈ చలికాలం యూరప్‌లో ప్రజలు ఇంధన కొరతతో ఎన్నో రెట్లు చలిబారిన పడి చనిపోతారని అంచనా వేస్తున్నారు. యుద్ధాన్ని నివారించక, శాంతి చర్చలు జరగనీయకుండా ఆయుధాలతో, ఆంక్షలతో యుద్ధం పరిసమాప్తమవుతుందని అనుకోవటం అవివేకం. ఇప్పటికే రష్యాపై ఆంక్షలతో యూరప్ ప్రజలు, పరోక్షంగా అభివృద్ధి చెందుతున్న దేశాలూ తీవ్రంగా నష్టపోతున్నాయి. అమెరికా మాత్రం లబ్ధిపొందుతోంది. 3 సంవత్సరాల క్రితం ఒపెక్ దేశాలు, రష్యా ఆర్థిక వ్యవస్థలను నష్ట పరచే విధంగా అమెరికా షేల్ చమురును ప్రవేశపెట్టడంతో బ్యారెల్ చమురు 28 డాలర్లకు పడిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా విధించిన ఈ కనీస 60 డాలర్ల పరిమితి వల్ల నష్టపోయేదీ ఈయూ దేశాలే. ప్రపంచ సాకర్ వేళ ఇది ఈయూ ‘సెల్ఫ్ గోల్’ కానుందా! (క్లిక్ చేయండి: డేటా రక్షణకు ఢోకా లేనట్లేనా?!) - బుడ్డిగ జమిందార్ అసోసియేట్ ప్రొఫెసర్, కె. ఎల్. వర్సిటీ -
ఈ పతనం ఏ తీరాలకు చేరుస్తుందో!
రూపాయి అంతకంతకూ దిగజారు తోంది. రోజుకో కొత్త రికార్డు క్రియేట్ చేస్తోంది. ఈ నెల 14న డాలర్‌తో రూపాయి మారకం విలువ గరిష్టంగా 80 రూపాయలు దాటింది. ప్రస్తుతం కాస్త తగ్గి 79.96 రూపాయలకు చేరింది. ఫారిన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు దేశంలో పెట్టుబడులను ఉపసంహరిం చుకోవడం కూడా రూపాయిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ నెలలో ఇప్పటిదాకా రూ.4 వేల కోట్లకుపైగా విదేశీ పెట్టుబడులు వెనక్కిపోయాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలు నచ్చకనే ఇన్వెస్టర్లు వెనక్కి వెళ్లిపోతున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరోవైపు అమెరికాలో వడ్డీరేట్ల పెంపు కూడా రూపాయిపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ద్రవ్యోల్బణం అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతోంది. కేంద్రం, రిజర్వ్ బ్యాంకు అంచనాలతో పొంతన లేకుండా ద్రవ్యో ల్బణం పెరుగుతోంది. అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతలే దీనికి కారణమని రిజర్వ్ బ్యాంక్ అంటోంది. కేంద్రం నిర్దేశాల ప్రకారం వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2–6 శాతం శ్రేణిలో ఉండాలి. అయితే జనవరిలో 6.01 శాతం, ఫిబ్రవరిలో 6.07 శాతం, మార్చి 17న 6.95 శాతం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. పాలసీ నిర్ణయానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో ఏకంగా ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయి 7.79 శాతానికి పెరిగింది. దీనితో 2022–23 ఆర్థిక సంవ త్సరం మొత్తంలో 5.7 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం ఉంటుందన్న క్రితం అంచనాలను ఆర్బీఐ తాజాగా ఒక శాతం పెంచి 6.7 శాతానికి చేర్చింది. ధరల వేగాన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐకి కేంద్రం ఇస్తున్న నిర్దేశాల కన్నా ఇది 70 బేసిస్ పాయింట్లు ఎక్కువ. 2012 మార్చి 29 నుంచి ఏప్రిల్పదకొండు వరకు ముడి చమురు సగటు ధర 121.28 డాలర్లు. కేంద్ర ప్రభుత్వ సంస్థ పీపీఏసీ వెల్లడించిన సమాచారం ప్రకారం 2022 జూన్ 10న మనం కొనుగోలు చేసిన చమురు ధర 121.28 డాలర్లు. 2012లో అప్పటి ప్రభుత్వం చెల్లించిన మొత్తం రూ. 6,201.05 కాగా... ఎనిమిదేళ్ల పాలనలో నరేంద్ర మోదీ అదే డాలర్లకు చెల్లించిన మొత్తం రూ. 9,434.29. రూపాయి విలువ పతనాన్ని అరికట్టలేకపోవడం వల్ల ఈ రోజు మనం ప్రతీ ముడిచమురు పీపాకు పదేళ్ల నాటి కంటే అదనంగా రూ.3,233.24 చెల్లి స్తున్నాం. పదేళ్ల క్రితం డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 51.13 ఉండగా మోదీ పాలనలో అది రూ. 80 దాటింది. పదేళ్ల క్రితం, ఇప్పుడు ముడి చమురు ధర ఒకే విధంగా ఉన్నప్పటికీ రూపాయి పతనం కారణంగా మనం చెల్లించే మొత్తం భారీగా పెరిగింది. రూపాయి పతనంతో దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దిగజారుతోంది. దీంతో అప్పులు కూడా కట్టలేని స్థితికి చేరుకుంటోంది. రాబోయే 9 నెలల్లో దాదాపు 621 బిలియన్ డాలర్ల అప్పులు చెల్లించాల్సి ఉంది. ఇందులో ఇప్పటి వరకు 40 శాతం... అంటే 267 బిలియన్ల అప్పు ఇంకా పెండింగ్ లోనే ఉందని స్వయంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కలే చెబుతున్నాయి. ఇది మన దగ్గరున్న విదేశీమారక నిల్వల్లో 44 శాతానికి సమానం. మరోవైపు రూపాయి పతనాన్ని అరి కట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ తన దగ్గర ఉన్న డాలర్లను మార్కెట్లో అమ్ముతోంది. గత డిసెంబరు 31 నాటికి 633.6 బిలియన్ డాలర్లుండగా, జూన్ 24న 593.3 బిలియన్ డాలర్లకు విదేశీ మారక ద్రవ్యం తగ్గింది. ఈ ఏడాది రెండో అర్ధభాగంలో డాలర్‌తో రూపాయి మారకం విలువ 77–81 మధ్య ఉండొచ్చని అంచనా (ఇప్పుడున్న ముడిచమురు ధరలు స్థిరంగా ఉంటేనే). రూపాయి పడితే ఇబ్బందేంటి అన్న అనుమానం సామాన్య మానవునికి రావచ్చు. అసలు సమస్య అంతా అక్కడే ఉంది. రూపాయి పడితే బడా వ్యాపారవేత్తలకంటే కూడా సాధారణ పౌరులే ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తుంది. మనం ఇతర దేశాల నుండి కొన్న వస్తువులకు వాళ్లు డాలర్ల లెక్కలోనే బిల్లు ఇస్తారు. అప్పుడు మనం రూపాయిలను డాలర్లుగా మార్చి చెల్లించాలి. అంటే రూపాయి విలువ తరిగే కొద్దీ మనం ఎక్కువ ధనాన్ని దిగు మతులకు చెల్లించవలసి ఉంటుందన్నమాట. ఈ లెక్కన దిగుమతి చేసుకునే అన్ని వస్తువుల ధరలూ పెరుగుతాయి. గ్యాస్, పెట్రోల్ వంటివాటి ధరలు పెరగడం వల్ల అన్ని వినియోగ వస్తువుల ధరలూ పెరుగుతాయి. రూపాయి పతనానికి ముకుతాడు వేయకుంటే... ప్రస్తుతం శ్రీలంకలో ఉన్న పరిస్థితులు అతి త్వరలోనే భారత్‌లో కనిపించే ప్రమాదముందని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. - వై. సతీష్ రెడ్డి చైర్మన్, తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ -
హమ్మయ్య! వాటి ధరలు తగ్గుతున్నాయని సంతోషించేలోగా..
మండే ఎండలను మించి పెట్రోలు, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. అంతర్జాతీయ ధరలను అనుసరించి రేట్లు సవరిస్తున్నట్లు ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి. దీంతో ఈ అంతర్జాతీయంగా ధరలు ఎప్పుడు తగ్గుతాయా అంటూ సామాన్యులు ఎదురు చూస్తున్నారు. రష్యా ఉక్రెయిన్ల మధ్య శాంతి చర్చల రూపంలో ఆ తరుణం రానే వచ్చింది. ఇక పెట్రోలు ధరలు ఏమైనా తగ్గుతాయేమో అనుకునేలోగా మళ్లీ కథ మొదటికి వచ్చింది. ఉక్రెయిన్ రష్యా యద్ధం మొదలైన తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశాన్నంటాయి. 2022 మార్చిలో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 140 డాలర్లకు ఎగిసింది. మొత్తంగా మార్చి నెల సగటు 112 డాలర్లుగా నమోదు అయ్యింది. అంతకు ముందు ఫిబ్రవరిలో ఈ సగటు ధర 94 డాలర్లు ఉండగా జనవరిలో 84.67 డాలర్లుగా ఉంది. యుద్ధం మొదలైన తర్వాత బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 25 డాలర్లకు పైగానే పెరిగింది. దీంతో మన దగ్గర లీటరు పెట్రోలు, డీజిల్ ధరలను పది రూపాయలకు పైగానే ఆయిల్ సంస్థలు పెంచాయి. మార్చి చివరి వారం నుంచి ఉక్రెయిన్ - రష్యాల మధ్య శాంతి చర్చలు మొదలయ్యాయి. అంతర్జాతీయ ఆంక్షల కారణంగా రష్యా మొత్తబడుతున్నట్టు కనిపించింది. దీంతో ముడి చమురు ధరలు తగ్గుతూ వచ్చాయి. ఏప్రిల్ 1 నుంచి 12 వరకు ముడి చమురు సగటు ధర 98.48 డాలర్లుగా వచ్చింది. మార్చి సగటు 112 డాలర్లతో పోల్చితే దాదాపు 13 డాలర్ల వరకు ధర తగ్గింది. యుద్ధం ముగిసిపోతే సాధారణ పరిస్థితులు నెలకొని బ్యారెల్ ధరలు తగ్గి రిటైల్ మార్కెట్లో పెట్రోలు ధరలు తగ్గుతాయనే నమ్మకం ఏర్పడింది. ఉక్రెయిన్ మొండి వైఖరి కారణంగా శాంతి ప్రక్రియల నుంచి వెనక్కి తగ్గుతున్నామని, యుద్ధం మరింత కాలం కొనసాగవచ్చంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన తాజా ప్రకటనతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. పుతిన్ ప్రకటనకి ముందు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 98 డాలర్ల దగ్గర ఉండగా పుతిన్ ప్రకటన వెలువడిన తర్వాత 2022 ఏప్రిల్ 13న 104 డాలర్లకు చేరుకుంది. ఒక్కరోజులోనే దాదాపు 6 డాలర్లు పెరిగింది. 2020 ఏప్రిల్‌లో బ్రెంట్ రకం క్రూడ్ ఆయిల్ బ్యారెల్ సగటు ధర రూ. 63 డాలర్లుగా ఉంది. ఆ సమయంలో మన దగ్గర లీటరు పెట్రోలు ధర రూ. 75 ఉండగా డీజిల్ ధర రూ.65లుగా ఉంది. అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా బ్యారెల్ ధర 99 డాలర్లు ఉండగా హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ. 119 డీజిల్ ధర 115 దగ్గర ఉంది. యుద్ధం మరింత కాలం కొనసాగితే పెట్రో బాదుడు తప్పేలా లేదు. చదవండి: అంతర్జాతీయంగా కొన్ని శక్తులు కుమ్మక్కై ధరలు పెంచేస్తున్నాయి -
మళ్లీ చమురు సెగలు, బేరుమంటున్న స్టాక్ మార్కెట్లు!
న్యూయార్క్: అంతర్జాతీయంగా బ్యారెల్ క్రూడాయిల్ ధర తిరిగి 100 డాలర్ల పైకి చేరకోవడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో వారాంతపు రోజున బలహీనతలు నెలకొన్నాయి. మరోవైపు ఉక్రెయిన్–రష్యాల మధ్య శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ యుద్ధం మాత్రం ఆగకపోవడం మరింత ఒత్తిడిని పెంచుతోంది. అమెరికాతో నెలకొన్న వాణిజ్య వివాదాలతో పాటు ఉక్రెయిన్‌పై రష్యా కొనసాగిస్తున్న పోరుపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ శుక్రవారం ఫోన్లో మాట్లాడతారని వైట్‌హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పరిణామాల దృష్ట్యా ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తున్నారు. ఆసియా మార్కెట్లలో జపాన్, చైనా, సింగపూర్ సూచీలు అరశాతం నుంచి ఒకశాతం వరకు లాభపడ్డాయి. ఇండోనేసియా, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్ సూచీలు ఒకశాతం నుంచి అరశాతం నష్టాలను చవిచూశాయి. యూరప్ మార్కెట్లు ఒకశాతం క్షీణించాయి. అమెరికా మార్కెట్లు ఆరశాతం నష్టంతో మొదలయ్యాయి. బీఓజే వడ్డీరేట్లు యథాతథం బ్యాంక్ ఆఫ్ జపాన్(బీఓజే) కీలక వడ్డీరేట్లను మరోసారి యథాతథంగా ఉంచింది. రెండు రోజుల పాటు ద్రవ్య సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన కమిటీ శుక్రవారం నిర్ణయాలను వెల్లడించింది. ‘‘ద్రవ్య పరపతి విధానంలో ఎలాంటి మార్పులు చేపట్టడం లేదు. ఆర్థిక వృద్ధి పుంజుకునే చర్యల్లో భాగంగా కీలక వడ్డీరేట్లను మైనస్ 0.1 శాతంగానే కొనసాగిస్తూ.., వ్యవస్థలోకి పది బిలియన్ల డాలర్ల లిక్విటిడీని పంపిణీ చేస్తాము’’ అని తెలిపింది. నికాయ్, షాంఘైలు ప్లస్ .., హాంగ్‌సెంగ్, కోప్సీలు మైనస్ బ్యాంక్ ఆఫ్ జపాన్(బీఓజే) కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచడంతో జపాన్ ఇండెక్స్ నికాయ్ అరశాతానికి పైగా లాభపడి 26,827 వద్ద స్థిరపడింది. ఆర్థిక పరిపుష్టికి చర్యలను చేపడతామని విధాన నిర్ణేతల హామీతో చైనా స్టాక్ మార్కెట్ వరుసగా మూడోరోజూ బలపడింది. ఆ దేశ ప్రధాన స్టాక్ సూచీ షాంఘై కాంపోసైట్ ఒకశాతానికి పైగా పెరిగి 3,251.07 వద్ద స్థిరపడింది. రెండు రోజుల పాటు భారీగా ర్యాలీ చేసిన హాంగ్‌కాంగ్ మార్కెట్లో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. హాంగ్‌సెంగ్ సూచీ ఆరశాతం క్షీణించి 21,412 వద్ద నిలిచింది. తాజాగా కోవిడ్ కేసుల పెరుగుదల భయాలతో ఆసియాలోని ఇండోనేషియా, దక్షిణ కొరియా, థాయిలాండ్ సూచీలు ఒకశాతం నుంచి అరశాతం నష్టాలను చవిచూశాయి. ఒక శాతం పతనమైన యూరప్ మార్కెట్లు జర్మనీ చెందిన డాక్స్ ఇండెక్స్ ఒకశాతం క్షీణించి 14,267 వద్ద ముగిసింది. ఫ్రాన్స్ స్టాక్ సూచీ సీఏసీ 0.80% పతనమైన 6,570 వద్ద స్థిరపడింది. బ్రిటన్ ఇండెక్స్ ఎఫ్టీఎస్ఈ 100 అరశాతం నష్టపోయి 7,367 వద్ద ట్రేడ్ అవుతోంది. నష్టాలతో మొదలు అమెరికా మార్కెట్లు 3 రోజుల వరుస లాభాలకు ముగింపు పలుకుతూ అమెరికా మార్కెట్లు శుక్రవారం నష్టాలతో మొదలయ్యాయి. డోజోన్స్, ఎస్అండ్పీ 500, నాస్డాక్ సూచీలు అరశాతానికి పైగా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఫెడ్ వడ్డీరేట్ల పెంపు నేపథ్యంలో గత 3 రోజులుగా ఈ సూచీలు లాభాలతో ముగిశాయి. -
రూ.2కే లీటర్ పెట్రోల్.. ఏ దేశంలో తెలుసా?
ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న రష్యా దాడులు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపుతోంది. ఉక్రెయిన్ పరిణామాలతో భారత్‌లోనూ ధరాఘాతం నెలకొంటోంది. పలు నిత్యవసరాలు, ఇతర వస్తువల ధరలు రోజురోజుకూ పెరిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా బ్యారేల్ చమరు ధర 130 డాలర్లకు చేరుకుంది. దీంతో చాలా దేశాలలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మన దేశంలో కూడా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలతో పోల్చితే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా భారీగా పెరగాల్సి ఉంది. కానీ, ఇప్పటికే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు జీవనకాల గరిష్టానికి చేరుకోవడంతో ఆయిల్ ధరల విషయంలో ఆయిల్ కంపెనీలు, కేంద్ర ప్రభుత్వం వేచిచూసే ధోరణి అవలంభిస్తున్నాయి. హోలీ పండుగ తర్వాత ఏ క్షణమైనా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశముందన్న ప్రచారం రెండ్రోజుల క్రితం నుంచి జరుగుతోంది. అయితే పెట్రో ధరల విషయంలో గుడ్ న్యూస్ అందుతోంది. పెట్రో ధరలు త్వరలో తగ్గే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రష్యా నుంచి డిస్కౌంట్ ధరకు భారీగా ముడిచమురును ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు దిగుమతి చేసుకుంటున్నాయి. భారత్‌కు తక్కువ ధరకే ముడిచమురు ఇస్తామని ఇప్పటికే రష్యా బంపర్ ఆఫర్ ప్రకటించడంతో వచ్చే కాలంలో ఇంధన ధరలు తగ్గనున్నట్లు సమాచారం. అయితే, మన దేశంలో పెట్రోల్ ధరలు రూ.100కి పైగా ఉంటే, ఇతర దేశాలలో పెట్రోల్ ధరలు ఎంతగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. దక్షిణాసియాలో పెట్రోల్ ధరలు: మన దాయాది దేశం అయిన పాకిస్తాన్'లో ఒక లీటర్ పెట్రోల్ ధర 0.837 డాలర్లు(సుమారు రూ.63.43) ఉండగా, శ్రీలంకలో ఇది 1.111 డాలర్లు(రూ. 84) వద్ద ఉంది. బంగ్లాదేశ్ దేశంలో వాహనదారులు ప్రతి లీటర్ ఇంధనానికి $1.035(రూ.78.43) చెల్లిస్తూ ఉంటే, నేపాల్'లో ఉన్నవారు $1.226(రూ.93) చెల్లిస్తున్నారు. మన చుట్టూ పక్క దేశాలతో పోలిస్తే మన దేశంలోనే చమరు ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. లీటర్ పెట్రోల్ చౌకగా దొరికే దేశాలు: ఇతర దేశాలలో పోలిస్తే ప్రపంచంలోనే పెట్రోల్ ధర తక్కువగా ఉన్న దేశం "వెనిజులా". ఈ దేశంలో ఒక లీటర్ పెట్రోల్ $0.025(రూ.1.89)గా ఉంది. ఆ తర్వాత లిబియాలో ఇంధనం చౌకగా ఉంది. ఇక్కడ ఒక లీటర్ పెట్రోల్ ధర $0.032(రూ.2.43)గా ఉంది. పెట్రోల్ ధర ఎక్కువగా ఉన్న దేశాలు: ఇతర దేశాలలో పోలిస్తే ప్రపంచంలోనే పెట్రోల్ ధర ఎక్కువగా ఉన్న దేశం "హాంగ్ కాంగ్". ఈ దేశంలో ఒక లీటర్ పెట్రోల్ $2.879(రూ.218)గా ఉంది. ఆ తర్వాత లిబియాలో ఇంధనం చౌకగా ఉంది. ఆ తర్వాత నార్వే, నెదర్లాండ్స్, ఫిన్లాండ్, లిచెన్ స్టెయిన్, జర్మనీ వంటి దేశాలలో ఇంధనం ధర లీటరుకు రూ.200కు పైగా ఉంది. (చదవండి: దేశ చరిత్రలో ఇదే తొలిసారి! కరోనా ఉన్నా..అదరగొట్టిన పన్నువసూళ్లు, ఏకంగా!) -
అన్నంతపని చేసిన అమెరికా.. మిగిలిన దేశాలకు ఇబ్బందులు
న్యూయార్క్: అమెరికా రష్యాల మధ్య ఆధిపత్య పోరుతో క్రూడ్ ధర అంతర్జాతీయంగా సెగలు పుట్టిస్తోంది. ఉక్రెయిన్‌పై రష్యా తీవ్ర దాడుల నేపథ్యంలో ఆ దేశం నుంచి దిగుమతులను నిషేధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించడంతో చమురు మంట మరింత ఎగసింది. మంగళవారం బ్రెంట్ క్రూడ్ బ్యారల్ ధర క్రితం ముగింపుతో పోల్చితే 8 శాతం పైగా (దాదాపు 9 డాలర్లు) లాభంతో 132 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక అమెరికా నైమెక్స్ క్రూడ్ కూడా ఇదే స్థాయిలో ఎగసి 129 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. 2008 తరువాత ఇంత తీవ్ర స్థాయిలో క్రూడ్ ధరలు చూడటం ఇదే తొలిసారి. ఇప్పటి వరకూ క్రూడ్ గరిష్ట స్థాయి 147 డాలర్లు. ప్రపంచ ఆర్థిక సంక్షోభం సమయంలో 2008 జూలైలో క్రూడ్ ఈ స్థాయిని చూసింది. సందిగ్ధంలో యూరప్ ప్రపంచ ముడి చమురు సరఫరాల్లో రష్యా వాటా 7 శాతం ఉండగా, ఉత్పత్తిలో 10 శాతం ఉంది. అమెరికా దిగుమతి చేసుకున్న ముడి చమురులో రష్యా వాటా కేవలం 10 శాతమే. ఇదే యూరప్ దేశాల విషయానికి వస్తే అధికంగా ఉంది. ఒక్క జర్మనినీ పరిశీలిస్తే ఆ దేశ అవసరాల్లో 40 శౠతం ముడిచమురు, సహాజవాయువుని రష్యా నుంచి దిగుమతి చేసుకుంటుంది. దీంతో అమెరికా తరహాలో రష్యా నుంచి సరఫరాలపై నిషేధంపై యూరోపియన్ యూనియన్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతోంది. 200 డాలర్లకు రష్యా నుంచి ముడిచమురు, గ్యాస్ దిగుమతులపై ఆంక్షలు విధిస్తే బ్యారెల్ ముడిచమురు ధర 300 డాలర్ల వరకు చేరుకోవచ్చంటూ రష్యా ఉప ప్రధాని అలెగ్జాండ్ నోవాక్ ఇప్పటికే హెచ్చరించారు. అయితే అంతర్జాతీయ చమురు మార్కెట్ విశ్లేషకులు, ట్రేడర్లు మాత్రం త్వరలోనే క్రూడ్ 200 డాలర్లను తాకొచ్చన్న అంచనాలు వెలిబుచ్చుతున్నారు. రూపాయి మరింత పతనం అంతర్జాతీయంగా తీవ్ర ప్రతికూల పరిణామాల నేపథ్యంలో ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ వరుసగా రెండవరోజూ కొత్త కనిష్టాన్ని తాకింది. ట్రేడింగ్‌లో 7 పైసలు నష్టపోయి జీవితకాల కనిష్టం 77 వద్ద ముగిసింది. వరుసగా ఐదు ట్రేడింగ్ సెషన్ల నుంచి రూపాయి జారుడుబల్లపై కొనసాగుతోంది. ట్రేడింగ్‌లో 77.02 వద్ద ప్రారంభమైన రూపాయి విలువ 76.71 గరిష్ట–77.05 కనిష్ట స్థాయిలను చూసింది. రూపాయికి ఇంట్రాడే కనిష్టం (77.05)–ముగింపుల్లో (77) సోమవారం స్థాయిలే రికార్డులు. చదవండి: భారీ డిస్కౌంట్‌కు రష్యా ఆయిల్ -
యుద్ధం ప్రత్యక్ష ప్రభావం భారత్‌పై ఎలా ఉండబోతుంది? పూర్తి వివరాలు
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రత్యక్ష ప్రభావం భారత్‌పై ఉండదని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) ఎకనమిక్స్ రిసెర్చ్ రిపోర్ట్ విశ్లేషించింది. చమురు ధరల భారీ పెరుగుదలే భారత్ ఎకానమీకి అతిపెద్ద సవాలని శుక్రవారం విడుదల చేసిన నివేదిక పేర్కొంది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... కీలక అంశాలు - బేరల్‌కు 75 డాలర్లు ఉంటుందన్న అంచనాల ప్రాతిపదికన 2022–23 వార్షిక బడ్జెట్ రూపొందింది. అయితే సరఫరాలు కొరత, యుద్ధం వంటి పరిణామాలతో క్రూడ్ బేరల్‌కు 100 డాలర్లు దాటింది. ఇది ద్వైపాక్షిక వాణిజ్యం, కరెన్సీ మార్పిడులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే అంశం. - కమోడిటీ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం తీవ్రత వంటి అంశాలు ప్రపంచ దేశాల ముందు ఉన్న ప్రధాన సవాళ్లు. దీర్ఘకాలం ఇదే ధోరణి కొనసాగితే పరిస్థితి వృద్ధి మందగమనానికి దారితీసే వీలుంది - ఇరాన్ తరహాలో పాశ్చాత్య చెల్లింపులు, ఫాస్ట్–మెసేజింగ్ వ్యవస్థల నుండి రష్యాను మినహాయించే స్థాయికి శత్రుత్వాలు – ఉద్రిక్తతలు పెరిగితే ఇంధన సరఫరాల అంతరాయం కారణంగా వృద్ధికి తీవ్ర విఘాతం ఏర్పడవచ్చు. రష్యా తన గ్యాస్‌లో 40 శాతం, బొగ్గుతో సహా సగం ఘన ఇంధనం, చమురులో నాలుగింట ఒక వంతు ఐరోపాకు సరఫరా చేస్తుంది. ఇతర తీవ్ర ఆంక్షల సంగతి ఎలాఉన్నా, ఇప్పటివరకు గ్లోబల్ పేమెంట్ వ్యవస్థ నుండి రష్యాను అమెరికా నిషేధించకపోవడం గమనార్హం. - యుద్ధ పరిస్థితికి ముందే 2022–23 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం, ఫిబ్రవరి తొలి వారంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలు జరిగాయి. దీనితో ఆయా నిర్ణయాలు, అంశాలు యుద్ధ పరిణామాలను పరిగణనలోకి తీసుకుని ఉండకపోవచ్చు. ఈ తరహా సవాళ్లు భారత్ ఎకానమీలో తక్షణ అనిశ్చితికి దారితీయవచ్చు. - ముడి చమురు ధరల పెరుగుదల ప్రభావం ఎకానమీపై ఏ స్థాయిలో ఉంటోందన్న అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించాలించాల్సిన అవసరం ఉంది. ద్రవ్యలోటు తగ్గింపు, స్థిరీకరణ బాటలో ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో రుణ సమీకరణ పరిమాణం భారీగానే ఉంది. ఆయా అంశాల నేపథ్యంలో సబ్బిడీల పెంపు, పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాల కోతకు అవకాశాలు చాలా పరిమితమే. 2022–23 ఆర్థిక సంవత్సరంలో తన వ్యయాల కోసం కేంద్రం రుణ సమీకరణల లక్ష్యం రూ.11,58,719 కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాలకన్నా (రూ.9,67,708 కోట్లు) ఇది దాదాపు రూ.2 లక్షల కోట్లు అధికం. ద్వైపాక్షిక వాణిజ్యంపై ప్రభావం అంతంతే... భారత్‌కు రష్యా ప్రధాన వాణిజ్య భాగస్వామి కాదు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో, రష్యాకు భారతదేశం ఎగుమతులు కేవలం 2.7 బిలియన్ డాలర్లు. భారతదేశం మొత్తం ఎగుమతుల్లో ఈ వాటా 0.9 శాతం. రష్యాకు ప్రధాన ఎగుమతుల్లో ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రికల్ మెషినరీ విభాగాలు ఉన్నాయి. ఇక ఇదే సమయంలో రష్యా నుండి భారతదేశం దిగుమతులు 5.5 బిలియన్ డాలర్లు. మొత్తం దిగుమతుల్లో ఈ వాటా 1.4 శాతం. రష్యా నుండి భారతదేశం దిగుమతుల్లో సగభాగం పెట్రోలియం ఉత్పత్తులే. ఇతర మార్కెట్లతో ఈ వాటాను సులభంగా భర్తీ చేయడానికి వీలుంది. ఆయా అంశాలను పరిగణనలోకి తీసుకుంటే రష్యాతో భారత్ ద్వైపాక్షిక వాణిజ్యంపై యుద్ధం ప్రభావం ఎటువంటి తీవ్ర ప్రభావం చూపదు. చమురు దిగుమతుల తీరిది... బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక ప్రకారం, భారతదేశ తన మొత్తం చమురు అవసరాలలో 80 శాతానికి పైగా దిగుమతి చేసుకుంటుంది. ముడి చమురు దిగుమతులకు సంబంధించి ప్రపంచంలో మూడవ అతిపెద్ద దేశంగా ఉంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో, భారతదేశం చమురు దిగుమతుల విలువ 82.7 బిలియన్ డాలర్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ 2021–జనవరి 2022 వరకూ) చమురు దిగుమతులు 125.5 బిలియన్ డాలర్లకు పెరిగాయి. దేశంలో ఎకానమీ రికవరీ, అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పెరుగుదల వల్ల ఆర్థిక సంవత్సరం ఇంకా దాదాపు రెండు నెలలు ఉండగానే దిగుమతులు విలువ భారీగా నమోదయ్యింది. చమురు ధరలు దాదాపు ఎనిమిది సంవత్సరాల గరిష్ట స్థాయిలో ఉన్నప్పటికీ దిగుమతులు విలువ తగ్గే పరిస్థితి ఏదీ కనిపించడం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చమురు దిగుమతుల విలువ 155.5 బిలియన్ డాలర్లకు చేరుతుందన్నది అంచనా. 2022–23లో ఎకానమీ రికవరీ వేగవంతం వల్ల చమురు దిగుమతులు మరింత పెరిగే అవకాశం ఉంది. 2022 ఏప్రితో ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో చమురు డిమాండ్ ఐదు శాతం పెరుగుతుందన్నది అంచనా. మిగిలిన అంశాలన్నీ యథాతథంగా కొనసాగుతాయని భావించిన పక్షంలో ఎగుమతులు–దిగుమతుల విలువ మధ్య నికర వ్యత్యాసం వాణిజ్య లోటు 165 బిలియన్ డాలర్లుగా నమోదయ్యే వీలుంది. చమురు ధరలు పెరిగే కొలదీ భారత్ దిగుమతుల భారం మరింత తీవ్రం అవుతుంది. శాశ్వత ప్రాతిపదికన చమురు ధరలలో ప్రతి 10 శాతం పెరుగుదలకు చమురు దిగుమతుల భారం 15 బిలియన్ డాలర్లు లేదా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీలో) 0.4 శాతం మేర పెరిగే అవకాశం ఉందన్నది అంచనా. ఇది దేశంలోకి వచ్చీపోయే విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య వ్యత్యాసాలను ప్రతిబింబించే కరెంట్ అకౌంట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. తీవ్ర కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) సమస్యకు ఈ పరిణామాలు దారితీయవచ్చు. చమురు అధిక ధరల వల్ల రూపాయి కూడా బలహీనపడే వీలుంది. ఇది వాణిజ్యలోటును మరింత పెంచే అంశం. ఆయా అంశాలు విదేశీ మారకానికి సంబంధించి దేశానికి ప్రతికూలంగా మారతాయి. కరెంట్ అకౌంట్– ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2 శాతం (జీడీపీ విలువలో) లోటును నమోదుచేస్తుందని ఆర్బీఐ పాలసీ సమీక్ష అంచనావేసినప్పటికీ, చమురు ధరల తీవ్ర స్థాయిలో కొనసాగితే అంచనాలు మరింత పెంచాల్సిన అవసరం ఏర్పడుతుంది. ద్రవ్యోల్బణం సవాళ్లు టోకు ధరల ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) ఉత్పత్తుల బాస్కెట్లో ముడి చమురు సంబంధిత ఉత్పత్తుల వెయిటేజ్ 7.3 శాతంగా ఉంది. అందువల్ల చమురు ధరలలో 10 శాతం పెరుగుదల ప్రత్యక్ష ప్రభావం డబ్ల్యూపీఐపై 0.7 శాతంగా అంచనా ఉంటుందని అంచనా. పరోక్ష ప్రభావాన్ని కూడా జతచేస్తే, మొత్తం ప్రభావం డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణంలో దాదాపు 1 శాతంగా ఉండవచ్చు. ఇక వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణంపై చమురు ధరల పెరుగుదల ప్రభావం ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉంటుంది. చమురు ధరలలో 10 శాతం పెరుగుదల కారణంగా రిటైల్ ద్రవ్యోల్బణం 0.15 శాతం పెరిగే వీలుంది. సరఫరా చైన్‌కు సంబంధించి పరోక్ష ప్రభావం, ఇతర ధరల పెరుగుదల కారణంగా 0.25–0.35 శాతం మేర వస్తువులు, సేవల ధరల పెరుగుదల ఉండవచ్చు. ద్వైపాక్షిక చెల్లింపుల్లో సమస్యలు ఉండవు-పారిశ్రామిక వర్గాల అంచనా రష్యాపై ఇతర పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించినా ఆ దేశంతో ద్వైపాక్షిక చెల్లింపులపై ప్రభావం ఉండకపోవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. మారక రేట్లలో హెచ్చుతగ్గులు తప్ప పెద్దగా మార్పులు ఉండబోవని పేర్కొన్నాయి. సాధారణంగా ఇరు దేశాల మధ్య ఎగుమతులు, దిగుమతులకు చెల్లింపులు భారత కరెన్సీ అయిన రూపాయల్లో జరుగుతుంటాయి. కాబట్టి పాశ్చాత్య దేశాల ఆంక్షల ప్రభావం చెల్లింపుల విషయంలో ప్రభావం చూపకపోవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. గతంలో ఇరాన్‌పై ఆంక్షలు అమలైనప్పుడు కూడా ఆ దేశంతో లావాదేవీల కోసం భారత్ ఇలాంటి వ్యూహాన్నే అనుసరించింది. దీని ప్రకారం ఇరాన్ నుంచి దిగుమతి చేసుకునే భారత వ్యాపార వర్గాలు .. రూపాయి మారకంలో యూకో బ్యాంకులోని ఇరానియన్ బ్యాంకుల ఖాతాలో చెల్లింపులను డిపాజిట్ చేసేవి. ఇరాన్‌కు ఎగుమతి చేసే భారతీయ ఎగుమతిదారులకు ఈ ఖాతా నుంచే రూపాయి మారకంలో చెల్లింపులు జరిగేవి. ఈ లావాదేవీలన్నింటినీ ఏ రోజుకు ఆ రోజు సెటిల్ చేసేవారు. భారత్‌కు రక్షణ రంగ ఉత్పత్తులను రష్యా భారీగా సరఫరా చేస్తోంది. ఇంధనాలు, న్యూక్లియర్ రియాక్టర్లు, బాయిలర్లు మొదలైనవి ఎగుమతి చేస్తోంది. భారత్ నుంచి ఫార్మా ఉత్పత్తులు, ఎలక్ట్రికల్ యంత్ర పరికరాలు తదితర ఉత్పత్తులు రష్యాకు ఎగుమతి అవుతున్నాయి. సీఏఐటీ ఆందోళన రష్యా–ఉక్రెయిన్ మధ్య నెలకొన్న సంక్షోభం ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యంపై ఎక్కువగా ఉంటుందని అఖిల భారత వర్తకుల సమాఖ్య (సీఏఐటీ) ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా మహమ్మారి నుంచి దేశీ వాణిజ్యం కోలుకుంటుండగా, ఈ ప్రయత్నాలను దెబ్బతీస్తుందని పేర్కొంది. చమురు ధరలు పెరగడం అత్యంత కీలకమైన అంశమని, ధరల పెరుగుదలకు ఇది దారితీస్తుందని వివరించింది. తయారీ, వస్తు రవాణా వ్యయాలు పెరిగి, ఉత్పత్తుల ధరలు మరింత భారం అవుతాయని వివరించింది. చదవండి: Russia Ukraine War: సూపర్‌గా మారితే తప్ప చైనా ముప్పుని ఎదుర్కోలేం? -
రూపాయికి ‘వైరస్’ భయం
ముంబై: కోవిడ్–19 కొత్త వేరియంట్ల భయాలు శుక్రవారం రూపాయిని బలహీనపరచాయి. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ 37పైసలు బలహీనపడి 74.89 వద్ద ముగిసింది. రూపాయికి ఇది నెల కనిష్ట స్థాయి. గురువారం రూపాయి ముగింపు 74.52. ట్రేడింగ్‌లో రూపాయి విలువ 74.60 వద్ద ప్రారంభమయ్యింది. 74.58 కనిష్ట–74.92 గరిష్ట స్థాయిల మధ్య కదలాడింది. కరోనా వైరస్ భయాలతో ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు భారీగా పడిపోతున్నాయి. ఈక్విటీ మార్కెట్ల భారీగా నిధులు వెనక్కు మళ్లడంతో డాలర్ ఇండెక్స్ బలోపేతం అవుతోంది. ఈ వార్త రాస్తున్న రాత్రి 11 గంటల సమయంలో అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ నష్టాల్లో 74.89 ట్రేడవుతుండగా, ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ప్రాతిపదకన లెక్కించే డాలర్ ఇండెక్స్ భారీ లాభాల్లో 96 వద్ద ట్రేడవుతోంది. రూపాయికి ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). క్రూడ్ ధర పతనం... ఇక వైరస్ వేరియంట్ల భయాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మరోసారి సవాళ్లు విసిరే అవకాశం ఉందన్న అంచనాలు క్రూడ్‌పై ప్రభావం చూపుతోంది. అంతర్జాతీయంగా నైమెక్స్ స్వీట్ క్రూడ్ బేరల్ ధర శుక్రవారం 10 శాతం పైగా పతనమై, 70 డాలర్ల లోపు ట్రేడవుతోంది. బ్రెంట్ విషయంలో ఈ ధర 74కు పడిపోయింది. బంగారం అప్... సురక్షిత సాధనంగా ఇన్వెస్టర్ తక్షణం బంగారం ధరపై దృష్టి సారించినట్లు కనబడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ వార్త రాస్తున్న సమయంలో ఔన్స్ (31.1గ్రా) ధర 25 డాలర్ల వరకూ పెరిగి, 1,810 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. దీనికి అనుగుణంగా దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లో పసిడి ధర 10 గ్రాములకు రూ.500 లాభంతో 47,900 వద్ద ట్రేడవుతోంది. -
జులైలో ముడి చమురు ఉత్పత్తి తగ్గింది
న్యూఢిల్లీ: దేశీయంగా ముడిచమురు ఉత్పత్తి జులైలోనూ క్షీణించింది. గతేడాది(2020) ఇదే నెలతో పోలిస్తే 3.2 శాతం తగ్గి 2.5 మిలియన్ టన్నులకు పరిమితమైంది. ప్రధానంగా ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్జీసీ లక్ష్యాన్ని అందుకోలేకపోవడం ప్రభావం చూపింది. ఈ ఏడాది(2021–22) తొలి 4 నెలల్లో సైతం దేశీ చమురు ఉత్పత్తి 3.4 శాతం నీరసించి 9.9 మిలియన్ టన్నులకు చేరింది. పెట్రోలియం, సహజవాయు శాఖ విడుదల చేసిన గణాంకాలివి. గత నెలలో ఓఎన్జీసీ 4.2 శాతం తక్కువగా 1.6 మిలియన్ టన్నుల చమురును వెలికి తీసింది. ఇక ఏప్రిల్–జులై మధ్య 4.8 శాతం క్షీణించి 6.4 మిలియన్ టన్నులకు పరిమితమైంది. అయితే నేచురల్ గ్యాస్ ఉత్పత్తి పుంజుకుంది. చదవండి : Flipkart: కిరాణా వర్తకులకు ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్ -
పసిడి, వెండి, చమురు- ‘జో’రు
న్యూయార్క్/ ముంబై : డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ అమెరికా 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నట్లు స్పష్టత రావడంతో బంగారం, వెండి ధరలతోపాటు.. ముడిచమురు సైతం ‘జో’రందుకుంది. జో బైడెన్ విజయంపై అంచనాల నేపథ్యంలో వారాంతాన బంగారం, చమురు ధరలు బలపడిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టడంతో ఫ్యూచర్స్ మార్కెట్లో ధరలు వేడెక్కాయి. వెరసి న్యూయార్క్ కామెక్స్ లో పసిడి ఔన్స్ 1964 డాలర్లను అధిగమించగా.. వెండి 26 డాలర్లను తాకింది. లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 40 డాలర్లకు ఎగువన ట్రేడవుతోంది. దేశీయంగా వెండి కేజీ 66,000 మార్క్ ను దాటగా.. పసిడి 10 గ్రాములు రూ. 52,000 ఎగువన ట్రేడవుతోంది. నిధుల ఆశలు ప్రభుత్వం నుంచి నిధుల విడుదల(స్టిములస్)కు బైడెన్ విజయం దోహద పడనుందన్న అంచనాలు పసిడి ధరలకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు ఆర్థిక వ్యవస్థకు దన్నుగా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ సైతం సహాయక ప్యాకేజీలకు మద్దతు పలకడం కమోడిటీలకు బలాన్నిస్తున్నట్లు తెలియజేశారు. ఆర్థిక వ్యవస్థకు దన్నుగా కనీసం ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీకి ప్రభుత్వం ఆమోదముద్ర వేయవచ్చన్న అంచనాలు బలపడుతున్నట్లు వివరించారు. వివరాలు చూద్దాం.. లాభాలతో.. దేశీయంగా ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 223 పుంజుకుని రూ. 52,390 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో 52,520 వద్ద గరిష్టాన్ని తాకింది. ఇదేవిధంగా 52,225 వద్ద కనిష్టాన్ని చేరింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 880 లాభపడి రూ. 66,215 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 66,390 వరకూ జంప్ చేసిన వెండి తదుపరి రూ. 65,849 వరకూ వెనకడుగు వేసింది. కామెక్స్‌లో.. వారం చివర్లో జోరందుకున్న బంగారం ధరలు న్యూయార్క్ కామెక్స్‌లో మరోసారి బలపడ్డాయి. ఔన్స్(31.1 గ్రాములు) పసిడి 0.65 శాతం పుంజుకుని 1,964 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 0.55 శాతం లాభంతో 1,962 డాలర్లకు చేరింది. వెండి సైతం దాదాపు 1.4 శాతం ఎగసి ఔన్స్ 26.01 డాలర్ల వద్ద కదులుతోంది. చమురు వేడి ప్రస్తుతం న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ చమురు 2.8 శాతం జంప్ చేసి 38.18 డాలర్లను తాకగా.. లండన్ మార్కెట్లో బ్రెంట్ బ్యారల్ 2.55 శాతం ఎగసి 40.5 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
బడ్జెట్ తర్వాత భారీ పెట్రో షాక్
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రో ఉత్పత్తుల ధరలు బుధవారం భారీగా పెరిగాయి. బడ్జెట్ అనంతరం ఒకేరోజు ఈస్ధాయిలో పెట్రో ధరలు పెరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భగ్గుమనడంతో పాటు సౌదీ చమురు క్షేత్రాలపై డ్రోన్ దాడుల నేపథ్యంలో పెట్రో ధరలు పేట్రేగిపోతున్నాయి. బుధవారం లీటర్ పెట్రోల్ ధర రూ 25 పైసలు పెరగ్గా, డీజిల్ ధర లీటర్‌కు 24 పైసల మేర పెరిగింది. పెట్రో ధరల పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ 72.42 కాగా, హైదరాబాద్‌లో రూ 76.99 ముంబైలో రూ 75.26, చెన్నైలో రూ 69.57, కోల్‌కతాలో రూ 68.23 పలికింది. -
‘చమురు’ ధరతో ఆటలు!
ఈమధ్య కాలంలో పైపైకి పోవడం తప్ప కిందకు దిగడం తెలియని పెట్రోల్, డీజిల్ ధరలు గురువారం హఠాత్తుగా రూటు మార్చుకుని తగ్గుముఖం పట్టాయి. ప్రతి లీటర్‌కూ వసూలు చేస్తున్న ఎక్సైజ్ సుంకంలో రూ. 2.50 కోత విధించుకుంటున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించటమే ఇందుకు కారణం. అంతేకాదు...రాష్ట్రాలు కూడా ఇదే తరహాలో తాము వసూలు చేసే వ్యాట్‌లో లీటర్‌కు రూ. 2.50 చొప్పున తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం సలహా ఇచ్చింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు అనేకం వెనువెంటనే దాన్ని శిరసావహించాయి. ఇతర రాష్ట్రాలు కూడా ఆ బాటలో వెళ్తే ఈ రెండింటి ధరలూ లీటర్‌కు రూ. 5 మేర తగ్గుతాయి. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక పెట్రో ధరలు డజనుసార్లు పెరిగాయి. ఇలా పెరిగిన ప్రతిసారీ జనంలో ఆగ్రహావేశాలు వ్యక్తమైనా పట్టించుకోలేదు. గత నెల 11న విపక్షాలు భారత్ బంద్‌కు పిలుపునివ్వగా పుండు మీద కారం జల్లినట్టు అదే రోజు పెట్రో ధరలు మరికాస్త పెరిగాయి. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు బ్యారెల్ ధర 86 డాలర్లుంది. నాలుగేళ్లలో ఇది అత్యధికం. దీనికితోడు రూపాయి విలువ నానాటికీ దిగజారుతోంది. డాలర్‌తో పోలిస్తే దాని ప్రస్తుత విలువ రూ. 73.81. ఇలాంటి పరిస్థితుల్లో చమురు ధరల పెంపు పర్యవసానాలు బహుముఖంగా ఉంటాయి. సరుకు రవాణా చార్జీలు తడిసిమోపెడై నిత్యావసరాలు, కూరగాయల ధరలు అమాంతం ఆకాశాన్నంటుతాయి. ఫలితంగా ద్రవ్యోల్బణం పెరుగుతుంది. దీన్ని అరికట్టడానికి రిజర్వ్‌బ్యాంకు రుణాలపై వడ్డీ రేట్లు పెంచుతుంది. దాని ప్రభావం వల్ల వృద్ధి మందగిస్తుంది. ఇలా ఒకదానికొకటి ముడి పడి ఉండే అనేక పరిణామాలు ఆర్థిక వ్యవస్థకు చేటు తెస్తాయి. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చేనాటికి ఉన్న అంతర్జాతీయ పరిణామాలవల్ల చమురు ధరలు తగ్గటం మొదలయ్యాయి. ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసేనాటికి చమురు ధర అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ 115 డాలర్లుంటే ఏడాది తిరిగేసరికల్లా అది 53.36 డాలర్లకు చేరుకుంది. మన చమురు అవసరాల్లో దాదాపు 80 శాతం దిగుమతులపైనే ఆధారపడతాం గనుక ఇలా ధరలు పడిపోవడం వల్ల ఒక్కసారిగా మన కరెంట్ అకౌంట్ లోటు తగ్గడం ప్రారంభించింది. లక్షల డాలర్ల విదేశీ మారకద్రవ్యం ఆదా కావడం మొదలైంది. అయితే మోదీ ప్రభుత్వం చమురు ధరల తగ్గుదలను వినియోగదారులకు బదిలీ చేసే ప్రయత్నం చేయలేదు. ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతూ పోయి భారీ మొత్తంలో ఆదాయాన్ని రాబట్టింది. 2014 నవంబర్ మొదలు 2016 జనవరి వరకూ 9 సార్లు ఈ సుంకాన్ని పెంచింది. నిరుడు అక్టోబర్‌లో ఒక్క సందర్భంలో మాత్రం ఎక్సైజ్ సుంకంలో కోత విధించింది. గత ఏడు నెలల్లో పెట్రోల్‌పై లీటర్‌కు దాదాపు రూ. 6, డీజిల్‌పై లీటర్‌కు దాదాపు 6.50 చొప్పున పెరిగింది. ఈ పెట్రో ధరల పెరుగుదలలో రాష్ట్రాల పాత్ర తక్కువేమీ కాదు. అవి వ్యాట్(విలువ ఆధారిత పన్ను) పేరుతో బాదుతుంటాయి. సరుకు విలువను బట్టి ఈ పన్ను విధిస్తారు గనుక కేంద్రం పెట్రో ధరలు పెంచినప్పుడల్లా రాష్ట్రాలకు పండగే. వ్యాట్ ద్వారా వాటి ఆదాయం అంతకంతకు పెరుగుతూ పోతుంది. ఈ వ్యాట్ అన్నిచోట్లా ఒకేలా లేదు. పెట్రోల్‌పై అత్యధికంగా వ్యాట్ విధించే రాష్ట్రాల్లో అగ్ర స్థానం మహారాష్ట్రది. అది పెట్రోల్‌పై 38.11 శాతం, డీజిల్‌పై 24.78 శాతం వ్యాట్ వసూలు చేస్తోంది. పెట్రోల్‌పై ఆంధ్రప్రదేశ్ 35.77 శాతం వ్యాట్ వసూలు చేస్తుండగా...డీజిల్‌పై మాత్రం అందరికన్నా ఎక్కువగా 28.08 శాతం వసూలు చేస్తోంది. కనుకనే ఇరుగు పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే పెట్రోల్, డీజిల్ ధరలు ఆంధ్రప్రదేశ్‌లో చాలా ఎక్కువ. ప్రతి పెట్రోల్ బంక్ వద్దా పెట్రోల్, డీజిల్ ధరలతోపాటు ఆ ధరలో ఎవరి వాటా ఎంతో వివరంగా ప్రదర్శిస్తే అందరి వేషాలూ బయటపడతాయి. ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి ఆంధ్రప్రదేశ్ పెట్రోల్‌పైనా, డీజిల్‌పైనా విధించిన వ్యాట్ ద్వారా రూ. 1,208 కోట్లు ఆర్జిస్తుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధ్యయన బృందం నివేదిక అంచనా వేసింది. చమురుపై విధించే వ్యాట్ ద్వారా రూ. 10,800 కోట్లు ఆర్జించాలని 2018–19 బడ్జెట్లో చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించుకోగా ఆ లక్ష్యానికి మించే ఆదాయం లభిస్తుందని ఈ నివేదిక చూస్తే అర్థమవుతుంది. ఒకపక్క జనంపై ఇలా ఎడాపెడా వ్యాట్ పేరుతో బాది భారీగా ఆదాయం గడిస్తూ బిచ్చం వేసినట్టు లీటర్‌కు రూ. 2 తగ్గించామని బాబు సర్కారు ఆర్భాటంగా గత నెలలో ప్రకటించింది. ఇప్పటివరకూ పొందిన ఆదాయాన్ని, ఆ రాష్ట్రం పెట్టుకున్న లక్ష్యాన్ని బేరీజు వస్తే పెట్రోల్‌పై లీటర్‌కు రూ. 3, డీజిల్‌పై లీటర్‌కు రూ. 2.50 వరకూ తగ్గించవచ్చునని ఎస్బీఐ అధ్యయన నివేదిక లెక్కేసింది. చమురుపై మొత్తంగా రాష్ట్రాల ఆదాయం రూ. 23,000 కోట్లు దాటుతుందని ఆ నివేదిక చెబుతోంది. ఇప్పుడు హఠాత్తుగా ధరల్ని తగ్గించడానికి త్వరలో ముంచుకొస్తున్న అసెంబ్లీ ఎన్నికలు, అటుపై వచ్చే సార్వత్రిక ఎన్నికలు కారణమని సులభంగానే అర్ధమవుతుంది. కేంద్రం తగ్గించిన ఎక్సైజ్ సుంకం రూ. 2.50లో కేంద్రం వాటా రూ. 1.50 మాత్రమే. మరో రూపాయిని చమురు సంస్థలు భరిస్తాయి. 2013 జనవరిలో అప్పటి యూపీఏ సర్కారు పెట్రోల్ ధరపై నియంత్రణ ఎత్తేసింది. ఇకపై అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా ఆ ధరలుంటాయని చెప్పింది. ఎన్డీఏ సర్కారు వచ్చిన వెంటనే డీజిల్‌పై కూడా నియంత్రణ తొలగించింది. ఆ విధానానికే కట్టుబడి ఉంటే ఈపాటికల్లా చమురు ధరలు బాగా తగ్గాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చమురు రంగంపై ఆధారపడి ఏటా లక్షల కోట్ల మేర ఆదాయం గడిస్తున్న తీరు సరికాదని గతంలో రంగరాజన్ కమిటీ హితవు పలికింది. ఇతరేతర రంగాల ద్వారా వనరులు పెంచుకోవాలని సూచించింది. కానీ ఆ కమిటీ నివేదికను పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు ఎక్సైజ్ సుంకం తగ్గించటం మంచిదే. కానీ ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని చమురు ధరలు మరింత తగ్గేలా చూడాలి. అది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కనీస బాధ్యత. -
ఆగని పెట్రో ధరలు
-
రూపాయి, విదేశీ ఇన్వెస్టర్లే కీలకం
ముడిచమురు ధర కదలికలు కూడా... * ఈ వారం మార్కెట్‌పై నిపుణుల అంచనా.. న్యూఢిల్లీ: డాలరుతో రూపాయి మారకం విలువ హెచ్చుతగ్గులు, అంతర్జాతీయంగా ముడిచమురు ధరల కదలికలతోపాటు విదేశీ ఇన్వెస్టర్ల ధోరణి... ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లకు కీలకం కానున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రధానంగా ఇప్పటికిప్పుడు మన మార్కెట్లను అత్యంత ప్రభావితం చేసే కీలకాంశాలేవీ(ట్రిగ్గర్స్) లేకపోవడమే దీనికి కారణమనేది వారి అభిప్రాయం. క్రిస్మస్, కొత్త సంవత్సరం సెలవుల తర్వాత అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకునే కదలికలపై కూడా దేశీ మార్కెట్లు దృష్టిసారించనున్నాయని వారు చెబుతున్నారు. ఇక 2016 కొత్త సంవత్సరంలో ప్రభుత్వం అమలు చేసే సంస్కరణల పక్రియ, బడ్జెట్‌పై అంచనాలు మార్కెట్లలో మొదలవుతాయని శామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోదీ వ్యాఖ్యానించారు. ఈ వారం కొంత లాభాల స్వీకరణకు అవకాశం ఉందని.. దీంతో సూచీల కదలికలు అక్కడక్కడే ఉండొచ్చని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, అంతర్గతంగా మార్కెట్ సెంటిమెంట్ ఇంకా పటిష్టంగానే కొనసాగుతోందన్నారు. మరోపక్క, డిసెంబర్ నెల వాహన విక్రయాల గణాంకాలకు అనుగుణంగా సోమవారం ఆటోమొబైల్ స్టాక్స్ స్పందించే అవకాశం ఉంది. గత నెలలో అమ్మకాలు మెరుగైన స్థాయిలో నమోదైన సంగతి తెలిసిందే. ఇక సేవలు, తయారీ రంగానికి సంబంధించి పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎంఐ) డేటా కూడా ఈ వారంలో విడుదల కానుంది. దీని ప్రభావం కూడా మార్కెట్‌పై ఉండొచ్చని నిపుణులు చెప్పారు. ‘గ్లోబల్ మార్కెట్ల ట్రెండ్, విదేశీ ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) పెట్టుబడులు, రూపాయి, ముడిచమురు రేట్లు సమీప కాలంలో మాన మార్కెట్లకు దిశానిర్దేశం చేయనున్నాయి’ అని క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చ్ డెరైక్టర్ వివేక్ గుప్తా పేర్కొన్నారు. ఎఫ్‌పీఐలు భారత్‌పై ఎలాంటి ధోరణిని అనుసరిస్తారనేదే రానున్న కాలంలో మన మార్కెట్‌కు కీలకంగా నిలుస్తుందని జియోజిత్ బీఎన్పీ పారిబా ఫండమెంటల్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. ఇక కార్పొరేట్ కంపెనీల క్యూ3 ఫలితాలు కూడా స్వల్పకాలికంగా కీలకమైన అంశమేనని చెప్పారు. ‘వచ్చే ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ల లాభాలు పుంజుకోవచ్చన్న విశ్వాసం మెండుగా ఉన్న నేపథ్యంలో మార్కెట్లు క్రమంగా మెరుగుపడతాయని భావిస్తున్నాం. దీనికి ఆర్థిక వ్యవస్థ పటిష్టత ప్రధానంగా దోహదం చేయనుంది’ అని కోటక్ సెక్యూరిటీస్ సీఈఓ కమలేష్ రావు పేర్కొన్నారు. గత వారం మార్కెట్... దేశీ మార్కెట్లు గత వారం కూడా లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 322 పాయింట్లు ఎగబాకి 26,161 వద్ద స్థిరపడింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 102 పాయింట్లు లాభపడి 7,963 వద్ద ముగిసింది. గడిచిన ఏడాది(2015) మొత్తంమీద చూస్తే సెన్సెక్స్ 1,382 పాయింట్లు(5 శాతం) క్షీణించిన సంగతి తెలిసిందే. బాండ్లలో పడిపోయిన ఎఫ్‌పీఐల పెట్టుబడులు న్యూఢిల్లీ: విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) గతేడాది దేశీ డెట్ మార్కెట్లో(బాండ్లు) చేసిన నికర పెట్టుబడులు భారీగా దిగజారాయి. 2015 మొత్తంలో కేవలం 7.4 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.45,856 కోట్లు) మాత్రమే ఇన్వెస్ట్ చేశారు. 2014లో ఈ పెట్టుబడుల విలువ 26 బిలియన్ డాలర్లు(సుమారు రూ.1.6 లక్షల కోట్లు) కావడం గమనార్హం. ఇక స్టాక్స్‌లో కూడా అత్యంత తక్కువ స్థాయిలో నికరంగా 17,806 కోట్లను మాత్రమే గతేడాది ఎఫ్‌పీఐలు ఇన్వెస్ట్ చేసినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంతక్రితం మూడేళ్లలో వరుసగా దాదాపు రూ. లక్ష కోట్ల చొప్పున ఈక్విటీ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు నమోదయ్యాయి. అంతర్జాతీయంగా ఆర్థిక వృద్ధి మందగమనం, చైనాలో స్టాక్ మార్కెట్ల పతనం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు వంటివి ఎఫ్‌పీఐల పెట్టుబడులపై ప్రభావం చూపాయనేది విశ్లేషకుల అభిప్రాయం. -
'హామీలను టీఆర్ఎస్ నెరవేర్చడం లేదు'
హైదరాబాద్: ఎన్నికల హామీలను అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చడం లేదని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ దిగ్విజయ్ సింగ్ గురువారం అన్నారు. కాంగ్రెస్ పార్టీ సమావేశంలో మట్లాడుతూ.. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గినా పెట్రోలు, డిజిల్ ధరలు ఏ మాత్రం తగ్గడం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పటిష్టత ఎజెండాగా సాగే చర్చలు ఫిబ్రవరి వరకూ కొనసాగుతాయని దిగ్విజయ్ తెలిపారు. పార్టీనేతల నుంచి అభిప్రాయాలు సేకరించి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి నివేదిక అందిస్తామని దిగ్విజయ్ చెప్పారు. పెట్రోలు, డీజిల్‌లపై కేంద్రం, రాష్ట్రాలు వ్యాట్, ఎక్సైజ్ పన్నులు వినియోగదారులపై భారం పెంచుతున్నాయి అని దిగ్విజయ్ పేర్కొన్నారు. -
నియంత్రణ ఎత్తేయడం న్యాయమా?!
కీలెరిగి వాత... వీలెరిగి చేత అంటారు. దేశంలో సంస్కరణలకు ఆద్యుడిగా, ఆర్థికవేత్తగా ఎన్ని భుజకీర్తులున్నా మన్మోహన్సింగ్ చేయ సాహసించని పనిని ఎన్డీయే సర్కారు సునాయాసంగా పూర్తిచేసింది. కీలక రాష్ట్రాలైన మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలు పూర్తయిన వెంటనే డీజిల్ ధరలపై ఉన్న నియంత్రణను ఎత్తేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఎప్పుడో ఏడాదికి గానీ ‘ఎన్నికల బాదరబందీ’ లేకపోవడం...అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర పల్టీలు కొడుతుండటం గమనించి చేయదల్చుకున్న పనికి ఇదే సరైన అదునని భావించింది. ఈ నిర్ణయంవల్ల సామాన్యులపై ఎలాంటి భారమూ పడబోదని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటనలో వాస్తవం లేకపోలేదు. కనీసం ఇప్పటికైతే అది నూటికి నూరుపాళ్లూ నిజం. సామాన్యులపై భారం పడలేదు సరిగదా... అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా డీజిల్ లీటర్‌కు రూ. 3.37 తగ్గింది కూడా. కనుక నియంత్రణ ఎత్తేయడంపై పెద్దగా వ్యతిరేకతలు, నిరసనలు కూడా వ్యక్తంకాలేదు. అయితే, ఇలా నియంత్రణ ఎత్తేయడమనే చర్య పర్యవసానాలు భవిష్యత్తులో చాలా తీవ్రంగానే ఉంటాయి. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు సద్దుమణి గాక ముడి చమురు ధర ఎప్పటిలా ఆకాశాన్నంటితే...దానికి అనుగుణంగా పెరిగే డీజిల్ ధరను తట్టుకోవడం సామాన్యులకు అసాధ్యమవుతుంది. అసలు యూపీఏ ప్రభుత్వమే డీజిల్‌పై నియంత్రణను ఎత్తేయాలనుకుని ఆ పనిని ఒకేసారి చేస్తే తమ భవిష్యత్తు ఏమవుతుందోనన్న బెంగతో వాయిదాల పద్ధతిలో అమలుకు నిరుడు జనవరిలో ద్వారాలు తెరిచింది. సబ్సిడీ పూర్తిగా తొలగేవరకూ నెలకు లీటర్‌కు అర్థరూపాయి చొప్పున పెంచుకుంటూ పోవాలని తీర్మానించింది. అందుకనుగుణంగా డీజిల్ ధర ఇప్పటికి 19సార్లు పెంచింది. ఇలా లీటర్‌కు మొత్తం మీద రూ. 9.50 పెరిగింది. పెట్రో ధరల నియంత్రణ వ్యవహారం ఆదినుంచీ రాజకీయ చట్రంలో పడి నలుగుతున్నది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకమాట, అధికారంలోకొచ్చాక మరో మాట మాట్లాడటం ప్రధాన రాజకీయ పక్షాలకు అలవాటుగా మారింది. వాజపేయి సర్కారు 2002లో నియంత్ర ణను ఎత్తివే స్తున్నట్టు ప్రకటించగానే అప్పట్లో విపక్షంలో ఉన్న కాంగ్రెస్ విరుచుకుపడింది. తాను అధికారంలోకొచ్చాక 2004లో మళ్లీ నియంత్రణను అమల్లోకి తెచ్చింది. కానీ, 2010లో తిరిగి ఎన్డీయే బాటలోనే వెళ్లింది. పెట్రోల్ ఒక్కదానిపైనా నియంత్రణ ఎత్తేస్తున్నామని, సామాన్యుల జీవితాలతో ముడిపడి ఉండే డీజిల్, కిరోసిన్, వంటగ్యాస్ జోలికి వెళ్లడంలేదని చెప్పింది. తీరా నిరుడు జనవరిలో డీజిల్‌పై ‘పాక్షికంగా’ నియంత్రణ ఎత్తేస్తున్నామని చిదంబరం ప్రకటించారు. అయితే ఇది కేవలం ‘చిన్న చిన్న సవరణలు’ చేసుకోవడానికి చమురు సంస్థలకిచ్చిన అనుమతి మాత్రమేనని సర్దిచెప్పారు. ఈ ‘చిన్న చిన్న సవరణల’ పర్యవసానమేమిటో ఏడాదిన్నర వ్యవధిలోనే లీటర్‌కు అదనంగా రూ. 9.50 చెల్లించవలసి వచ్చాక సామాన్యులకు అర్థమైంది. ఇప్పుడిక ఎన్డీయే వంతు వచ్చింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో చమురు ధరలు పడిపోతున్న ప్రస్తుత తరుణంలోనే డీజిల్‌పై కూడా నియంత్రణను వదులుకోవాలని నిర్ణయించింది. గత మూడు నెలలుగా ముడి చమురు ధర ఎన్నడూ లేనంతగా పతనమైంది. 105 డాలర్లున్న బ్యారెల్ చమురు ధర 83 డాలర్లకు చేరుకుంది. ఫలితంగా పెట్రోల్ ధర లీటర్‌కు రూ. 7 వరకూ తగ్గింది. సంపన్నులు వాడే కార్లలో అధికభాగం డీజిల్వే కావడంవల్ల దానికిస్తున్న సబ్సిడీ వృథా అవుతున్నదని మాంటెక్ సింగ్ అహ్లూవాలియా వంటి ఆర్థిక నిపుణులు బాధపడతారు. అయితే, డీజిల్ పాత్ర అంతకన్నా కీలకమైనది. దేశంలో నిత్యమూ ఒకచోటునుంచి మరో చోటుకు నిత్యావసరాలను చేరవేసే వాహనాలన్నీ డీజిల్‌తో నడిచేవే. డీజిల్ ధర ఏ కొంచెం పెరిగినా అదంతా నిత్యావసరాల ధరలపై ప్రభావాన్ని చూపి ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది. సామాన్యుల ఆదాయంలో సగభాగం ఆహారావసరాలకు ఖర్చవుతుందంటారు. అలా చూసుకుంటే అధిక ధరల ప్రభావం వారిపై ఎంతగా పడుతుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పెట్రో ధరలు పెంచే ప్రతిసారీ అందుకు అంతర్జాతీయ పరిస్థితులను కారణంగా చూపడం మన పాలకులకు అలవాటైన విద్య. అయితే, మన పొరుగునున్న పాకిస్థాన్ తదితర దేశాలతో పోల్చినా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉంటాయి. ఎక్కడా లేనివిధంగా పెట్రో ఉత్పత్తులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులే ఇందుకు కారణం. పెట్రోల్‌పై 50 శాతంవరకూ, డీజిల్‌పై 36 శాతంవరకూ విధిస్తున్న పన్నుల ద్వారా ప్రభుత్వాలకు వార్షికంగా దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల ఆదాయం లభిస్తున్నది. ఈ స్థితిని హేతుబద్ధం చేయాల్సివున్నదని గతంలో రంగరాజన్ కమిటీ నివేదిక స్పష్టంచేసింది. తమ ఆదాయ వనరుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా ఒకే ఒక్క రంగంపై ఇంతగా ఆధారపడటం మంచిదికాదని చెప్పింది. దిగుమతి చేసుకునే ముడి చమురుపై దాని అసలు ధరకు పన్నులను చేర్చి చమురు సంస్థలకు అమ్ముతున్నది కేంద్రమే. చమురు సంస్థలకు ఇలా ధర పెంచి అమ్ముతూ ప్రజలకు మాత్రం ఫలానా రేటుకు మించి అమ్మరాదని ఇన్నాళ్లూ ఆంక్షలు పెట్టిందీ కేంద్రమే. నష్టాలొస్తున్నాయని ఆ సంస్థలు మొత్తుకుంటే...దాన్ని సాకుగా చూపి నియంత్రణ ఎత్తివేస్తున్నదీ వారే. ఇలా సంక్లిష్టంగా తయారైన చమురు ధర పెంపు ప్రక్రియను హేతుబద్ధీకరిస్తే, అంతర్గత సామర్థ్యాన్ని పెంచుకుని వృథా వ్యయం అరికడితే చమురు సంస్థలకు వచ్చే నష్టాలు అదుపులోకొస్తాయి. ఎన్డీయే సర్కారు ఈ కోణంలో ఆలోచించకపోవడం దురదృష్టకరం.